అంతర్జాతీయ కెరీర్కు మెస్సీ వీడ్కోలు
సాకర్ అభిమానులకిది చేదువార్త. ప్రపంచ సాకర్ స్టార్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. చిలీతో జరిగిన కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోయిన వెంటనే అంతర్జాతీయ సాకర్ నుంచి రిటైరవుతున్నట్టు 29 ఏళ్ల మెస్సీ ప్రకటించాడు. ‘ఇది క్లిష్టమైన సమయం. అర్జెంటీనా తరపున కెరీర్ ముగిసిందని భావిస్తున్నా’ అని అన్నాడు.
కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 2-4 గోల్స్ తేడాతో చిలీ చేతిలో ఓటమి చవిచూసింది. జట్టును గెలిపించడంలో మెస్సీ విఫలమయ్యాడు.