అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తన రిటైర్మెంట్‌పై సంచలన ప్రకటన చేశాడు. ఖతర్ వేదికగా జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ అర్జెంటీనా తరపున చివరిదని స్పష్టం చేశాడు. మెస్సీకి ఇదే చివరి ప్రపంచకప్ అని ఊహాగానాలు వ్యక్తమయిన వేళ మెస్సీ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
మంగళవారం అర్థరాత్రి దాటాకా క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి అర్జెంటీనాకు తొలి గోల్ అందించాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీకి ఇది నాలుగో గోల్. మిగతా రెండు గోల్స్ అల్వరేజ్ చేసినప్పటికి ఆ రెండింటిలోనూ మెస్సీదే ముఖ్యపాత్ర అన్న విషయం మరువద్దు. ఇక మొరాకో, ఫ్రాన్స్‌లలో గెలిచే జట్టుతో డిసెంబర్ 18న జరిగే ఫైనల్లో అర్జెంటీనా అమితుమీ తేల్చుకోనుంది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ''అర్జెంటీనా ఫైనల్స్ కు చేరడం సంతోషంగా ఉంది. ఫైనల్స్ లో చివరి మ్యాచ్ ను ఆడటం ద్వారా ఫుట్ బాల్ ప్రపంచకప్ ప్రయాణానికి ముగింపు పలకబోతున్నా.మరో ప్రపంచకప్ కు చాలా సంవత్సరాలు పడుతుందని... అప్పటి వరకు ఇలాగే ఆడేంత సత్తా ఉంటుందని అనుకోవడం లేదు. ఈసారి అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ అందించి ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించడమే ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు.
ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే మారడోనా వారసుడిగా పేరు సంపాదించిన మెస్సీ తన కెరీర్‌లోనే ఎన్నో టైటిల్స్, రికార్డులు, అవార్డులు అందుకున్నాడు. అయితే మెస్సీకి ఫిఫా వరల్డ్‌కప్ మాత్రం అందని దాక్ష్రలా ఉంది. 2014లో ఆ అవకాశం వచ్చినప్పటికి అర్జెంటీనా చివరి మెట్టుపై బోల్తా పడింది. మరి ఈసారైనా ఫైనల్లో విజయం సాధించి ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలని చూస్తున్న మెస్సీ కల నెరవేరాలని కోరుకుందాం.
చదవండి: అల్విదా 'లుకా మోడ్రిక్'.. నాయకుడంటే నీలాగే
Comments
Please login to add a commentAdd a comment