
మాడ్రిడ్: స్పెయిన్ ఆటగాడు ఫెర్నాండో టొర్రెస్ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్‌మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం టోక్యోలో నిర్వహించే మీడియా సమావేశంలో వెల్లడిస్తానని ఆయన సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. ఎల్ నినో(ది కిడ్)అని పిలవబడే ఈ స్పానిష్ స్ట్రయికర్ స్పెయిన్ క్లబ్ అట్లెటికో మాడ్రిడ్ తరపున తన కెరీర్‌ను ఆరంభించాడు. మొత్తం 760 మ్యాచ్‌లాడిన టొర్రెస్ 260 గోల్స్ సాధించాడు.
అనంతరం లివర్‌పూల్, చెల్సియా, ఏసీ మిలాన్ తరఫున ఆడాడు. దాదాపు 440 కోట్ల ను చెల్లించి చెల్సియా టీం ఈ వెటరన్ ఆటగాడిని లివర్‌పూల్ నుంచి కొను గోలు చేసింది. అలాగే స్పెయిన్ గెలి చిన 2010 వరల్డ్ కప్, 2012 యూరో వరల్డ్ కప్ టీంలో సభ్యుడు. దేశం తర పున 110 మ్యాచ్‌లకు ఆడి 38 గోల్స్ వేశాడు. టొర్రెస్ కెరీర్‌ను గాయాలు నాశనం చేశాయి. ప్రస్తుతం ఈ 35 ఏళ్ల ఆటగాడు జపాన్ క్లబ్ సగాన్ సూకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment