అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ మంగళవారం మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అర్జెంటీనా తరపున వందో అంతర్జాతీయ గోల్ సాధించాడు. కురాకోతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అర్జెంటీనా 7-0తో రికార్డు విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. ఆట 20, 33, 37వ నిమిషాల్లో మెస్సీ గోల్స్ చేసి హ్యాట్రిక్‌తో పాటు వందో గోల్స్ సాధించాడు.
ప్రస్తుతం మెస్సీ ఖాతాలో 102 గోల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ(174 మ్యాచ్‌ల్లో 102 గోల్స్) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్(198 మ్యాచ్‌ల్లో 122 గోల్స్) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్) ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెస్సీ మూడు గోల్స్ చేయగా.. నికోలస్ గొంజాలెజ్(ఆట 23వ నిమిషం), ఎంజో ఫెర్నాండేజ్(ఆట 35వ నిమిషం), ఏంజెల్ డి మారియా(ఆట 78వ నిమిషం), గొంజాలో మాంటెల్(ఆట 87వ నిమిషం)లో గోల్స్ చేయడంతో అర్జెంటీనా 7-0 తేడాతో కురాకోను చిత్తుగా ఓడించింది. కాగా మెస్సీకి అర్జెంటీనా తరపున ఇది ఏడో అంతర్జాతీయ హ్యాట్రిక్ గోల్స్ కావడం విశేషం.
MESSI WHAT A CRAZY HALF, ENJOY THE GOALS!!!! 🐐🐐🐐 pic.twitter.com/f9nwKcoUeS
— mx ⭐️⭐️⭐️ (@MessiMX30iiii) March 29, 2023
Comments
Please login to add a commentAdd a comment