Friendly match
-
భారత్ X మలేసియా
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ నగరం ఇప్పుడు మరో అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు వేదిక కానుంది. గచ్చిబౌలి వేదికగా నేడు మలేసియాతో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు స్నేహపూర్వక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడమే ఏకైక లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ ఏడాది ఆరంభంలో ఏఎఫ్సీ ఆసియా కప్ సందర్భంగా గాయపడి తిరిగి కోలుకున్న సీనియర్ డిఫెండర్ సందేశ్ జింగాన్ 10 నెలల తర్వాత పునరాగమనం చేయనుండటంతో భారత జట్టు డిఫెన్స్ బలం మరింత పెరగనుంది. చివరగా భారత జట్టు హైదరాబాద్‌లో ఆడిన మ్యాచ్‌ల్లో మారిషస్, వియత్నాంతో ‘డ్రా’ చేసుకొని సిరియా చేతిలో 0–3తో పరాజయం పాలైంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 2027 ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు ముందు భారత ఫుట్‌బాల్ జట్టుకు ఇదే చివరి మ్యాచ్. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 32 మ్యాచ్‌లు జరగగా... చెరో 12 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. మరో ఎనిమిది మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. భారత ఫుట్‌బాల్ జట్టు ఇప్పటి వరకు అత్యధిక సార్లు తలపడిన జట్టు మలేసియానే కావడం విశేషం. ఫిఫా ప్రపంచ ర్యాకింగ్స్లో ప్రస్తుతం భారత జట్టు 125వ స్థానంలో ఉండగా... మలేసియా 133వ ప్లేస్‌లో ఉంది. అయితే విదేశీ ఆటగాళ్లను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించడంతో మలేసియా జట్టు... టీమిండియా కంటే మెరుగైన స్థితిలో కనిపిస్తోంది. భారత జట్టు తరఫున గోల్ కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు, సందేశ్ జింగాన్, మెహతాబ్, విశాల్, రోషన్ సింగ్, అమరిందర్ సింగ్, సురేశ్ సింగ్ కీలకం కానున్నారు. భారత ఆటగాళ్లకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) అనుభవం ఈ మ్యాచ్‌లో కలిసిరానుంది. ఈ ఏడాది ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆరింట ఓడి, మరో నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకున్న భారత్... తొలి విజయం కోసం ఎదురు చూస్తోంది. ఆసక్తి గల అభిమానులు ్టజీఛిజ్ఛ్టుజ్ఛnజ్ఛీ.జీn లో మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. -
12న భారత్, వియత్నాం ఫుట్‌బాల్ మ్యాచ్
న్యూఢిల్లీ: భారత సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ జట్టు ఈ నెల 12న వియత్నాంతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. నిజానికి వియత్నాంలో ఈనెల 7 నుంచి 15 వరకు భారత్ ముక్కోణపు టోర్నీలో పాల్గొనాల్సి ఉండగా... మూడో దేశం లెబనాన్ టోర్నీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం లెబనాన్‌లోని హెజ్»ొల్లా ఉగ్రవాద సంస్థ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర స్థాయిలో వైమానిక దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో లెబనాన్‌లో గగనతల ప్రయాణం క్లిష్టమైంది. దీంతో లెబనాన్ తప్పుకోవాల్సి వచ్చింది. ముక్కోణపు టోర్నీ సాధ్యపడకపోవడంతో ఇరు దేశాల ఫుట్‌బాల్ సమాఖ్యలు ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహణకు మొగ్గుచూపాయి. ‘లెబనాన్ వైదొలగడంతో ముక్కోణపు టోర్నీ రద్దయ్యింది. దీంతో ఆతిథ్య వియత్నాం జట్టుతో భారత సీనియర్ జట్టు ఏకైక ఫ్రెండ్లీ మ్యాచ్‌ను ఆడుతుంది’ అని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. వియత్నాం రాజధాని హనోయ్‌కి 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న తియెన్ తువోంగ్ స్టేడియంలో ఈ నెల 12న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అక్కడికి బయలుదేరే ముందు భారత ఫుట్‌బాల్ ఆటగాళ్లంతా 5న కోల్‌కతాలో కలుసుకుంటారు. హెడ్‌కోచ్ మనొలో మార్కెజ్ నేతృత్వంలో 6న ట్రెయినింగ్ సెషన్లో పాల్గొంటారు. ఆ మరుసటి రోజే కోల్‌కతా నుంచి వియత్నాంకు భారత జట్టు పయనమవుతుంది. ఇదివరకే ఈ మ్యాచ్ కోసం 26 మంది సభ్యులతో కూడిన ప్రాబబుల్స్‌ను ప్రకటించారు. వియత్నాం బయలుదేరేముందు తుది 23 సభ్యుల జట్టును ఖరారు చేస్తారు. -
ఒకరు 6 సెకన్లలో... మరొకరు 7 సెకన్లలో....
బ్రాటిస్లావా (స్లొవేకియా): అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఆదివారం అద్భుతం జరిగింది. వేర్వేరు వేదికల్లో జరిగిన రెండు అధికారిక ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో రెండు ఫాస్టెస్ట్ గోల్స్ నమోదయ్యాయి. బ్రాటిస్లావాలో స్లొవేకియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ్రస్టియా 2–0తో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆట మొదలైన 6 సెకన్లకే ఆ్రస్టియా ప్లేయర్ క్రిస్టోఫ్ బామ్గార్ట్నర్ గోల్ చేశాడు. మిడ్ ఫీల్డ్ నుంచి క్షణాల్లో ముగ్గురు డిఫెండర్లను తప్పించుకొని ముందుకు దూసుకెళ్లిన క్రిస్టోఫ్ లాంగ్షాట్తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. మరోవైపు లియోన్‌లో ఫ్రాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జర్మనీ జట్టు 2–0తో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ఆట మొదలైన 7 సెకన్లకే జర్మనీ ప్లేయర్ ఫ్లోరియన్ విట్జ్ గోల్ చేశాడు. ఇన్నాళ్లూ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఫాస్టెస్ట్ గోల్ చేసిన రికార్డు లుకాస్ పొడోల్‌స్కీ పేరిట ఉంది. 2013లో ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌లో పొడోల్‌స్కీ 9వ సెకనులో గోల్ సాధించాడు. పొడోల్‌స్కీ 11 ఏళ్ల రికార్డు ఒకేరోజు బద్దలు కావడం విశేషం. -
మెస్సీని మిస్సయ్యాం!.. అర్జెంటీనా వస్తానంటే భారత్ వద్దన్నది
లియోనల్ మెస్సీకి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. అతను ఒక మ్యాచ్ ఆడితే కోట్లలో వీక్షిస్తారు. అలాంటి మెస్సీ మన దేశానికి వచ్చి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతానంటే భారత్ వద్దనడం ఆశ్చర్యం కలిగించింది. అర్జెంటీనా ప్రస్తుతం ఫుటబాల్లో చాంపియన్ అన్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ సేన ఫ్రాన్స్‌పై ఫూటౌట్లో 4-2తో విజయం సాధించి మూడోసారి వరల్డ్‌కప్ గెలుచుకుంది. అన్నీ తానై నడిపించిన మెస్సీ అర్జెంటీనాకు కప్ అందించి 36 సంవత్సరాల నిరీక్షణకు తెరదించాడు. ఇలాంటి మేటి చాంపియన్ టీమ్ వచ్చి ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడతామంటే ఫుట్‌బాల్ అభివృద్ధి కోరే ఏ దేశమైనా ఎగిరి గంతేస్తుంది. ఎర్రతివాచీ పరిచి మరీ ఆహ్వానిస్తుంది. కానీ జనాభాలో చైనాను మించిన భారత్ మాత్రం తమ ఫుట్‌బాల్ అబిమానులకు నిరాశ కలిగించే నిర్ణయంతో అర్జెంటీనా వస్తనంటే వద్దన్నది. అర్జెంటీనా జట్టు అయినా.. ఆ జట్టు ఆటగాళ్లయినా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్. అలాంటి జట్టు అప్పియరెన్స్ ఫీజుగా 50 లక్షల డాలర్లు(రూ.40 కోట్లు) ఇస్తే చాలు అందుబాటులో ఉన్న జూన్ 12 నుంచి 20వ తేదీల్లో భారత్ వేదికపై ఒక మ్యాచ్ ఆడి వెళతామంది. కానీ అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF) అంత మొత్తం ఇవ్వలేం అనేసరికి మెస్సీ టీమ్ జూన్ 15న బీజింగ్‌లో ఆస్ట్రేలియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది. మనకంటే చిన్నదేశం ఇండోనేషియా వాళ్లు అడిగినంత ఫీజులో ఏ లోటు లేకుండా చెల్లించి జకార్తాలో 19న అర్జెంటీనాతో మ్యాచ్ ఆడి తమ కోరికను నెరవేర్చుకుంది. అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న మన భారత్ మాత్రం రూ. 40 కోట్లు ఇచ్చుకోలేక అర్జెంటీనాతో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించడం విస్మయం కలిగించే అంశం. చదవండి: #LionelMessi: ఆపడం ఎవరి తరం.. కెరీర్లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ -
#LionelMessi: ఆపడం ఎవరి తరం.. కెరీర్లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ మంచి దూకుడు మీద ఉన్నాడు. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ గెలిచినప్పటి నుంచి మెస్సీలో ఉత్సాహం మాత్రం తగ్గడం లేదు. పైగ రోజురోజుకు మెస్సీ క్రేజ్ పెరుగుతూనే ఉంది. అతని జోరు.. ఫిట్నెస్ చూస్తుంటే మరో ఫిఫా వరల్డ్‌కప్ ఆడేలా కనపిస్తున్నాడు. తాజాగా గురువారం బీజింగ్ వేదికగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్‌లో మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ నమోదు చేశాడు. ఆట మొదలైన నిమిషం 19 సెకన్ల వ్యవధిలోనే మెస్సీ అర్జెంటీనాకు గోల్ అందించాడు. మెస్సీ కెరీర్లో ఇదే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గత ఏడు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా తరపున మెస్సీకి ఇది ఏడో గోల్ కాగా.. ఓవరాల్‌గా ఈ ఏడాది 13 మ్యాచ్‌ల్లో 17 గోల్స్ చేసిన మెస్సీ.. 5 అసిస్ట్‌లు అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అర్జెంటీనా ఆస్ట్రేలియాపై 2-0 తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే మెస్సీ గోల్ అందించగా.. ఆట 68వ నిమిషంలో జెర్మన్ పెజెల్లా జట్టుకు రెండో గోల్ అందించాడు. Leo Messi. After one minute. Of course ☄️ (via @CBSSportsGolazo)pic.twitter.com/r5UknzrZvB — B/R Football (@brfootball) June 15, 2023 చదవండి: ఐపీఎల్ బంధం ముగిసే.. మేజర్ లీగ్ క్రికెట్లో మొదలు -
చైనాలో మెస్సీకి చేదు అనుభవం.. కారణం?
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి చైనాలో చేదు అనుభవం ఎదురైంది. పాస్‌పోర్ట్ విషయంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు మెస్సీని అడ్డుకోవడం ఆందోళన కలిగించింది. విషయంలోకి వెళితే.. ఈ గురువారం(జూన్ 15న) బీజింగ్ వేదికగా ఆస్ట్రేలియాతో అర్జెంటీనా అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం జూన్ 10న మెస్సీ చైనాలోని బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టాడు. అయితే పాస్‌పోర్ట్ చెక్ చేసిన పోలీసులు మెస్సీని అడ్డుకున్నారు. మెస్సీకి చైనా వీసా లేదని, అప్లై కూడా చేసుకోలేదని వివరించారు. అయితే తన దగ్గరున్న స్పానిష్, అర్జెంటీనా పాస్‌పోర్టును అందజేసిన మెస్సీ.. తైవాన్లాగే చైనాలో కూడా తనకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందని భావించానని తెలిపాడు. కానీ చైనాలోకి రావాలంటే వీసా ఉండాల్సిందేనని, వెంటనే అప్లై చేసుకోవాలని.. తైవాన్ రూల్ వర్తించదని పోలీసులు వెల్లడించారు. అయితే అధికారులు చొరవ తీసుకొని అప్పటికప్పుడు ఎమర్జెన్సీ కింద వీసా అందించి సమస్యను పరిష్కరించారు. దీంతో పోలీసులకు మెస్సీ కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా జూన్ 15న ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం జట్టుతో కలిసి ఇండోనేషియా వెళ్లనున్న మెస్సీ జూన్ 19న ఇండోనేషియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నాడు. ఇక గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ ఏడు గోల్స్‌తో గోల్డెన్ బాల్ అవార్డు కూడా అందుకున్నాడు. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనా మూడోసారి వరల్డ్‌కప్ గెలవడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు. -
హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. సెంచరీ కొట్టిన మెస్సీ
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ మంగళవారం మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అర్జెంటీనా తరపున వందో అంతర్జాతీయ గోల్ సాధించాడు. కురాకోతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అర్జెంటీనా 7-0తో రికార్డు విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. ఆట 20, 33, 37వ నిమిషాల్లో మెస్సీ గోల్స్ చేసి హ్యాట్రిక్‌తో పాటు వందో గోల్స్ సాధించాడు. ప్రస్తుతం మెస్సీ ఖాతాలో 102 గోల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ(174 మ్యాచ్‌ల్లో 102 గోల్స్) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్(198 మ్యాచ్‌ల్లో 122 గోల్స్) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెస్సీ మూడు గోల్స్ చేయగా.. నికోలస్ గొంజాలెజ్(ఆట 23వ నిమిషం), ఎంజో ఫెర్నాండేజ్(ఆట 35వ నిమిషం), ఏంజెల్ డి మారియా(ఆట 78వ నిమిషం), గొంజాలో మాంటెల్(ఆట 87వ నిమిషం)లో గోల్స్ చేయడంతో అర్జెంటీనా 7-0 తేడాతో కురాకోను చిత్తుగా ఓడించింది. కాగా మెస్సీకి అర్జెంటీనా తరపున ఇది ఏడో అంతర్జాతీయ హ్యాట్రిక్ గోల్స్ కావడం విశేషం. MESSI WHAT A CRAZY HALF, ENJOY THE GOALS!!!! 🐐🐐🐐 pic.twitter.com/f9nwKcoUeS — mx ⭐️⭐️⭐️ (@MessiMX30iiii) March 29, 2023 -
రొనాల్డో ప్రపంచ రికార్డు.. మెస్సీ చూస్తూ ఊరుకుంటాడా?
ప్రస్తుత ఫుట్‌బాల్ తరంలో లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఎవరికి వారే సాటి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు అందుకున్న ఈ ఇద్దరు సమానంగానే కనిపించినా మెస్సీ ఒక మెట్టు పైన ఉంటాడు. అందుకు కారణం గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను విజేతగా నిలపడమే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ అత్యధిక గోల్స్ చేసి 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనాకు మూడోసారి టైటిల్ అందించాడు. ఈ దెబ్బతో రొనాల్డో కాస్త వెనుకబడినట్లుగా అనిపించాడు. అయితే వ్యక్తిగతంగా చూస్తే మాత్రం ఇద్దరు పోటాపోటీగా ఉంటారు. ఒక రికార్డు రొనాల్డో బద్దలు కొట్టాడంటే వెంటనే మెస్సీ తన పేరిట ఒక రికార్డును లిఖించుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా రొనాల్డో దేశం తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే నీ వెనుకే నేను వస్తా అంటూ మెస్సీ కూడా తన కెరీర్లో 800వ గోల్ సాధించి కొత్త రికార్డు అందుకున్నాడు. బ్రూనస్ ఎయిర్స్ వేదికగా గురువారం అర్జెంటీనా, పనామాల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ సేన 2-0 తేడాతో విజయం సాధించింది. ఆట 89వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన ఫ్రీకిక్‌ను మెస్సీ తనదైన శైలిలో గోల్‌గా మలిచాడు. దీంతో తన కెరీర్లో 800వ గోల్ పూర్తి చేసుకున్న మెస్సీ అర్జెంటీనా తరపున 99వ గోల్ సాధించాడు. వంద గోల్స్ మార్క్‌ను చేరుకోవడానికి మెస్సీ ఇక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇక క్లబ్స్ తరపున 701 గోల్స్ చేసిన మెస్సీ ఓవరాల్‌గా 800 గోల్స్‌తో కొనసాగుతున్నాడు. గతేడాది డిసెంబర్లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచిన జట్టుతోనే అర్జెంటీనా బరిలోకి దిగడం విశేషం. Lionel Messi with an incredible free-kick 🇦🇷 We are witnessing greatness once again 🐐 pic.twitter.com/QBPUO7B9LY — SPORTbible (@sportbible) March 24, 2023 చదవండి: ఫుట్‌బాల్‌లో సంచలనం.. చారిత్రాత్మక గోల్ -
ఫుట్‌బాల్ చరిత్రలోనే తొలిసారి..
ఫుట్‌బాల్ ఆటలో రెడ్,యెల్లో కార్డ్‌లు జారీ చేయడం సాధారణంగా చూస్తుంటాం. గ్రౌండ్లో గొడవకు దిగడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించడం లాంటివి చేస్తే రెడ్‌కార్డ్ జారీ చేస్తారు. రెడ్‌కార్డ్ జారీ చేస్తే మ్యాచ్ ముగిసేవరకు మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఇక వార్నింగ్ ఇచ్చి వదిలేయడానికి యెల్లోకార్డ్ జారీ చేయడం చూస్తుంటాం. ఈ రెండుకార్డులు కాకుండా మరొక కార్డు ఉంటుంది. అదే వైట్‌కార్డ్. ఫుట్‌బాల్ చరిత్రలో ఈ కార్డులు ప్రవేశపెట్టినప్పటి నుంచి వైట్‌కార్డ్ చూపించింది లేదు. తాజాగా మాత్రం మహిళల ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా రిఫరీ వైట్‌కార్డ్ చూపించడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. శనివారం పోర్చుగల్‌లో బెన్ఫికా, స్పోర్టింగ్ లిస్బన్ మధ్య మహిళల ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో కాసేపట్లో తొలి హాఫ్ ముగుస్తుందన్న దశలో స్టాండ్స్‌లో ఒక అభిమాని అనారోగ్యానికి గురయ్యాడు. ఇది గమనించిన రిఫరీ వైట్‌కార్డ్ చూపించాడు. క్రీడలో వైట్‌కార్డ్ అనేది క్రీడాస్పూర్తికి చిహ్నంగా పరిగణిస్తారు. రిఫరీ వైట్‌కార్డ్ చూపెట్టగానే మెడికల్ సిబ్బంది సదరు అభిమానికి మెడికల్ ట్రీట్మెంట్ అందించారు. జరుగుతున్నది ఫ్రెండ్లీ మ్యాచ్ కాబట్టి ఇరుజట్ల మేనేజ్మెంట్కు క్రీడాస్పూర్తి చూపించాలనే ఇలా చేసినట్లు రిఫరీ మ్యాచ్ అనంతరం వెల్లడించారు. ఇక పోర్చుగల్ సహా ఫుట్‌బాల్ అంతర దేశాలలో వైట్‌కార్డ్ జారీని ప్రవేశపెట్టారు. ఇటీవలే ఫుట్‌బాల్ అంతర్జాతీయ గవర్నింగ్ బాడీ ఆటగాడు గాయపడితే కంకషన్ ప్లేయర్(సబ్‌స్టిట్యూట్) వచ్చేందుకు వైట్‌కార్డ్ ఉపయోగించడం మొదలుపెట్టింది. అలాగే ఖతర్ 2022 వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల్లోనూ వైట్‌కార్డ్‌ను ప్రవేశపెట్టినప్పటికి రిఫరీలు వాటిని ఉపయోగించలేదు. తాజాగా ఒక ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తొలిసారిగా వైట్‌కార్డ్ ఉపయోగించి రిఫరీ చరిత్ర సృష్టించాడు. As equipas médicas de Benfica e Sporting receberam cartão branco após assistirem uma pessoa que se sentiu mal na bancada 👏 pic.twitter.com/ihin0FAlJF — B24 (@B24PT) January 21, 2023 చదవండి: 'అలా అయితేనే టీమిండియాను కొట్టగలం'.. ఆసీస్‌కు సూచనలు 'పంత్ త్వరగా కోలుకోవాలి'.. టీమిండియా క్రికెటర్ల పూజలు -
ఒక్క చూపు సోషల్ మీడియాను షేక్ చేసింది..
లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్‌లో ఎవరికి వారే సాటి. అయితే మెస్సీ ఇటీవలే అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌కప్ అందించి రొనాల్డో కంటే ఒక మెట్టు పైనే ఉన్నాడు. మరో వరల్డ్‌కప్ జరిగేందుకు నాలుగేళ్ల సమయం ఉంది. వచ్చే వరల్డ్‌కప్‌లో ఈ ఇద్దరు ఆడుతారా లేదా అనేది ఆసక్తికరమే. ఈ విషయం పక్కనబెడితే.. మెస్సీ, రొనాల్డోలు ఒకే ఫుట్‌బాల్ క్లబ్‌కు ఆడిన సందర్భాలకంటే ప్రత్యర్థులుగా తలపడిన సందర్భమే ప్రేక్షకులకు ఎక్కువ మజాను అందిస్తుంది. తాజాగా ఫిఫా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు ప్రత్యర్థులుగా మరోసారి తలపడ్డారు. దీనికి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ వేదికైంది. ఇటీవలే వివాదాస్పద రీతిలో మాంచెస్టర్ యునైటెడ్‌ను వీడిన క్రిస్టియానో రొనాల్డో.. సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్ అయిన అల్-నసర్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇక మెస్సీ, నెయ్మర్, కైలియన్ ఎంబాపెలు పారిస్ సెయింట్స్ జర్మన్(పీఎస్జీ)కి ఆడుతున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఫహద్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో మెస్సీ నేతృత్వంలోని ఆల్‌స్టార్స్ ఎలెవన్ జట్టు 5-4తో గెలుపొందింది. కాగా మ్యాచ్ మధ్యలో మెస్సీ రొనాల్డోవైపు ఒక లుక్ ఇచ్చాడు. కానీ రొనాల్డో మాత్రం మెస్సీని పట్టించుకోనట్లుగానే వ్యవహరించాడు. ఆ సమయంలో మెస్సీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెస్సీ ఇచ్చిన ఒక్క చూపు సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే ఇదంతా కేవలం కామెడీ కోసం మాత్రమే అని తర్వాత అర్థమైంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకున్న వీడియో బయటికి వచ్చింది.ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం రొనాల్డో సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టాడు. ''కొంత మంది పాత స్నేహితులను కలుసుకోవడం సంతోషంగా అనిపించింది.'' అంటూ కామెంట్ చేశాడు. Love someone who looks at you like Messi looks at Cristiano Ronaldo 🥂#CR7𓃵 pic.twitter.com/d4Z5Q5hZAq — Sarah (@_m__sara) January 19, 2023 చదవండి: 24 ఏళ్లపాటు కోమాలోనే.. కన్నుమూసిన సైక్లిస్ట్ బోల్ట్‌కు చేదు అనుభవం.. అకౌంట్ నుంచి 97 కోట్లు మాయం -
7 సెకన్లు.. 60 మీటర్ల దూరం.. ఏమా వేగం
ఫుట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో తమ ఫేవరెట్ ఆటగాడు బరిలో ఉన్నాడంటే ఇక ఫ్యాన్స్‌కు పండగే. ఫీల్డ్‌లో ఎందరు ఉన్నా.. అందరి కళ్లు తమ అభిమాన ఆటగానిపైనే ఉంటాయి. అలాంటి వారిలో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్లొ ఒకడు. అంతర్జాతీయ ఫుట్‌బాలర్‌గా ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా 36 ఏళ్ల వయసులోనూ తన రన్నింగ్ పవర్‌ను చూపించి ఎంత ఫిట్‌గా ఉన్నాడో చెప్పకనే చెప్పాడు. విషయంలోకి వెళితే.. శుక్రవారం స్పెయిన్, పోర్చుగల్ మధ్య అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డొ ఒక్క గోల్ కూడా కొట్టలేదు.. కానీ అభిమానులను మాత్రం ఎంటర్టైన్ చేశాడు. మ్యాచ్ డ్రాగా ముగుస్తుందన్న దశలో 87.29 నుంచి 87.36 టైమ్‌లైన్ మధ్యలో 7 సెకన్లలో రొనాల్డొ చిరుత మించిన వేగంతో ఒక గోల్‌పోస్ట్ బాక్స్ నుంచి మరో గోల్‌పోస్ట్ బాక్స్‌కు పరిగెత్తాడు. దీనిని చూసిన అభిమానులు రొనాల్డొను వహ్వా అనకుండా ఉండలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు ట్రెండింగ్‌గా మారింది. అయితే రొనాల్డొకు మ్యాచ్ మధ్యలో చాలాసార్లు బంతిని గోల్‌పోస్టులోకి పంపించే అవకాశం వచ్చినా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. ప్రస్తుతం జువెంటస్ క్లబ్‌తో పాటు పోర్చుగల్ జాతీయ జట్టుకు ఆడుతున్న రొనాల్డొ తన కెరీర్లో ఇప్పటివరకు అన్ని క్లబ్‌లు, అంతర్జాతీయ మ్యాచ్‌లు కలిపి దాదాపు 770కి పైగా గోల్స్ నమోదు చేశాడు. చదవండి: ఇటాలియన్ గ్రాండ్ ప్రిలో విషాదం.. మోటో3 రైడర్ మృతి 'రషీద్ పెళ్లెప్పుడు'.. ఎందుకు మీరు వస్తారా? 🇵🇹 Cristiano Ronaldo covered over 60 meters in 7 seconds. 36 years old 🤯pic.twitter.com/bRmRize8dF — Yellow Football (@YellowFootbal) June 4, 2021 -
ఐపీఎల్ జట్లు... టి20 ప్రపంచకప్... ఒలింపిక్స్!
అహ్మదాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుదీర్ఘ విరామం తర్వాత పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకోనుంది. ఇందుకోసం గురువారం జరిగే వార్షిక (89వ) సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో బోర్డు సభ్యులందరూ పాల్గొనబోతున్నారు. కరోనా పరిస్థితుల తర్వాత తొలిసారి బోర్డు పూర్తి స్థాయిలో ప్రత్యక్ష సమావేశం నిర్వహిస్తుండటం విశేషం. ఇందులో వేర్వేరు అంశాలు చర్చకు రానున్నాయి. బోర్డులో ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న పలు అంశాలపై కూడా ఏజీఎంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. ఐపీఎల్లో అదనపు జట్లు 2022 ఐపీఎల్లో ప్రస్తుతం ఉన్న 8 జట్లకు తోడు అదనంగా మరో 2 జట్లకు అవకాశం కల్పించాలనే ప్రతిపాదనపై చర్చించనున్నారు. వచ్చే ఐపీఎల్‌తోనే ఇలా చేయాలని భావించినా... పలు కారణాలతో 10 జట్ల ఆలోచన సాధ్యం కాదనే అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమైంది. ఈ సమావేశంలో రెండు కొత్త జట్లు చేర్చే అంశానికి మాత్రమే ఆమోదం తెలిపి 2022 ఐపీఎల్ నుంచి అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకోవచ్చు. పన్ను రాయితీలపై ఎలా? 2021లో భారత్‌లో టి20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో టోర్నీ నిర్వహణ విషయంలో పూర్తిగా పన్ను రాయితీ కల్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోరుతోంది. అందుకు ఐసీసీ విధించిన గడువు మరో వారం రోజులు మాత్రమే ఉంది. రాయితీ ఇవ్వలేకపోతే టోర్నీని యూఏఈకి తరలిస్తామని కూడా ఇప్పటికే ఐసీసీ చెప్పేసింది. గతంలో పలు మెగా ఈవెంట్లకు పన్నుల విషయంలో ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా... కొత్త పన్ను చట్టాల ప్రకారం ఇది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏం చేస్తుందనేది చూడాలి. మరోవైపు ప్రపంచ కప్ నిర్వహణ కోసం బోర్డు ఎనిమిది వేదికలను ప్రస్తుతానికి ఎంపిక చేసింది. అహ్మదాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, మొహాలి, ధర్మశాల ఈ జాబితాలో ఉన్నాయి. అయితే పలు రాష్ట్ర సంఘాలు తమ వద్దా అత్యుత్తమ సౌకర్యాలు ఉన్నాయని, తమకూ వరల్డ్‌కప్ మ్యాచ్ నిర్వహణ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఒలింపిక్స్‌కు నో 2028 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు బోర్డు మద్దతునిచ్చే విషయంపై చర్చ జరగవచ్చు. అయితే ఎక్కువ మంది దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొంటే జాతీయ క్రీడా సమాఖ్యగా ప్రభుత్వం గుర్తింపు కిందకు వచ్చి బీసీసీఐ తమ పట్టు కో ల్పోయే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్... ఏజీఎంలో పాల్గొనేందుకు వచ్చిన సభ్యుల మధ్య బుధవారం మొతేరా స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బీసీసీఐ కార్యదర్శి జై షా సెక్రటరీ ఎలెవన్ 28 పరుగుల తేడాతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జట్టు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌పై గెలుపొందడం విశేషం. 12 ఓవర్లపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా జై షా జట్టు 3 వికెట్లకు 128 పరుగులు చేసింది. భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజహరుద్దీన్ ఓపెనర్‌గా వచ్చి 22 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. అనంతరం గంగూలీ జట్టు 100 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. గంగూలీ 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. కార్యదర్శి జై షా రెండు వికెట్లు తీశాడు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) సహా పలు ప్రధాన సబ్ కమిటీలను ఏజీఎంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా ఎంపికకు... ముగ్గురు సభ్యుల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు కూడా ఆమోద ముద్ర వేస్తారు. ఇందులో బ్రిజేశ్ పటేల్, ఖైరుల్ మజుందార్ మరో ఏడాది కొనసాగనుండగా... భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) తరఫున హైదరాబాద్‌కు చెందిన మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు అవకాశం దక్కింది. సురీందర్ ఖన్నా స్థానంలో ఓజా పేరును ఐసీఏ ప్రతిపాదించింది. భారత్ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టి20లు ఆడిన ఓజా... ఏడేళ్ల క్రితం చివరిసారిగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
ఫ్రెండ్లీ మ్యాచ్ రద్దు
బెర్లిన్: జర్మనీ, ఇటలీ ఫుట్‌బాల్ జట్ల మధ్య ఈ నెల 31న జరగాల్సిన ఫ్రెండ్లీ మ్యాచ్ రద్దయింది. ఈ మ్యాచ్ బవేరియా ప్రాంతం (జర్మనీలో)లోని న్యూరెమ్బర్గ్లో జరగాల్సి ఉండగా... ప్రస్తుతం అక్కడ కరోనా ఉధృతి అధికంగా ఉండటంతో బహిరంగ ప్రదేశాల్లో 100 మందికి మించి జనం గుమికూడదని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో నిర్వాహకులు ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు. తొలుత ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌ను జరపాలని అనుకున్నా... జట్టు సభ్యులు, వారి సిబ్బంది, మీడియా ప్రతినిధులు, సెక్యూరిటీతో స్టేడియంలోని జనం సంఖ్య 100 మందికిపైగా చేరుకుంటుండటంతో రద్దు చేయడానికే జర్మనీ ఫుట్‌బాల్ సమాఖ్య నిర్ణయించుకుంది. -
స్టంప్ తగిలి బంగ్లా టీనేజ్ క్రికెటర్ మృతి
ఢాకా: ఓ బ్యాట్స్‌మన్ ఆవేశం... 14 ఏళ్ల టీనేజ్ క్రికెటర్ ప్రాణం తీసింది. చిట్టగాంగ్‌లో స్థానిక రెండు జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది. బ్యాట్స్‌మన్ తాను అవుటైన కోపంతో అక్కడి స్టంప్‌ను తీసి విసురుగా గాల్లోకి ఎగిరేశాడు. అయితే అది కిందికి వస్తూ వికెట్లకు సమీపంలోనే ఫీల్డింగ్ చేస్తున్న ఫైజల్ హుస్సేన్ తల, మెడ భాగంలో గట్టిగా తగలడంతో వెంటనే కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయినట్టు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జహంగీల్ ఆలమ్ తెలిపారు. అయితే ఉద్దేశపూర్వకంగా చంపలేదనే కోణంలో పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. -
భారత్ ర్యాంక్ 135
న్యూఢిల్లీ: ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో భారత్ రెండు స్థానాలను మెరుగుపరుచుకుని 135వ స్థానంలో నిలిచింది. గత ఆరేళ్ల కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. గురువారం అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) జట్ల ర్యాంకులను విడుదల చేసింది. ఆటగాళ్ల ఉత్తమ రాణింపుతోనే ఇది సాధ్యమైందని కోచ్ స్టీఫెన్ కాన్స్టాంటైన్ తెలిపారు. ఈ ఏడాది భారత జట్టు శాఫ్ చాంపియన్‌షిప్‌తో పాటు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఉత్తమ ర్యాంకులో ఉన్న ప్యూర్టోరికోను 4–1తో ఓడించింది. -
పోలీసు, మీడియా మెరుగైన సేవలు అందించాలి
కర్నూలు (టౌన్): పోలీసులు, మీడియా సమన్వయంతో సమాజానికి మరిన్ని సేవలు అందించాలని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. గురువారం స్థానిక స్పోర్ట్సు ఆథారిటి అవుట్డోర్ స్టేడియంలో పోలీసులకు, మీడియా మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించారు. ఉత్సాహంగా సాగిన మ్యాచ్‌లో జిల్లా ఎస్పీ 13 పరుగులతో పోలీసు టీమ్‌ను ఉత్సాహ పరిచారు. మీడియా టీమ్ మేనేజర్ మధు సుధాకర్ నేతృత్వంలో మీడియా సభ్యులు క్రికెట్లో ఉత్సాహంగా ఆడారు. మొదట టాస్ గెలిచిన పోలీసు టీమ్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఓపెనర్‌గా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగి 2 ఫోర్లతో 13 పరుగులు సాధించారు. 6 వికెట్ల నష్టానికి పోలీసు టీమ్ 98 పరుగులు సాధించారు. తరువాత బ్యాటింగ్ చేసిన మీడియా టీమ్ 98 పరుగులు చేసి స్కోరును సమం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న జర్నలిస్టుల క్రీడా పోటీల్లో కర్నూలు జర్నలిస్టుల జట్టు విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. జిల్లా మేనేజర్ మధు సుధాకర్ మాట్లాడుతూ ఈ నెల 12 వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు వైజాగ్‌లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జర్నలిస్టు పోటీల్లో 15 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్డీ రవిప్రకాష్, టౌన్ డీఎస్పీ రమణమూర్తి, టీమ్ కోచ్ రామాంజనేయులు, సీఐలు డేగల ప్రభాకర్, నాగరాజరావు, నాగరాజు యాదవ్, మహేశ్వర్‌రెడ్డి, మధూసూదన్‌రావు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
అర్జెంటీనా ‘ప్రతీకారం’
ఫ్రెండ్లీ మ్యాచ్‌లో జర్మనీపై గెలుపు డుస్సెల్‌డోర్ఫ్ (జర్మనీ): ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్లో తలపడిన అర్జెంటీనా, జర్మనీ జట్లు మరోసారి తలపడ్డాయి. ఈసారి అర్జెంటీనా గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఈ స్నేహపూర్వక మ్యాచ్‌లో అర్జెంటీనా 4-2తో గెలిచింది. ఏంజెల్ డి మారియా ఒక గోల్ చేయడంతో పాటు... అగెరో, లామెలా, ఫెడెరికోలు గోల్స్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జర్మనీ తరఫున షుర్లే, గొయెట్జ్ గోల్స్ చేశారు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ మెస్సీ ఆడలేదు. మరోవైపు ప్రపంచకప్ గెలిచిన జర్మనీ జట్టులోని సభ్యులు నలుగురు మాత్రమే బరిలోకి దిగారు. -
సన్‌రైజర్స్‌తో క్యాన్సర్ భాదిత చిన్నారుల క్రికెట్