International football
-
హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. సెంచరీ కొట్టిన మెస్సీ
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ మంగళవారం మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అర్జెంటీనా తరపున వందో అంతర్జాతీయ గోల్ సాధించాడు. కురాకోతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అర్జెంటీనా 7-0తో రికార్డు విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. ఆట 20, 33, 37వ నిమిషాల్లో మెస్సీ గోల్స్ చేసి హ్యాట్రిక్‌తో పాటు వందో గోల్స్ సాధించాడు. ప్రస్తుతం మెస్సీ ఖాతాలో 102 గోల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ(174 మ్యాచ్‌ల్లో 102 గోల్స్) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్(198 మ్యాచ్‌ల్లో 122 గోల్స్) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెస్సీ మూడు గోల్స్ చేయగా.. నికోలస్ గొంజాలెజ్(ఆట 23వ నిమిషం), ఎంజో ఫెర్నాండేజ్(ఆట 35వ నిమిషం), ఏంజెల్ డి మారియా(ఆట 78వ నిమిషం), గొంజాలో మాంటెల్(ఆట 87వ నిమిషం)లో గోల్స్ చేయడంతో అర్జెంటీనా 7-0 తేడాతో కురాకోను చిత్తుగా ఓడించింది. కాగా మెస్సీకి అర్జెంటీనా తరపున ఇది ఏడో అంతర్జాతీయ హ్యాట్రిక్ గోల్స్ కావడం విశేషం. MESSI WHAT A CRAZY HALF, ENJOY THE GOALS!!!! 🐐🐐🐐 pic.twitter.com/f9nwKcoUeS — mx ⭐️⭐️⭐️ (@MessiMX30iiii) March 29, 2023 -
సాధించాడు.. టాప్-5లో భారత్ ఫుట్‌బాల్ స్టార్
ఫుట్‌బాల్‌లో భారత్ వెలుగులు లేకపోయినప్పటికి జట్టు స్టార్ ఆటగాడు..కెప్టెన్ సునీల్ ఛెత్రి మాత్రం వ్యక్తిగతంగా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూనే ఉన్నాడు. తాజాగా ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సునీల్ ఛెత్రి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం కిర్గిజ్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్ కొట్టడం ద్వారా సునీల్ అంతర్జాతీయ కెరీర్లో 85వ గోల్ నమోదు చేశాడు. ఈ క్రమంలో హంగేరీకి చెందిన ఫెరెన్క్ ఫుకాస్(85 మ్యాచ్‌ల్లో 84 గోల్స్)ను అధిగమించి టాప్-5లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 133 మ్యాచ్‌లాడిన సునీల్ ఛెత్రి 85 గోల్స్ నమోదు చేశాడు. ఇక తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్(198 మ్యాచ్‌ల్లో 122 గోల్స్) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్), అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్) మూడో స్థానంలో, మొక్తర్ దహారి- మలేషియా(142 మ్యాచ్‌ల్లో 89 గోల్స్) నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు విజేతగా నిలిచింది. మణిపూర్‌లో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–0 గోల్స్ తేడాతో కిర్గిజ్ రిపబ్లిక్ జట్టుపై గెలిచింది. భారత్ తరఫున సందేశ్ జింగాన్ (34వ ని.లో), సునీల్ చెత్రి (84వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. సునీల్ చెత్రి కెరీర్లో ఇది 85వ గోల్ కావడం విశేషం. ఈ టోర్నీలో ఆడిన మరో జట్టు మయన్మార్‌పై తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0తో విజయం సాధించింది. ....aaaaand that's #85 for Sunil Chhetri.pic.twitter.com/eUu6QHeUdE — Shyam Vasudevan (@JesuisShyam) March 28, 2023 📈 Most International Goals: 🇵🇹 Cristiano Ronaldo 𝟭𝟮𝟬 🇮🇷 Ali Daei 𝟭𝟬𝟵 🇦🇷 Lionel Messi 𝟵𝟵 🇲🇾 Mokhtar Dahari 𝟴𝟵 🇮🇳 Sunil Chhetri 𝟴𝟱 🇭🇺 Ferenc Puskás 𝟴𝟰 Sunil Chhetri becomes 5th all-time International Goalscorer. 🇮🇳🔥#IndianFootall #SC11 #BlueTigers pic.twitter.com/O1rU0ulunz — IFTWC - Indian Football (@IFTWC) March 28, 2023 చదవండి: అదే 26 పరుగులు.. శాసించిన చివరి ఓవర్ -
అంతర్జాతీయ కెరీర్‌కు మెస్సీ వీడ్కోలు
సాకర్ అభిమానులకిది చేదువార్త. ప్రపంచ సాకర్ స్టార్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. చిలీతో జరిగిన కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోయిన వెంటనే అంతర్జాతీయ సాకర్ నుంచి రిటైరవుతున్నట్టు 29 ఏళ్ల మెస్సీ ప్రకటించాడు. ‘ఇది క్లిష్టమైన సమయం. అర్జెంటీనా తరపున కెరీర్ ముగిసిందని భావిస్తున్నా’ అని అన్నాడు. కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 2-4 గోల్స్ తేడాతో చిలీ చేతిలో ఓటమి చవిచూసింది. జట్టును గెలిపించడంలో మెస్సీ విఫలమయ్యాడు. -
భారత్ ర్యాంక్ 147
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం గణనీయంగా మెరుగుపడింది. గురువారం విడుదల చేసిన తాజా జాబితాలో 26 స్థానాలు ఎగబాకి 147వ ర్యాంక్‌లో నిలిచింది. గత నెలలో జరిగిన 2018 వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ రౌండ్లో నేపాల్‌పై గెలవడం భారత్‌కు కలిసొచ్చింది. 1993లో ఫిఫా ర్యాంకింగ్స్ మొదలైనప్పట్నించీ... భారత ఫుట్‌బాల్ చరిత్రలో ఇది మూడో అత్యధిక మెరుగుదల. 1993, 96లో వరుసగా 29, 30 స్థానాలను మెరుగుపర్చుకుంది. ప్రపంచ చాంపియన్ జర్మనీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అర్జెంటీనా, బెల్జియం, కొలంబియా, బ్రెజిల్ టాప్-5లో ఉన్నాయి. -
ప్రపంచకప్ తర్వాత వీడ్కోలు
స్పెయిన్ స్టార్ డేవిడ్ విల్లా వాషింగ్టన్: తాజా ప్రపంచకప్ ముగిసిన వెంటనే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు తాను గుడ్‌బై చెప్పనున్నట్లు స్పెయిన్ సీనియర్ ఆటగాడు డేవిడ్ విల్లా ప్రకటించాడు. 50 ఏళ్లు వచ్చే దాకా స్పెయిన్ జట్టుకు ఆడాలన్నంత కోరికగా ఉందని... కానీ, వాస్తవిక దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని 32 ఏళ్ల విల్లా చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటికి 58 గోల్స్ నమోదు చేసిన విల్లా... స్పెయిన్ తరపున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ‘రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునే ముందు ఎంతో ఆలోచించాను. అయితే రోజు రోజుకూ వయసు పెరిగిపోతోందన్న విషయాన్ని గుర్తించాను. నా నిర్ణయాన్ని జట్టు కోచ్ డెల్ బోస్క్ అర్థం చేసుకుంటాడనే భావిస్తున్నాను’ అని విల్లా అన్నాడు. అయితే ప్రపంచకప్‌తో విల్లా అంతర్జాతీయ కెరీర్ ముగియనున్నా.. ఫుట్‌బాల్‌కు పూర్తిగా మాత్రం అతడు దూరం కావడంలేదు. గతంలో వాలెన్సియా, బార్సిలోనా, అట్లెటికో మాడ్రిడ్ క్లబ్‌ల తరపున సాకర్ లీగ్లలోఆడిన విల్లా... అమెరికాలోని మేజర్ సాకర్ లీగ్ జట్టయిన న్యూయార్క్ సిటీ క్లబ్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు