ఫ్రెండ్లీ మ్యాచ్‌ రద్దు  | Friendly Football Match Of Germany And Italy Cancelled Due To Corona Virus | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్లీ మ్యాచ్‌ రద్దు 

Mar 15 2020 3:43 AM | Updated on Mar 15 2020 3:43 AM

Friendly Football Match Of Germany And Italy Cancelled Due To Corona Virus - Sakshi

బెర్లిన్‌: జర్మనీ, ఇటలీ ఫుట్‌బాల్‌ జట్ల మధ్య ఈ నెల 31న జరగాల్సిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ రద్దయింది. ఈ మ్యాచ్‌ బవేరియా ప్రాంతం (జర్మనీలో)లోని న్యూరెమ్‌బర్గ్‌లో జరగాల్సి ఉండగా... ప్రస్తుతం అక్కడ కరోనా ఉధృతి అధికంగా ఉండటంతో బహిరంగ ప్రదేశాల్లో 100 మందికి మించి జనం గుమికూడదని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో నిర్వాహకులు ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు. తొలుత ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌ను జరపాలని అనుకున్నా... జట్టు సభ్యులు, వారి సిబ్బంది, మీడియా ప్రతినిధులు, సెక్యూరిటీతో స్టేడియంలోని జనం సంఖ్య 100 మందికిపైగా చేరుకుంటుండటంతో రద్దు చేయడానికే జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్య నిర్ణయించుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement