
రాబోయే ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో తమ జట్టు ప్రదర్శన ఆధారంగా తన కెరీర్‌పై ఓ నిర్ణయానికి వస్తానని అర్జెంటీనా కెప్టెన్, స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ తెలిపాడు. ‘ప్రపంచకప్‌లో మేం ఎంత దూరం ప్రయాణిస్తాం, ఎలా ముగించనున్నాం అనేది ముఖ్యం. గత నాలుగేళ్ల కాలంలో మేము మూడు మెగా ఫైనల్స్‌లో ఓడిపోయాం.
ఈసారి స్పెయిన్, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియంలు టైటిల్ ఫేవరెట్లు’ అని మెస్సీ విశ్లేషించాడు. ప్రపంచ కప్‌లో అర్జెంటీనా తమ తొలి మ్యాచ్‌ను శనివారం ఐస్‌లాండ్‌తో ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment