ప్రపంచకప్ తర్వాత వీడ్కోలు | After World Cup farewell | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్ తర్వాత వీడ్కోలు

Published Tue, Jun 10 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

ప్రపంచకప్ తర్వాత వీడ్కోలు

ప్రపంచకప్ తర్వాత వీడ్కోలు

స్పెయిన్ స్టార్ డేవిడ్ విల్లా
వాషింగ్టన్: తాజా ప్రపంచకప్ ముగిసిన వెంటనే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు తాను గుడ్‌బై చెప్పనున్నట్లు స్పెయిన్ సీనియర్ ఆటగాడు డేవిడ్ విల్లా ప్రకటించాడు. 50 ఏళ్లు వచ్చే దాకా స్పెయిన్ జట్టుకు ఆడాలన్నంత కోరికగా ఉందని... కానీ, వాస్తవిక దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని 32 ఏళ్ల విల్లా చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటికి 58 గోల్స్ నమోదు చేసిన విల్లా... స్పెయిన్ తరపున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ‘రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునే ముందు ఎంతో ఆలోచించాను.

అయితే రోజు రోజుకూ వయసు పెరిగిపోతోందన్న విషయాన్ని గుర్తించాను. నా నిర్ణయాన్ని జట్టు కోచ్ డెల్ బోస్క్ అర్థం చేసుకుంటాడనే భావిస్తున్నాను’ అని విల్లా అన్నాడు. అయితే ప్రపంచకప్‌తో విల్లా అంతర్జాతీయ కెరీర్ ముగియనున్నా.. ఫుట్‌బాల్‌కు పూర్తిగా మాత్రం అతడు దూరం కావడంలేదు. గతంలో వాలెన్సియా, బార్సిలోనా, అట్లెటికో మాడ్రిడ్ క్లబ్‌ల తరపున సాకర్ లీగ్‌లలోఆడిన విల్లా... అమెరికాలోని మేజర్ సాకర్ లీగ్ జట్టయిన న్యూయార్క్ సిటీ క్లబ్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement