లియోనల్ మెస్సీకి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. అతను ఒక మ్యాచ్ ఆడితే కోట్లలో వీక్షిస్తారు. అలాంటి మెస్సీ మన దేశానికి వచ్చి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతానంటే భారత్ వద్దనడం ఆశ్చర్యం కలిగించింది. అర్జెంటీనా ప్రస్తుతం ఫుటబాల్‌లో చాంపియన్ అన్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ సేన ఫ్రాన్స్‌పై ఫూటౌట్‌లో 4-2తో విజయం సాధించి మూడోసారి వరల్డ్‌కప్ గెలుచుకుంది. అన్నీ తానై నడిపించిన మెస్సీ అర్జెంటీనాకు కప్ అందించి 36 సంవత్సరాల నిరీక్షణకు తెరదించాడు.
ఇలాంటి మేటి చాంపియన్ టీమ్ వచ్చి ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడతామంటే ఫుట్‌బాల్ అభివృద్ధి కోరే ఏ దేశమైనా ఎగిరి గంతేస్తుంది. ఎర్రతివాచీ పరిచి మరీ ఆహ్వానిస్తుంది. కానీ జనాభాలో చైనాను మించిన భారత్ మాత్రం తమ ఫుట్‌బాల్ అబిమానులకు నిరాశ కలిగించే నిర్ణయంతో అర్జెంటీనా వస్తనంటే వద్దన్నది. అర్జెంటీనా జట్టు అయినా.. ఆ జట్టు ఆటగాళ్లయినా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్. అలాంటి జట్టు అప్పియరెన్స్ ఫీజుగా 50 లక్షల డాలర్లు(రూ.40 కోట్లు) ఇస్తే చాలు అందుబాటులో ఉన్న జూన్ 12 నుంచి 20వ తేదీల్లో భారత్ వేదికపై ఒక మ్యాచ్ ఆడి వెళతామంది.
కానీ అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF) అంత మొత్తం ఇవ్వలేం అనేసరికి మెస్సీ టీమ్ జూన్ 15న బీజింగ్‌లో ఆస్ట్రేలియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది. మనకంటే చిన్నదేశం ఇండోనేషియా వాళ్లు అడిగినంత ఫీజులో ఏ లోటు లేకుండా చెల్లించి జకార్తాలో 19న అర్జెంటీనాతో మ్యాచ్ ఆడి తమ కోరికను నెరవేర్చుకుంది. అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న మన భారత్ మాత్రం రూ. 40 కోట్లు ఇచ్చుకోలేక అర్జెంటీనాతో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించడం విస్మయం కలిగించే అంశం.
చదవండి: #LionelMessi: ఆపడం ఎవరి తరం.. కెరీర్‌లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్
Comments
Please login to add a commentAdd a comment