Goals
-
దృఢ సంకల్పమే మీ బలం
ఎత్తైన పర్వతాల నడుమ ఒక సుందరమైన లోయ వద్ద ఒక చిన్న ప్రవాహం ఉండేది. అది మహా సముద్రాన్ని చేరాలని కలలు కంటూ ఉండేది. తన ప్రయాణాన్నిప్రారంభించిన ప్రతిసారీ దారిలో రాళ్లు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండచరియలు ఎదురవడంతో ఆ చిన్న ప్రవాహం వెనుదిరిగి వెనకకు వెళ్లిపోయేది.‘‘నీకు ఇది సాధ్యం కాదు,’’ అని దారిలోని పెద్ద రాళ్లు చెప్పేవి.‘‘నువ్వు చాలా చిన్నగా, బలహీనంగా ఉన్నావు నువ్వు చేయలేవు’’ అని ఆ చిట్టి ప్రవాహాన్ని నిరుత్సాహ పరిచేవి. ఒకనాడు చిట్టి ప్రవాహం చాలా దిగులుగా, ఇక ఎప్పటికీ తన కలను నెరవేర్చుకోలేనన్న బాధతో, సందేహంతో ఉండటాన్ని వృక్షమాత గమనించింది. వృక్ష మాత ప్రవాహంతో ఇలా చెప్పింది, ‘‘ఇలా బాధ పడినంత మాత్రాన నీ లక్ష్యాన్ని నీవు చేరగలవా..?? నువ్వు బాధ పడటం వల్ల ఏ ఉపయోగం లేదు! మహా సముద్రాన్ని చేరాలనే నీ తపననే నీ శక్తిగా మలుచుకో..నీ సంకల్పాన్ని బలపరుచుకో.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుదిరగననే వజ్ర సంకల్పం చేసుకో!’’ అని చిట్టి ప్రవాహానికి కొండంత ధైర్యమిచ్చి, విజయోస్తు! అని దీవించి పంపింది వృక్ష మాత. ఆ ధైర్యంతో, ప్రవాహం తన ప్రయాణాన్నిప్రారంభించింది. అది ముందుకు వెళ్లాలని సంకల్పించుకుంది. పెద్ద రాళ్ళు ఎదురైనప్పుడు వాటి మధ్యనున్న చిన్న సందులనే మార్గంగా చేసుకుంది. ఎండ తీవ్రతకు ఆవిరైపోయే పరిస్థితి వచ్చినప్పుడు, మేఘాలకెగసి అక్కడి నుండి నదిగా భువికి తిరిగి వచ్చింది. ఒకప్పటి చిట్టి ప్రవాహమే ఇప్పుడు మహా ప్రవాహమై చివరికి మహాసముద్రంలో లీనమైంది. ‘‘నీ లక్ష్యాన్ని నీవు సంకల్ప శక్తితో సాధించావు’’ అని వృక్ష మాత హర్షించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా చెదరని సంకల్ప బలంతో ముందుకు సాగండి. లక్ష్యాన్ని సాధించడంలో ఇటువంటి మనఃస్థితి ఉంటే ఏ పనిలోనైనా నిస్సందేహంగా విజయాన్ని సాధించవచ్చు. ఈ యావత్ విశ్వంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు! నూతన సంవత్సరంలో చాలా మంది ఎన్నో గొప్ప లక్ష్యాలను పెట్టుకుంటారు. కానీ ఆ లక్ష్యాలను సాధించేందుకు కావాల్సినంత సంకల్ప బలం వారిలో ఉండదు. అందుకే మధ్యలోనే ఆ లక్ష్యాలను వదిలిపెడతారు. కొన్నిసార్లు మీ మనసే ఎన్నో సాకులను వెతుకుతుంది. మీ లక్ష్యాన్ని ఓడించాలని చూస్తుంది. అందుకే మీ మనసును చెదరని సంకల్ప బలంతో నింపండి. నేను ఎన్ని అడ్డంకులు ఉన్నా విజయాన్ని సాధిస్తాను! నేను లక్ష్యాన్ని చేరతాను అని పదే పదే మనసులో అనుకోండి! అనుకుందే ఆచరణలో పెట్టండి. మీరు చేయాల్సిన కృషితో పాటు దృఢమైన సంకల్ప శక్తి కూడా ఉండాలి. – మాతా ఆత్మానందమయిఆధ్యాత్మిక గురువు -
సరే సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం! కానీ..
‘‘అమ్మ సాక్షిగా చెబుతున్నా.. జాన్వరి ఫస్ట్ నుంచి మందు తాగను..’’ ఓ పెద్దాయన అనగానే ‘‘సూపర్ అసలు’’ అంటూ చప్పట్లు కొట్టే యాంకరమ్మ వీడియో ఒకటి ఎంతలా వైరల్ అయ్యిందో తెలియంది కాదు. నిజంగా మీరు కొత్త ఏడాదిలో తీసుకున్న లక్ష్యాలను.. అదేనండీ న్యూఇయర్ రెజల్యూషన్స్‌ను ఎప్పుడైనా కచ్చితంగా అమలు చేశారా?. పోనీ చేసినా.. అసలు వాటిలో కచ్చితంగా పూర్తిస్థాయిలో పాటించినవి ఉన్నాయి?. అసలు ఆ తీర్మానాల విషయంలో ఎప్పుడైనా మీకు మీరు సమీక్షించుకున్నారా?.మనలో చాలా మందికి బాగా అలవాటైన పనేంటో తెలుసా? మూడు రోజులు చాలా చక్కగా న్యూ ఇయర్ హడావుడిలో అనుకున్న లక్ష్యం(Resolutions) కోసం పని చేస్తారు. నాలుగో రోజు యథావిధిగా మానేయడమో, ఏదో ఒక కారణం చెప్పి దాని నుంచి వైదోలగడమో చేస్తారు. ఇలా చేసే వారు 100లో సుమారు 92 మంది ఉన్నారట!. అంటే.. సిన్సీయర్‌గా తమ రెజల్యూషన్స్ కోసం పని చేసేది కేవలం 8 మందినేనా?. ఈ మాట మేం చెప్తోంది కాదు.. పలు అధ్యయనాలు ఇచ్చిన నివేదికలు సారాంశం ఇదే. పాజిటివీటీ.. టైం సెట్ గో.. మనలో చాలమంది ఈ కొత్త ఏడాదిలో ఏదైనా సాధించాలనో, లేదంటే ఫలానా పని చేయకుండా ఉండాలనో తీర్మానాలు చేసుకుంటారు. అది కెరీర్ పరంగా కావొచ్చు, ఆరోగ్యపరం(Health Resolution)గా అవ్వొచ్చు, డబ్బు సంబంధితమైనవి కావొచ్చు.. విషయం ఏదైనా చాలామంది ఏదో ఒక తీర్మానం మాత్రం చేసి తీరతారు. అయితే.. అంత ఈజీగా జరిగే పని కాదని వాళ్లకూ బాగా తెలుసు. చాలామంది సమయాన్ని అడ్డంకిగా చెప్పి తప్పించుకుంటారు. పట్టుదల ఉండాలే కానీ సమయం సరిపోదు అనే సమస్య ఉండదు.అలాగే.. మనం ఓ నిర్ణయం కానీ కమిట్మెంట్ కానీ తీసుకునేప్పుడే అది పాజిటివ్‌గా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి మన లక్ష్యాన్ని సెట్ చేసుకోవటంలో ముందు ఇది ఉందో చూసుకోవడం మంచిది. ముందు నుంచే ‘‘ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కావు’’ అని ప్రిపేర్డ్‌గా ఉండకూడదు. అలాగే నెగటివిటీకి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది కూడా. అందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను ఫుల్ కమిట్మెంట్(Full Commitment)తో రూపొందించుకుని పక్కగా అమలయ్యేలా చిత్తశుద్ధి చూపాలి.వాస్తవాన్ని గుర్తించాలి!జీవితంలో ఒక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలంటారు పెద్దలు. ఒకేసారి నాలుగైదు మెట్లు ఎక్కాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో మనకు తెలియంది కాదు. అలాగే.. మార్పు ఓ చిన్న అడుగుతోనే మొదలువుతుంది. కాబట్టి స్టో అండ్ స్టడీ విన్ ది రేస్ బాటలోనే పయనించాలి. అలాంటప్పుడే విజయవంతమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.సమస్య ఏమిటంటే.. చాలాసార్లు మనం అసాధారణమైన లక్ష్యాలను ఎంచుకుంటుంటాం. వాటి సాధన క్రమంలో తడబడుతుంటాం. అందుకే వాస్తవానికి దగ్గరగా, నిజం చేసుకునేందుకు వీలుగా ఉన్న నిర్ణయాలే తీసుకోవాలి. అలాగే చిన్నపాటి లక్ష్యంతో పని మొదలు పెట్టడం ద్వారా ఉన్నత లక్ష్యానికి దారులు సులువుగా వేసుకోవచ్చు. అలాగని.. ఇక్కడ ‘తగ్గడం’ ఎంతమాత్రం అవదు. ఇలా చేస్తేనే దీర్ఘకాలిక లేదంటే ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం సులువవుతుంది.రెగ్యులర్ వైఖరి వద్దు.. మనం చాలాసార్లు కొత్త ఏడాది వచ్చింది కదా అని.. ఏదో ఒక తీర్మానం చేసేస్తారు. కానీ, దాని అమలుకంటూ ఓ సరైన ప్రణాళిక వేసుకోరు. దాని వల్ల అంతా డిస్టర్బెన్స్ కలుగుతుంది. అందుకే సాధించాలనుకుంటున్న లక్ష్యం గురించి పక్కాగా ఆలోచించాలి. నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకోవడం వల్ల ఆచరణలో పెట్టడమూ సలువవుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.పంచుకుంటేనే ఫలితం!ఈ ఏడాది లక్ష్యసాధనలో.. మీతోపాటు తోడుగా ప్రయాణం చేసేందుకు మరికొందరిని వెతికి పట్టుకోగలిగితే మార్గం మరింత సుగమమం అయినట్లే. కలసికట్టుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో ఎన్నో ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.రివ్యూ ఈజ్ ఫర్ బెటర్ రిజల్ట్ప్రయాణంలో కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు చేస్తున్న పనిని మరోసారి సమీక్షించుకోవాలి. ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు ఏమిటి? ఇప్పటివరకు ఏ వ్యూహం బాగా పనిచేసింది? ఏది సరిగా పనిచేయలేదు? అన్నది పరిశీలించుకోవాలి. చిన్నపాటి విజయానికైనా సరే సంబరాలు చేసుకోవాలి. అది పట్టుదలను మరింతగా పెంచుతుంది. అలాగే.. రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోగలిగినా అనుకున్న లక్ష్యం వైపు వెళ్లేందుకు అవి సాయపడతాయి.కొత్తగా సాధించడం కాదు.. కోల్పోయింది తిరిగి తెచ్చుకోవడంలోనే మాంచి కిక్ దొరుకుతుంది! అలా పొందడంలో ఎక్కువ ప్రేరణ పొందగలుగుతారు. -
Happy New Year 2025: ఎందుకు? ఏమిటి? ఎలా?..
ఇవాళ్టి నుంచి.. ఎలాగైనా ఉదయమే లేచి చదువుకోవాలి. .. జిమ్‌కు వెళ్లి బాడీని పెంచాలి.. సరైన డైట్‌ను మెయింటెన్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి. .. ఎలాగైనా డబ్బులను పొదుపు చేసి ఫలానాది కొనాలి. .. ఆఫీస్‌కు టైంకు వెళ్లాలి. ఇలా అన్నీ కూడా ఏడాదిలో తొలిరోజు నుంచే చేస్తూ ఫ్రెష్ జీవితం ప్రారంభించాలి. చేస్తారో.. చేయరో.. తెలియదు!. కానీ, కొత్త ఏడాది వచ్చిందంటే.. రెజల్యూషన్స్ పేరుతో ఇలాంటి వాటిని తెరపైకి తెచ్చి హడావిడి చేసేవాళ్లు ఎందరో ఉంటారు. ఇందులోనూ హాస్యకోణం వెతుకుతూ.. ఇంటర్నెట్లో మీమ్స్(Resolutions Memes) వైరల్ అవుతున్న పరిస్థితుల్ని ఇప్పుడు చూస్తున్నాం. ఆ లక్ష్యాలను అందుకోవడం మన వల్ల కాదా?..కొత్త ఏడాది కొత్త తీర్మానాలు మనకు కొత్తేం కాదు. ‘‘జీవితంలో ఓ ఏడాది దొర్లిపోయింది. ఇన్ని రోజులు ఏలాగోలా గడిచాయి.కనీసం ఈ కొత్త ఏడాదిలోనైనా మార్పుతో పని చేద్దాం!’.. అని పదిలో తొమ్మిది మంది అనుకుంటారని పలు అధ్యయనాలు తేల్చాయి. ఇది ఏ విద్యార్థులకో, యువతకో మాత్రమే కాదు.. రెజల్యూషన్స్ తీసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. దీర్ఘకాలికంగా ప్రయత్నిస్తున్నవాళ్లు లేకపోలేదు. అంటే.. ప్రతీ ఒక్కరికీ ఇది వర్తిస్తుందన్నమాట. అయితే..ప్రతి కొత్త ప్రారంభం ఎంతో గొప్ప శక్తి, సానుకూల భావనలతో వస్తుందని అందరి నమ్మకం. మన భాషలో మంచి పాజిటివ్ వైబ్ అన్నమాట. చాలా మంది చాలా రకాల లక్ష్యాలను ఈ కొత్త ఏడాదిలో నిర్దేశించుకుంటారు. వాటిలో కొన్నింటిని ఎలాగైనా చేయాలని ప్రయత్నిస్తుంటారు. అవి మాములువి కాదు.. పెద్ద పెద్ద టార్గెట్లే ఉండొచ్చు!. అలాంటి వాటిని ఒంటరిగా నెరవేర్చుకోవడం కొంచెం కష్టమే!. అందుకోసమైనా సరే ఈ లక్ష్యాలను నలుగురితో పంచుకుని సాధించుకునే ప్రయత్నం చేయాలి.కొత్త ఏడాది రెజల్యూషన్స్ చేసుకోవడంలో.. విద్యార్థులు, యువత ముందుంటారు. ఇక్కడ విద్యార్థులతో పాటు వారు తల్లిదండ్రులు/సంరక్షకులు కూడా ఈ లక్ష్యాల కోసం వారితో కలిసి పనిచేస్తేనే ఫలితం ఉండేది. ఉదయాన్నే లేచి చదువుకోవాలనో, లేదంటే టైంకు హోంవర్క్ పూర్తి చేయాలనో, అదికాకుంటే మార్కులు బాగా తెచ్చుకోవాలనో, యూనివర్సిటీలో ర్యాంకు రావాలనో.. ఇలా తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మాట్లాడుకోవాలి. భవిష్యత్‌లో పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడాలంటే చదువు తప్పనిసరని చెబుతూనే వారికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించాలి. అయితే ఇది వాళ్లను ఒత్తిడి, ఆందోళనలకు గురి చేసేదిలా మాత్రం అస్సలు ఉండకూడదు. అలాగే ప్రొగ్రెస్‌ను రివ్యూ చేస్తూ.. వాళ్లకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలే తప్ప!.. ఇతరులతో పోల్చి నిందించడం.. ఆశించిన ఫలితం రాలేదని కోప్పడడం, కొట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. మానసిక ఆరోగ్యమే వాళ్ల విజయానికి తొలి మెట్టు అనేది గుర్తించి ముందుకు వెళ్లాలి.లక్ష్యాలను ఎక్కువగా నిర్దేశించుకునే వర్గం యువతే. అలాగే.. రెజల్యూషన్స్‌ను బ్రేక్ చేసేది కూడా ఈ వర్గమే. కెరీర్‌పరంగా స్థిరపడే క్రమంలో.. వీళ్లకు కుటుంబ సభ్యులు, స్నేహితుల తోడ్పాడు కచ్చితంగా అవసరం ఉంటుంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల అన్వేషణ.. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకునేలా వాళ్లను సమాయత్తం చేయాలి. అందుకు అవసరమైన సాధన, నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచుకునేలా వాళ్లను ప్రొత్సహించాలి. ఆ దశలో అన్ని రకాలుగా విశ్లేషణ అనేది అవసరం. అందుకు అవసరమైన సాయమూ అందించినప్పుడే వాళ్లు తమ లక్ష్యాలను చేరుకోగలరని గుర్తించాలి.జీవితంలో ఎదుగుదల పొదుపు(Savings)తోనే ప్రారంభమవుతుంది. అందుకే కొత్త ఏడాదిలో అడుగుపెట్టే ముందైనా.. ఆర్థికంగా పరిపుష్టి సాధించాలకుని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. కొత్తగా ఉద్యోగం సాధించిన వారైతేనేమి, కొత్తగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకునేవారైతేనేమి.. దీన్నొక భవిష్యత్ ఆశాకిరణంగా భావిస్తారు కూడా. అలాగే తూచా తప్పకుండా పాటించాల్సిన నియమాలు కూడా ఎక్కువ అవసరం పడేది ఈ లక్ష్య సాధనలోనే!. కాబట్టి.. స్వీయ నియంత్రణతో పాటు కుటుంబ సభ్యుల సహకారం అవసరం. మరీ ముఖ్యంగా భాగస్వామి పాత్ర ఇంకాస్త ఎక్కువే!. నెలావారీ ఖర్చులతో పాటు ఏ నెలలో ఎంత మొత్తం అవసరం అవుతుందనే ప్రణాళిక ముందుగానే వేసుకోవడం, ఎమర్జెన్సీ కోసం కొంత డబ్బును పక్కన పెట్టుకోవడం లాంటివి చేయాలి.కొత్త సంవత్సరం తొలిరోజు మాత్రమే కాదు.. వచ్చే ఏడాదిలో ప్రతీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అనుకుంటున్నారా?.. అయితే ఆరోగ్యంగా ఉండడం అవసరం. న్యూఇయర్ రెజల్యూషన్స్(NewYear's Resolutions)లో.. వయసుతో సంబంధం లేకుండా మంచి ఆరోగ్య ప్రణాళికను చాలామంది నిర్దేశించుకుంటారు. అయితే ఇంత ముఖ్యమైన తీర్మానాన్ని.. ఉల్లంఘించేవాళ్లు కూడా ఎక్కువ స్థాయిలోనే ఉంటారు. ఇందుకు బద్ధకం సహా రకరకరాల కారణాలు ఉండొచ్చు. కానీ, ఈ తీర్మానాన్ని సమిష్టిదిగా ఆ కుటుంబం భావించాలి. తద్వారా మానసిక, శారీరక సమస్యలనూ దూరంగా ఉంచుకోవాలి. అప్పుడే కదా మనం అనుకున్న లక్ష్యాలు కానీ బాధ్యతలు కానీ నేరవేర్చడానికి వీలవుతుంది.న్యూ ఇయర్ రిజల్యూషన్లు ఎవరైనా తీసుకోవచ్చు. కానీ, పక్కాగా అమలు కావాలంటే మాత్రం మనకు గట్టి సపోర్ట్ అవసరం అంటారు నిపుణులు. ఇది ఒంటరి ప్రయాణం ఎంతమాత్రం కాదు. ఒకరకంగా ఇది ఆఫీసుల్లో టీం వర్క్ లాంటిదన్నమాట. అందుకే తీసుకునే నిర్ణయాన్ని నలుగురికి చెప్పాలి.. వాళ్ల సపోర్ట్ తీసుకోవాలి. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే చర్చ జరగాలి. ఆ ప్రభావం చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అప్పుడే ఏడాది పొడవునా.. అనుకున్న మేర ఫలితాలు అందుకోగలరు. -
ఇజ్రాయెల్ కొత్త యుద్ధ లక్ష్యాల ప్రకటన
గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మంగళవారం నూతన యుద్ధ లక్ష్యాలతో ముందుకు సాగుతామని ప్రకటిటిచారు. ‘‘రాజకీయ భద్రతా కేబినెట్ యుద్ధం లక్ష్యాలను నవీకరించింది. క్రాస్ బార్డర్లో హమాస్ అనుకూల మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాతో చోటుచేసుకున్న కాల్పుల కారణంగా పారిపోయిన ఉత్తరాది నివాసితులను సురక్షితంగా తిరిగి ఇజ్రాయెల్‌లోకి తీసుకొస్తాం’ అని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.మరోవైపు.. గాజా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే కట్టుబడి ఉంటామని హిజ్బుల్లా ప్రతినిధులు తెలిపారు. అయితే లెబనాన్ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో మిలిటెంట్లను తాము అనుమతించబోమని తేల్చిచెప్పారు. ఈ దాడుల్లో లెబనాన్‌కు చెందిన వందల ఫైటర్లు, ఇజ్రాయెల్ దేశానికి చెందిన పౌరులు, సైనికులు మరణించారు. ఈ దాడుల కారణంగా ఇరుదేశాలకు సంబంధించి సుమారు పదివేల మంది పౌరులు వలసవెళ్లారు.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ఇజ్రాయెల్‌ను సందర్శించిన అమెరికా రాయబారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ఉత్తర నివవాసితులను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి తీసుకురావడానికి మిగిలి ఉన్న ఏకైక మార్గం సైనిక చర్య మాత్రమేనని అన్నారు. రక్షణ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.చదవండి: భారత్‌లో ముస్లింలు బాధలు పడుతున్నారు -
Euro Cup: ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన స్పెయిన్.. తొలి జట్టుగా
పుష్కర కాలం తర్వాత స్పెయిన్ జట్టు అంతర్జాతీయ ఫుట్‌బాల్ వేదికపై మళ్లీ మెరిసింది. ప్రతిష్టాత్మక ‘యూరో’ టోర్నీలో స్పెయిన్ రికార్డుస్థాయిలో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచింది. అంతేకాదు రెండు అత్యంత అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకుంది.భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఫైనల్లో అల్వారో మొరాటో సారథ్యంలోని స్పెయిన్ 2–1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. స్పెయిన్ తరఫున నికో విలియమ్స్ (47వ ని.లో), మికెల్ ఒయర్జబాల్ (86వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఇంగ్లండ్ జట్టుకు పాల్మెర్ (73వ ని.లో) ఏకైక గోల్ అందించాడు.ఆట 68వ నిమిషంలో కెప్టెన్ అల్వారో మొరాటో స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఒయర్జబాల్ సహచరుడు మార్క్ కుకురెల్లా క్రాస్ పాస్‌ను లక్ష్యానికి చేర్చి స్పెయిన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 90వ నిమిషంలో ఇంగ్లండ్ ప్లేయర్ మార్క్ గుయెహి హెడర్ షాట్‌ను గోల్ పోస్ట్ ముందు స్పెయిన్ డిఫెండర్ డాని ఓల్మో హెడర్ షాట్‌తో అడ్డుకోవడం కొసమెరుపు.తొలి జట్టుగా చరిత్రఈ గెలుపుతో స్పెయిన్ జట్టు 66 ఏళ్ల టోర్నీ చరిత్రలో అత్యధికంగా నాలుగుసార్లు విజేతగా నిలిచిన జట్టుగా గుర్తింపు పొందింది. గతంలో స్పెయిన్ 1964, 2008, 2012లలో యూరో టైటిల్‌ను సాధించింది.జర్మనీ జట్టు మూడుసార్లు (1972, 1980, 1996) విజేతగా నిలిచింది. 1966లో ఏకైక ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన తర్వాత మరో అంతర్జాతీయ టైటిల్ నెగ్గలేకపోయిన ఇంగ్లండ్ జట్టుకు వరుసగా రెండోసారి యూరో టోర్నీలో నిరాశ ఎదురైంది. 2021 యూరో ఫైనల్లో ఇటలీ చేతిలో ఓడిన ఇంగ్లండ్‌కు ఈసారి స్పెయిన్ షాక్ ఇచ్చింది.బంతిని 63 శాతం తమ ఆధీనంలో ఉంచుకొని ఇంగ్లండ్ ఆటగాళ్లను కట్టడి చేసింది. ఏకంగా 60 సార్లు ఇంగ్లండ్ గోల్‌పోస్ట్ వైపునకు వెళ్లిన స్పెయిన్ 15 సార్లు గోల్ చేసేందుకు ప్రయత్నించింది. మరోవైపు హ్యారీ కేన్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు 31 సార్లు స్పెయిన్ గోల్‌పోస్ట్ వైపునకు వెళ్లి తొమ్మిదిసార్లు గోల్ లక్ష్యంగా షాట్లు సంధించింది.విజేతకు రూ. 72 కోట్ల 89 లక్షలుస్పెయిన్ టీనేజ్ స్టార్, 17 ఏళ్ల లమీన్ యమాల్ ‘యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’... స్పెయిన్‌కే చెందిన రోడ్రి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు గెల్చుకున్నారు. ఫైనల్ విజేత స్పెయిన్ జట్టుకు 80 లక్షల యూరోలు (రూ. 72 కోట్ల 89 లక్షలు), రన్నరప్ ఇంగ్లండ్ జట్టుకు 50 లక్షల యూరోలు (రూ. 45 కోట్ల 56 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓవరాల్‌గా రూ. 253 కోట్ల ప్రైజ్ మనీ స్పెయిన్‌కు దక్కింది.స్పెయిన్ అరుదైన రికార్డులు ఇవే1. యూరో టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది విజేతగా నిలిచిన తొలి జట్టుగా స్పెయిన్ రికార్డు నెలకొల్పింది. 2. ఒకే యూరో టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా స్పెయిన్ గుర్తింపు పొందింది. ఫ్రాన్స్ (14 గోల్స్; 1984లో) పేరిట ఉన్న రికార్డును స్పెయిన్ తాజాగా తిరగరాసింది. 🔝 performance 🔝 tournament Nico Williams is the real deal 👏@Vivo_GLOBAL | #EUROPOTM pic.twitter.com/lPu38RWoX0— UEFA EURO 2024 (@EURO2024) July 14, 2024 -
Ananya Tripathi: కోడర్ టు రియల్ ఎస్టేట్ క్వీన్
రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల పేర్లు అరుదుగా వినిపిస్తాయి. కోడర్, స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, సీయీవోగా మంచి పేరు తెచ్చుకున్న 39 సంవత్సరాల అనన్య త్రిపాఠి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టి విజయం సాధించింది. ‘రియల్ ఎస్టేట్ క్వీన్’గా పేరు తెచ్చుకుంది... ఆర్మీ ఆఫీసర్ కూతురు అయిన అనన్య త్రిపాఠి తరచుగా ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు మారుతూ ఉండేది. ‘రకరకాల ప్రాంతాలలో చదువుకోవడం వల్ల ఎన్నో సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం, అదృష్టం దొరికింది’ అంటుంది అనన్య. పుణెలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ పూర్తిగా చేసిన అనన్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ‘టీసీఎస్’ తొలి ఉద్యోగం చేసింది. కోడర్‌గా మంచి పేరు వచ్చినా తన దృష్టి వ్యాపారంగంపై మళ్లింది. అలా కోళికోద్ – ఐఐఎంలో ఎంబీఏ చేసింది. క్యాంపస్ సెలెక్షన్లో ‘మెకిన్సీ’కి ఎంపికైన ఏకైక స్టూడెంట్ అనన్య. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ‘మెకిన్సీ’లో ఏడు సంవత్సరాల ప్రయాణం తనకు ఎన్నో పాఠాలు నేర్పింది. మార్గదర్శకులలాంటి వ్యక్తులతో పరిచయం జరిగింది. విశ్లేషణాత్మకంగా ఉండడంతో పాటు స్ట్రక్చర్డ్ డాటా తాలూకు సమస్యలను పరిష్కారించడానికి సంబంధించిన జ్ఞానాన్ని మెకిన్సీలో సొంతం చేసుకుంది. అయితే ఫ్యాషన్ ఇ–కామర్స్ కంపెనీ ‘మింత్రా’ నుంచి వచ్చిన అవకాశం అనన్య కెరీర్‌ను మార్చి వేసింది. ఇ–కామర్స్ గురించి ఎన్నో సందేహాలు ఉన్న ఆ కాలంలో ‘మింత్రా’ నుంచి వచ్చిన ఆఫర్‌కు వెంటనే ఓకే చెప్పడం కష్టమే. అయినప్పటికీ సందేహాలను పక్కన పెట్టి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ హోదాలో ‘మింత్రా’లో చేరింది అనన్య. మూడున్నరేళ్లలో ‘మింత్రా’ లాభాలను పెంచింది. ఆ తరువాత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ‘కేకేఆర్ కేప్స్టోన్’ నుంచి కొత్త కెరీర్ ఆపర్చునిటీ వెదుక్కుంటూ వచ్చింది. ‘కేకేఆర్’లో మాక్స్ హెల్త్‌కేర్, వినీ కాస్మెటిక్స్‌లాంటి కంపెనీలతో కలిసి పనిచేసింది. అనన్య మెటర్నిటీ లీవ్‌లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ గ్రూప్ ‘బ్రూక్‌ఫీల్డ్’ నుండి పిలుపు వచ్చింది. మామూలుగానైతే మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్నప్పుడు సెలవు కాలం పూర్తయ్యేంత వరకు చాలా కంపెనీలు వేచి చూడవు. అయితే బ్రూక్‌ఫీల్డ్ మాత్రం అనన్య ప్రతిభాసామర్థ్యాలపై నమ్మకంతో ఓపిగ్గా వేచి చూసింది. వారి నమ్మకాన్ని అనన్య వమ్ము చేయలేదు. ‘పలు పరిశ్రమలకు సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్‌లలో అనన్యకు అపారమైన అనుభవం ఉంది. స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్‌గా ఆమె ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది’ అంటాడు బ్రూక్‌ఫీల్డ్ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ పార్టనర్ అంకుర్ గుప్తా. బ్రూక్‌ఫీల్డ్ రియల్ ఎస్టేట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా మరోసారి గెలుపు జెండా ఎగరేసిన అనన్య త్రిపాఠి నుంచి వినిపించే సక్సెస్మంత్రా ‘కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి’. -
ఒకరు 6 సెకన్లలో... మరొకరు 7 సెకన్లలో....
బ్రాటిస్లావా (స్లొవేకియా): అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఆదివారం అద్భుతం జరిగింది. వేర్వేరు వేదికల్లో జరిగిన రెండు అధికారిక ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో రెండు ఫాస్టెస్ట్ గోల్స్ నమోదయ్యాయి. బ్రాటిస్లావాలో స్లొవేకియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ్రస్టియా 2–0తో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆట మొదలైన 6 సెకన్లకే ఆ్రస్టియా ప్లేయర్ క్రిస్టోఫ్ బామ్గార్ట్నర్ గోల్ చేశాడు. మిడ్ ఫీల్డ్ నుంచి క్షణాల్లో ముగ్గురు డిఫెండర్లను తప్పించుకొని ముందుకు దూసుకెళ్లిన క్రిస్టోఫ్ లాంగ్షాట్తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. మరోవైపు లియోన్‌లో ఫ్రాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జర్మనీ జట్టు 2–0తో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ఆట మొదలైన 7 సెకన్లకే జర్మనీ ప్లేయర్ ఫ్లోరియన్ విట్జ్ గోల్ చేశాడు. ఇన్నాళ్లూ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఫాస్టెస్ట్ గోల్ చేసిన రికార్డు లుకాస్ పొడోల్‌స్కీ పేరిట ఉంది. 2013లో ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌లో పొడోల్‌స్కీ 9వ సెకనులో గోల్ సాధించాడు. పొడోల్‌స్కీ 11 ఏళ్ల రికార్డు ఒకేరోజు బద్దలు కావడం విశేషం. -
వైట్ హౌస్‌లో ఏపీ విద్యా ప్రభ
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్య సమితిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బుధవారం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను సందర్శించారు. ఇప్పటి వరకు వైట్‌హౌస్‌ను బయటి ప్రాంతాలను చూసేందుకు మాత్రమే అనుమతినిచ్చే ఆ దేశ అధికారులు.. తొలిసారి మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భవనం లోపలి ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం కల్పించారు. విద్యార్థులను వైట్ హౌస్ భద్రత సిబ్బంది శ్వేత సౌధం మొత్తం తిప్పారు. భవనంలో ప్రతి ఒక్క విభాగం పని విధానాన్ని అర్థమయ్యేలా వివరించారు. విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తిగా భవనంలో కలియదిరిగారు. అక్కడి విభాగాలు, సిబ్బంది పనితీరు, సెక్యూరిటీ సిస్టం, అధ్యక్షుడు నివసించే భవనం, కార్యాలయం పని విధానాలను తెలుసుకున్నారు.ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై అంతర్జాతీయ వేదికపై వివరించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10 మంది విద్యార్థులను ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని లబ్ధిపొందిన వారే చెప్పడం సమంజసమని భావించిన ప్రభుత్వం.. పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. ఇలా దేశ చరిత్రలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మన రాష్ట్రం నుంచే ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో యునైటెడ్ నేషన్స్‌లోని స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ సమన్వయంతో, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ పర్యవేక్షణలో విద్యార్థుల బృందం ఈనెల 14న అమెరికాకు వెళ్లింది. ఈ బృందంలో మాల శివలింగమ్మ, (తండ్రి సోమనాథ్ రైతు కూలీ, తల్లి గంగమ్మ), మోతుకూరి చంద్రలేఖ (ఏఎస్ఆర్ జిల్లా,తండ్రి రామారావు ఆటో డ్రైవర్), గుండుమోగుల గణేష్ అంజన సాయి (పశ్చిమ గోదావరి జిల్లా, తండ్రి గోపీ, కౌలు రైతు), దడాల జ్యోత్స్న (కాకినాడ జిల్లా, తండ్రి సింహాచలం సెక్యూరిటీ గార్డు), చాకలి రాజేశ్వరి (నంద్యాల జిల్లా, తండ్రి దస్తగిరి లారీ డ్రైవర్), పసుపులేటి గాయత్రి (ఏలూరు జిల్లా, తండ్రి రమేష్, తల్లి కూలీలు), అల్లం రిషితారెడ్డి (విజయనగరం జిల్లా, తండ్రి రామకృష్ణారెడ్డి మెకానిక్), వంజివాకు యోగేశ్వర్ (తిరుపతి జిల్లా, తండ్రి నాగరాజు కేబుల్ ఆపరేటర్), షేక్ అమ్మాజన్(శ్రీ సత్యసాయి జిల్లా, తల్లి షేక్ ఫాతిమా వ్యవసాయ కూలీ), సామల మనస్విని (పార్వతీపురం మన్యం జిల్లా, తల్లి కృష్ణవేణి) ఉన్నారు. ఈ నెల 15 నుంచి ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలిలో జరిగే సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజీ) సదస్సుతో పాటు కొలంబియా యూనివర్సిటీలో జరిగిన గ్లోబల్ స్కూల్స్ సమ్మిట్‌లో రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘నాడు–నేడు’, విద్యా సంస్కరణలపై వీరు ప్రసంగించారు. న్యూయార్క్‌లోని జాన్ జే కాలేజ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్‌లో నిర్వహించిన ఎస్డీఎస్ సర్విస్ సదస్సు, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో సైతం పాలుపంచుకున్నారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్‌లో ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా, సంక్షేమ పథకాలను వివరించారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయాలను సందర్శించి భారత్‌కు తిరుగుపయనమయ్యారు. సీఎంకు విద్యార్థుల కృతజ్ఞతలు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్య సమితి సదస్సు కోసం రాష్ట్రం తరఫున బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికైనందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తాము నేర్చుకున్న అంశాలను రాష్ట్రంలోని విద్యార్థులకు తెలియజేస్తామని చెప్పారు. పేద కుటుంబాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న తమను ఎంపిక చేసినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్‌కుమార్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. -
ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే..
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఇంటర్ మియామి క్లబ్లో మంచి ముహూర్తంలో జాయిన్ అయినట్లున్నాడు. ఇప్పటివరకు ఇంటర్ మియామి క్లబ్ తరపున ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ మెస్సీ గోల్స్‌తో మెరిశాడు. అందులో రెండు మ్యాచ్‌ల్లో డబుల్ గోల్స్ కొట్టి అభిమానులను అలరించాడు. తాజాగా గురువారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) ఓర్లాండో సిటీ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్ మియామి 3-1తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఉరుములు, మెరుపుల కారణంగా మ్యాచ్ 95 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే మ్యాచ్ ఆలస్యమైనప్పటికి మెస్సీ మాత్రం గోల్ కొట్టడంలో పెద్దగా టైం తీసుకోలేదు. ఆట 7వ నిమిషంలోనే మెస్సీ తన జట్టుకు తొలి గోల్ అందించాడు. అయితే ఓర్లాండో సిటీ ఆట 11వ నిమిషంలో గోల్ కొట్టి సోర్కును సమం చేసింది. అక్కడి నుంచి తొలి హాఫ్ ముగిసేవరకు మరో గోల్ నమోదు కాలేదు. రెండో హాఫ్ మొదలైన కాసేపటికి ఆట 51వ నిమిషంలో జోసెఫ్ మార్టినేజ్ పెనాల్టీని గోల్‌గా మలిచాడు. ఇక ఆట 72వ నిమిషంలో మెస్సీ మరో గోల్ కొట్టి జట్టును 3-1తో స్పష్టమైన ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిర్ణీత సమయంలోగా ఓర్లాండో మరో గోల్ కొట్టలేకపోవడంతో ఇంటర్ మియామి విజయాన్ని నమోదు చేసింది. కాగా మెస్సీ రెండు గోల్స్ కొట్టిన సందర్భంలో మ్యాచ్‌కు హాజరైన అతని భార్య ఆంటోనెలా రోకుజో స్టాండ్స్‌లో సెలబ్రేట్ చేసుకోవడం వైరల్‌గా మారింది. జెర్సీ అమ్మకాల్లో దిగ్గజాలను అధిగమించిన మెస్సీ.. కాగా మెస్సీ మరొక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గోల్స్‌తో రికార్డులు కొట్టడమే కాదు తాజాగా మెస్సీకి చెందిన జెర్సీ అమ్మకాల్లోనూ రికార్డులను కొల్లగొట్టాడు. 24 గంటల వ్యవధిలో మెస్సీ ఇంటర్ మియామి జెర్సీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో జెర్సీ అమ్మకాల విషయంలో క్రిస్టియానో రొనాల్డో, టామ్ బ్రాడీ, ఎన్బీఏ దిగ్గజం లెబ్రన్ జేమ్స్‌లను మెస్సీ అధిగమించాడు. 2021లో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ తరపున, 2020లో టాంపా బే బుక్కానీర్స్లో టామ్ బ్రాడీ జాయిన్ అయిన సమయంలో.. 2018 లో ఎల్ఏ లేకర్స్ తరపున లెబ్రన్ జేమ్స్ జాయిన్ అయినప్పుడు వారి జెర్సీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. MESSI X ROBERT TAYLOR BANGERS ONLY 🤯🤯 Taylor puts Messi in with the chip to give us the early lead over Orlando City.#MIAvORL | 📺#MLSSeasonPass on @AppleTV pic.twitter.com/kvb8Lmcccj — Inter Miami CF (@InterMiamiCF) August 3, 2023 చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ 100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్ -
ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి!
ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని, ధనవంతుడు కావాలని.. బ్రాండెడ్ దుస్తులు, ఖరీదైన కార్లు, బంగ్లాలు కొనాలని కలలు కంటూ ఉంటారు. అయితే కొన్ని రోజుల తరువాత ఇవన్నీ మనవల్ల అయ్యేపని కాదని మధ్యలోనే ఊరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మీరు అనుకున్న సక్సెస్ సాధిస్తారు.. తప్పకుండా ధనవంతులవుతారు. దీనికి సంబంధించిన కొన్ని టిప్స్ ఈ కథనంలో తెలుసుకుందాం. స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం.. ధనవంతుడు కావాలని కలలు కనే ప్రతి ఒక్కరికి ఒక మంచి సులభమైన మార్గం స్టాక్ మార్కెట్ అనే చెప్పాలి. జీవితంలో డబ్బు పొదుపుచేయడం ఎంత ముఖ్యమో.. వాటిని ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇన్వెస్ట్మెంట్లో నష్టాలు వస్తాయని భావించవచ్చు, కానీ సరైన అవగాహన ఉంటే అలాంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. డైవర్సిఫికేషన్ చాలా అవసరం.. సంపాదించి కూడబెట్టిన డబ్బు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయకుండా.. వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెట్టాలి. అంటే మీదగ్గరున్న డబ్బు కేవలం స్టాక్ మార్కెట్ మీద మాత్రమే కాకుండా.. గోల్డ్ లేదా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం వంటివాటిలో పెట్టుబడిగా పెట్టాలి. అప్పుడు ఒక రంగంలో నష్టం వచ్చినా.. మరో రంగంలో తప్పకుండా లాభం వస్తుంది. దీనిని ఎప్పుడూ మరచిపోకూడదు. అప్పులు చేయడం మానుకోవాలి.. సంపాదనకు తగిన ఖర్చులను మాత్రమే పెట్టుకోవాలి. విచ్చలవిడి ఖర్చులు చేస్తూ.. డబ్బు కోసం ఎక్కడపడితే అక్కడ అప్పులు చేస్తే తరువాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దీనిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అప్పు మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుందనే విషయం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఇదీ చదవండి: నకిలీ మందులకు చెక్.. ఒక్క క్యూఆర్ కోడ్‌తో మెడిసిన్ డీటెయిల్స్! గోల్ చాలా ముఖ్యం.. నువ్వు ధనవంతుడు కావాలంటే ముందుగా తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాలి. ఫైనాన్సియల్ గోల్స్ పెట్టుకోవాలి. మీ ప్రయాణాన్ని గోల్ వైపు సాగిస్తే తప్పకుండా అనుకున్నది సాదిస్తావు. ఇల్లు, కారు ఇతరత్రా ఏమి కొనాలనుకున్న ముందుగా ఒక ప్రణాలికను సిద్ధం చేసుకోవాలి. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి స్మార్ట్ ఇన్వెస్ట్ అవసరం.. ఇన్వెస్ట్ అంటే ఎదో ఒక రంగంలో గుడ్డిగా వెళ్లిపోవడం కాదు.. అలోచించి చాలా స్మార్ట్‌గా పెట్టుబడి పెట్టాలి. ట్యాక్స్ సేవింగ్స్, ఫండ్స్ వంటి వాటిని ఎంచుకోవాలి. తక్కువ సమయంలో అధిక వడ్డీ వచ్చే రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం మరచిపోకూడదు. యువకుడుగా ఉన్నప్పుడే రిస్క్ తీసుకోవాలి.. అప్పుడే సక్సెస్ పరుగెత్తుకుంటూ వస్తుంది. ధనవంతుడు కావాలనే కోరిక ఉంటే సరిపోదు.. దాని కోసం అహర్నిశలు ఆలోచించాలి, ఆ మార్గంలోనే ప్రయాణం కొనసాగించాలి. తెలియని రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు దాని గురించి తప్పకుండా తెలుసుకోవాలి, వీలైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఎక్కడ, ఎలా పెట్టుబడులు పెడుతున్నావో తెలియకపోతే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ఎట్టకేలకు గోల్.. దిగ్గజం రికార్డును బద్దలు కొట్టిన రొనాల్డో
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన రికార్డు సాధించాడు. ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ రికార్డు రొనాల్డో పేరిటే ఉంది. ఇప్పటివరకు రొనాల్డో 838 గోల్స్ సాధించాడు. కొంతకాలంగా గోల్స్ కొట్టడంలో విఫలమవుతున్న రొనాల్డో తాజాగా మంగళవారం హెడర్ గోల్‌తో మెరిశాడు. అరబ్ క్లబ్ చాంపియన్స్ క్లబ్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున అల్-నసర్, యూఎస్ మోనాస్టిర్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అల్-నసర్ 4-1 తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా ఆట 74వ నిమిషంలో రొనాల్డో సూపర్ హెడర్ గోల్‌తో మెరిశాడు. రొనాల్డో గోల్ కొట్టడానికి 8 నిమిషాల ముందు ప్రత్యర్థి జట్టు ఒక గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేసింది. అయితే రొనాల్డో 74వ నిమిషంలో హెడర్ గోల్‌తో తన జట్టును 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో ఫుట్‌బాల్‌లో అత్యధిక హెడర్ గోల్స్ కొట్టిన జాబితాలో జర్మనీ దిగ్గజం గెర్డ్ ముల్లర్‌ను అధిగమించాడు. ఇప్పటివరకు ముల్లర్‌తో కలిసి 144 హెడర్ గోల్స్‌తో సంయుక్తంగా ఉన్న రొనాల్డో తాజా గోల్(145 హెడర్)తో ముల్లర్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు తన కెరీర్లో 839వ గోల్ సాధించి అత్యధిక గోల్స్ విషయంలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. 22 SEASONS IN A ROW CRISTIANO RONALDO IS ETERNAL 🍷🐐pic.twitter.com/mEPwV62rhn — aurora (@cr7stianos) July 31, 2023 Ronaldooooooo pic.twitter.com/rab2wPkZAQ — AlNassr FC (@AlNassrFC_EN) July 31, 2023 చదవండి: Ricky Ponting: 'బంతిని మార్చడం వల్లే ఆసీస్ ఓటమి.. విచారణ చేపట్టండి' -
మెస్సీనా మజాకా.. క్లబ్‌లు మారినా గోల్స్ మాత్రం ఆగడం లేదుగా
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఏ క్లబ్‌కు ఆడినా తన జోరును చూపిస్తూనే ఉన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ నుంచి క్లబ్ మ్యాచ్ దాకా గోల్స్ కొడుతూనే ఉన్నాడు. ఇటీవలే పీఎస్జీ నుంచి ఇంటర్ మియామి(Inter Miami FC)కి రికార్డు ధరకు వెళ్లిన మెస్సీ క్లబ్ తరపున ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. లీగ్స్ కప్ ప్లేలో భాగంగా డీఆర్వీ పీఎన్కే స్టేడియం వేదికగా శనివారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) ఇంటర్ మియామి, క్రజ్ అజుల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మెస్సీ గోల్‌తో మెరిశాడు. మ్యాచ్ అదనపు సమయం(ఆట 94వ నిమిషం)లో లభించిన ఫ్రీకిక్‌ను సద్వినియోగం చేసుకున్న మెస్సీ బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ఇంటర్ మియామి జట్టు క్రజ్ అజుల్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. కాగా మ్యాచ్‌కు 22వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. మెస్సీని చూడడానికే వచ్చిన అభిమానులకు ఆట ముగిసే సమయానికి నిరాశే మిగిలింది. మెస్సీ గోల్ చూడకుండానే వెళ్లిపోతామేమోనని ఫీలయ్యారు. కానీ 94వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను మెస్సీ గోల్‌గా మలచడంతో స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఒక క్లబ్ తరపున అరేంగేట్రం మ్యాచ్‌లో ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచిన తొలి ఆటగాడిగా మెస్సీ రికార్డులకెక్కాడు. అమెరికన్ ప్రొఫెషనల్ సాకర్ క్లబ్ అయిన ఇంటర్ మయామి క్లబ్‌తో 2025 సీజన్ పూర్తయ్యే వరకు ఆడేందుకు మెస్సీ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం విలువ సీజన్‌కు రూ. 492 కోట్లు (60 మిలియన్ డాలర్లు) అని క్లబ్ వర్గాలు వెల్లడించాయి. LIONEL ANDRÉS MESSI IS NOT HUMAN. pic.twitter.com/2mBDI41mLy — Major League Soccer (@MLS) July 22, 2023 చదవండి: దురదృష్టవంతుల లిస్ట్‌లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్‌గా #Jadeja: ఔటయ్యింది ఒక బంతికి.. చూపించింది వేరే బంతిని -
లియోకి ఎందుకంత క్రేజ్?
-
హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. టాప్-4లో సునీల్ ఛెత్రి
భారత ఫుట్‌బాల్ స్టార్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ గోల్స్ పరంగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత జట్టు తరఫున 138వ మ్యాచ్ ఆడిన సునీల్ ఛెత్రి 90 గోల్స్ చేశాడు. ఇక టాప్–3లో క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–123 గోల్స్), అలీ దాయి (ఇరాన్–109 గోల్స్), మెస్సీ (అర్జెంటీనా–103 గోల్స్) ఉన్నారు.2005లో జూన్ 12న భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన 38 ఏళ్ల సునీల్ ఛెత్రి తొలి గోల్ కూడా పాకిస్తాన్ జట్టుపైనే రావడం విశేషం. దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో శుభారంభం చేసింది. పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో భారత్ 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి (10వ, 16వ, 74వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించగా... మరో గోల్‌ను ఉదాంత సింగ్ (81వ ని.లో) అందించాడు. 1952 తర్వాత భారత ఫుట్‌బాల్ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా ఇవ్వకపోవడం ఇదే ప్రథమం. శనివారం తమ తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్ ఆడుతుంది. IND vs PAK sees RED in the first half 🤯 India vs Pakistan is never fully complete without the fireworks and heated emotions 💥#INDvPAKonFanCode #SAFFChampionship2023 pic.twitter.com/xJLZTmcrp5 — FanCode (@FanCode) June 21, 2023 A perfectly placed Penalty by Sunil Chhetri and he gets his hattrick😍😍 pic.twitter.com/i2knCtsiH8 — Shanu 🇦🇷 (@secureboy23) June 21, 2023 -
హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. సెంచరీ కొట్టిన మెస్సీ
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ మంగళవారం మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అర్జెంటీనా తరపున వందో అంతర్జాతీయ గోల్ సాధించాడు. కురాకోతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అర్జెంటీనా 7-0తో రికార్డు విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. ఆట 20, 33, 37వ నిమిషాల్లో మెస్సీ గోల్స్ చేసి హ్యాట్రిక్‌తో పాటు వందో గోల్స్ సాధించాడు. ప్రస్తుతం మెస్సీ ఖాతాలో 102 గోల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ(174 మ్యాచ్‌ల్లో 102 గోల్స్) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్(198 మ్యాచ్‌ల్లో 122 గోల్స్) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెస్సీ మూడు గోల్స్ చేయగా.. నికోలస్ గొంజాలెజ్(ఆట 23వ నిమిషం), ఎంజో ఫెర్నాండేజ్(ఆట 35వ నిమిషం), ఏంజెల్ డి మారియా(ఆట 78వ నిమిషం), గొంజాలో మాంటెల్(ఆట 87వ నిమిషం)లో గోల్స్ చేయడంతో అర్జెంటీనా 7-0 తేడాతో కురాకోను చిత్తుగా ఓడించింది. కాగా మెస్సీకి అర్జెంటీనా తరపున ఇది ఏడో అంతర్జాతీయ హ్యాట్రిక్ గోల్స్ కావడం విశేషం. MESSI WHAT A CRAZY HALF, ENJOY THE GOALS!!!! 🐐🐐🐐 pic.twitter.com/f9nwKcoUeS — mx ⭐️⭐️⭐️ (@MessiMX30iiii) March 29, 2023 -
సాధించాడు.. టాప్-5లో భారత్ ఫుట్‌బాల్ స్టార్
ఫుట్‌బాల్‌లో భారత్ వెలుగులు లేకపోయినప్పటికి జట్టు స్టార్ ఆటగాడు..కెప్టెన్ సునీల్ ఛెత్రి మాత్రం వ్యక్తిగతంగా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూనే ఉన్నాడు. తాజాగా ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సునీల్ ఛెత్రి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం కిర్గిజ్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్ కొట్టడం ద్వారా సునీల్ అంతర్జాతీయ కెరీర్లో 85వ గోల్ నమోదు చేశాడు. ఈ క్రమంలో హంగేరీకి చెందిన ఫెరెన్క్ ఫుకాస్(85 మ్యాచ్‌ల్లో 84 గోల్స్)ను అధిగమించి టాప్-5లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 133 మ్యాచ్‌లాడిన సునీల్ ఛెత్రి 85 గోల్స్ నమోదు చేశాడు. ఇక తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్(198 మ్యాచ్‌ల్లో 122 గోల్స్) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్), అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్) మూడో స్థానంలో, మొక్తర్ దహారి- మలేషియా(142 మ్యాచ్‌ల్లో 89 గోల్స్) నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు విజేతగా నిలిచింది. మణిపూర్‌లో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–0 గోల్స్ తేడాతో కిర్గిజ్ రిపబ్లిక్ జట్టుపై గెలిచింది. భారత్ తరఫున సందేశ్ జింగాన్ (34వ ని.లో), సునీల్ చెత్రి (84వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. సునీల్ చెత్రి కెరీర్లో ఇది 85వ గోల్ కావడం విశేషం. ఈ టోర్నీలో ఆడిన మరో జట్టు మయన్మార్‌పై తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0తో విజయం సాధించింది. ....aaaaand that's #85 for Sunil Chhetri.pic.twitter.com/eUu6QHeUdE — Shyam Vasudevan (@JesuisShyam) March 28, 2023 📈 Most International Goals: 🇵🇹 Cristiano Ronaldo 𝟭𝟮𝟬 🇮🇷 Ali Daei 𝟭𝟬𝟵 🇦🇷 Lionel Messi 𝟵𝟵 🇲🇾 Mokhtar Dahari 𝟴𝟵 🇮🇳 Sunil Chhetri 𝟴𝟱 🇭🇺 Ferenc Puskás 𝟴𝟰 Sunil Chhetri becomes 5th all-time International Goalscorer. 🇮🇳🔥#IndianFootall #SC11 #BlueTigers pic.twitter.com/O1rU0ulunz — IFTWC - Indian Football (@IFTWC) March 28, 2023 చదవండి: అదే 26 పరుగులు.. శాసించిన చివరి ఓవర్ -
రొనాల్డో ప్రపంచ రికార్డు.. మెస్సీ చూస్తూ ఊరుకుంటాడా?
ప్రస్తుత ఫుట్‌బాల్ తరంలో లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఎవరికి వారే సాటి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు అందుకున్న ఈ ఇద్దరు సమానంగానే కనిపించినా మెస్సీ ఒక మెట్టు పైన ఉంటాడు. అందుకు కారణం గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను విజేతగా నిలపడమే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ అత్యధిక గోల్స్ చేసి 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనాకు మూడోసారి టైటిల్ అందించాడు. ఈ దెబ్బతో రొనాల్డో కాస్త వెనుకబడినట్లుగా అనిపించాడు. అయితే వ్యక్తిగతంగా చూస్తే మాత్రం ఇద్దరు పోటాపోటీగా ఉంటారు. ఒక రికార్డు రొనాల్డో బద్దలు కొట్టాడంటే వెంటనే మెస్సీ తన పేరిట ఒక రికార్డును లిఖించుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా రొనాల్డో దేశం తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే నీ వెనుకే నేను వస్తా అంటూ మెస్సీ కూడా తన కెరీర్లో 800వ గోల్ సాధించి కొత్త రికార్డు అందుకున్నాడు. బ్రూనస్ ఎయిర్స్ వేదికగా గురువారం అర్జెంటీనా, పనామాల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ సేన 2-0 తేడాతో విజయం సాధించింది. ఆట 89వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన ఫ్రీకిక్‌ను మెస్సీ తనదైన శైలిలో గోల్‌గా మలిచాడు. దీంతో తన కెరీర్లో 800వ గోల్ పూర్తి చేసుకున్న మెస్సీ అర్జెంటీనా తరపున 99వ గోల్ సాధించాడు. వంద గోల్స్ మార్క్‌ను చేరుకోవడానికి మెస్సీ ఇక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇక క్లబ్స్ తరపున 701 గోల్స్ చేసిన మెస్సీ ఓవరాల్‌గా 800 గోల్స్‌తో కొనసాగుతున్నాడు. గతేడాది డిసెంబర్లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచిన జట్టుతోనే అర్జెంటీనా బరిలోకి దిగడం విశేషం. Lionel Messi with an incredible free-kick 🇦🇷 We are witnessing greatness once again 🐐 pic.twitter.com/QBPUO7B9LY — SPORTbible (@sportbible) March 24, 2023 చదవండి: ఫుట్‌బాల్‌లో సంచలనం.. చారిత్రాత్మక గోల్ -
వెల్త్.. హెల్త్! దక్షిణాది ప్రజల ఆలోచన ఇదే! సర్వేలో కీలకాంశాలు
సాక్షి, హైదరాబాద్: కుటుంబ ఆర్థిక భద్రతకే దక్షిణాది రాష్ట్రాల పౌరులు అధికంగా మొగ్గుచూపుతున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ విషయంలో వారు మరింత జాగ్రత్తగా, ఆ లక్ష్యాల సాధన దిశగా కృషిచేస్తున్నారు. తమ జీవిత అత్యున్నత లక్ష్యాల్లో ‘కుటుంబ ఆర్థిక పరిపుష్టి’సాధన ముఖ్యమని 74 శాతం మంది భావిస్తున్నారు. అలాగే, ఆరోగ్య పరిరక్షణ, సామాజిక బాధ్యత కింద సేవా కార్యక్రమాలు, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు వంటి వాటిని వీరు ఇతర ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకున్నారు. ‘ఇండియాస్ లైఫ్ గోల్స్ ప్రిపేర్డ్నెస్–2023’పేరిట ఓ ప్రైవేట్ బీమా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లోని వారి జీవిత లక్ష్యాలు, వాటి సాధన ప్రాధాన్యతలపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా 13 మెట్రోలు, ప్రథమ, ద్వితీయశ్రేణి నగరాల్లో 22–55 ఏళ్ల వయసు మధ్య వారితో ఈ సర్వే నిర్వహించింది. దక్షిణాదికి సంబంధించి.. గుంటూరు, మదురై, బెంగళూరు, చెన్నైల్లో ఈ అధ్యయనం చేశారు. సర్వేలో కీలకాంశాలు ♦ వయసు, లింగ భేదంతో సంబంధం లేకుండా అంతా లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నారు ♦ ఇతర లక్ష్యాల కంటే కుటుంబ ఆర్థిక భద్రత తమ ప్రాధాన్యమన్న 74 శాతం మంది ♦ ఆరోగ్యపరిరక్షణ, సేవా కార్యక్రమాలు, ప్రయాణాలు ఇతర ప్రధాన లక్ష్యాలని అధికశాతం వెల్లడి ♦ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించిన లక్ష్యాలు నిర్దేశించుకున్న వారు 73 శాతం ♦ ప్రతీ ఇద్దరిలో ఒకరు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలనేది కోరిక ♦ తమను ప్రభావితం చేసే వాటిలో సోషల్ మీడియా పాత్ర పెరిగిందని ఎక్కువ మంది చెప్పారు ♦ సోషల్ మీడియా టాప్–3 లైఫ్‌గోల్స్ ఇన్ఫ్టుయెన్సర్లలో ఒకటిగా ఉంది ♦ కోవిడ్ అనంతర పరిస్థితుల్లో సామాజికసేవ, దాతృత్వం వైపు 61 శాతం మంది మొగ్గు ♦ ప్రతీ ముగ్గురిలో ఒకరు సామాజికంగా ప్రభావం చూపే వాటికి విరాళాలిచ్చేందుకు ఆసక్తి ♦ బాగా డబ్బు సంపాదించి ఉద్యోగాల నుంచి రిటైర్ కావాలనే భావనలో 30 శాతం ♦ లక్ష్యాల సాధనలో సందిగ్ధత వ్యక్తంచేసిన వారు 52 శాతం ♦ తమ జీవిత కాలంలో కనీసం ఐదు లక్ష్యాలనైనా చేరుకోవాలని ఆశిస్తున్నారు ♦ పిల్లలకు మంచి చదువు, సొంత ఇంటి కోసం ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు ♦ మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే మెట్రో నగరాల్లో నివసిస్తున్న వారిలో ఈ ఆశలు, ఆశయాలు మరింత ఎక్కువగా కనిపించాయి ♦ నవయువతరం మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల సాధనకు ఆసక్తి చూపింది. హెల్త్, ఫిట్నెస్, విదేశీ ప్రయాణం వైపు మొగ్గు చూపింది. జీవిత బీమాలో పెట్టుబడులు ‘దక్షిణ భారత ప్రజల జీవిత లక్ష్యాలు, ఆశలు, లక్ష్యాల సాధనకు సంబంధించి 40 అంశాలపై పరిశీలన చేశాం. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కుటుంబ ఆర్థిక భద్రతకు దక్షిణాది వారు పెద్దపీట వేశారు. తమ జీవిత లక్ష్యాల సాధనకు జీవిత బీమాలో పెట్టుబడులు పెట్టడమే సరైన మార్గమని అధికశాతం అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి జీవితం, కెరీర్, ఆరోగ్యం, కుటుంబం పట్ల దృష్టికోణాన్ని మార్చింది. కుటుంబభద్రత, సామాజికంగా మంచి సంబంధాలు కలిగి ఉండటం, సామాజిక–ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలన్నింటిని కలిపి మొత్తంగా జీవితాన్ని ప్రతిబించించేలా ఆలోచనలు మారాయి’అని బీమా సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ చంద్రమోహన్ మెహ్రా చెప్పారు. -
2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’
న్యూఢిల్లీ: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్య సాధనకు ఆధునిక సాంకేతికత దోహదపడతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డిజిటల్ విప్లవ ప్రయోజనాలు ప్రజలందరికీ దక్కేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా భారీస్థాయిలో ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. ‘అన్లీషింగ్ ద పొటెన్షియల్: ఈజ్ ఆఫ్ లివింగ్ యూజింగ్ టెక్నాలజీ’ పేరిట మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. చిన్న తరహా పరిశ్రమలపై భారంగా మారిన నిబంధనలను తొలగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. టెక్నాలజీతో పేదలకు లబ్ధి అన్ని రంగాల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని నరేంద్ర మోదీ వెల్లడించారు. 5జీ, కృత్రిమ మేధ(ఏఐ)పై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోందన్నారు. సాంకేతికతతో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పెనుమార్పులు రాబోతున్నాయన్నారు. ఒకే దేశం, ఒకే రేషన్‌తోపాటు జన్ ధన్ యోజన, ఆధార్, మొబైల్ నెంబర్(జేఏఎం)కు టెక్నాలజీయే ఆధారమని అన్నారు. దీనివల్ల పేదలకు లబ్ధి చేకూరుతోందని హర్షం వ్యక్తం చేశారు. సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఏఐ ద్వారా పరిష్కరించగలిగిన పదింటిని గుర్తించాలని నిపుణులకు సూచించారు. 21వ శతాబ్దాన్ని టెక్నాలజీ ముందుకు నడిపిస్తుందని, దీన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో ప్రజల జీవనాన్ని సులభతరం చేయడానికి ప్రతి బడ్జెట్లోనూ పెద్దపీట వేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని ఒక అవరోధంగా పరిగణించవద్దని ప్రజలకు సూచించారు. -
చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో ఘనత సాధించాడు. ఫుట్‌బాల్ క్లబ్స్ తరఫున 500 గోల్స్ చేశాడు. సౌదీ ప్రో లీగ్‌లో నాలుగు గోల్స్ కొట్టి ఈ రికార్డుకు చేరువయ్యాడు. అల్ వెహ్దాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో చెలరేగిపోయాడు. మునపటి రొనాల్డోను గుర్తు చేస్తూ 30 నిమిషాల వ్యవధిలో బంతిని నాలుగు సార్లు గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దాంతో, అల్-నసర్ క్లబ్ 4-0తో గెలుపొందింది. ప్రస్తుతం అతని ఖాతాలో 503 గోల్స్ ఉన్నాయి. పోర్చుగల్‌లోని సావో పెడ్రో అనే చిన్న ద్వీపంలో పుట్టిన రొనాల్డో మొదట్లో అండోరిన్హా, నసియోనల్ వంటి స్థానిక క్లబ్స్‌కు ఆడాడు. ఆటలో నైపుణ్యం సాధించిన అతను 18 ఏళ్లకే సీనియర్ టీమ్‌కు ఆడాడు. అతను ఇప్పటి వరకు ఐదు క్లబ్స్‌కు ఆడాడు. రియల్ మాడ్రిడ్ తరఫున రొనాల్డో అత్యధికంగా 311 గోల్స్ కొట్టాడు. ఆ తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున 103 గోల్స్ చేశాడు. జువెంటస్ క్లబ్‌కు ఆడిన సమయంలో 81 గోల్స్ చేశాడు. స్పోర్టింగ్ లెబనాన్ క్లబ్ తరఫున మూడు, తాజాగా అల్ నసర్ క్లబ్ తరపున ఐదు గోల్స్ కొట్టాడు. ఓవరాల్‌గా పోర్చుగల్ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు సహా అన్ని క్లబ్‌లు కలిపి 1100 మ్యాచ్‌లకు పైగా ఆడిన రొనాల్డో 820 గోల్స్ కొట్టాడు. Not bad for a 38yr-old… https://t.co/aFZJFwtlH1 — Piers Morgan (@piersmorgan) February 9, 2023 చదవండి: 135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్.. ఆటగాడిపై జీవితకాల నిషేధం ఆసీస్ కుర్రాడు ఆకట్టుకున్నా.. జడ్డూ, అక్షర్ తొక్కేశారు -
Lionel Messi: రొనాల్డో అరుదైన రికార్డు బద్దలు కొట్టిన మెస్సీ.. ఏకంగా..
Lionel Messi- Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో- లియోనల్ మెస్సీ.. ఈ ఇద్దరు ఫుట్‌బాల్ దిగ్గజాల మధ్య రికార్డుల పోటీ నువ్వా- నేనా అన్నట్లుగా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దకాలంగా సాకర్ ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్న ఈ ఇద్దరు లెజెండ్స్‌లో.. మెస్సీ ఫిఫా ప్రపంచకప్-2022 ట్రోఫీని ముద్దాడి ఓ మెట్టు పైన నిలిచాడు. మరోవైపు.. పోర్చుగల్ స్టార్ రొనాల్టోకు మాత్రం వరల్డ్‌కప్ టైటిల్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఖతర్ టోర్నీలో అర్జెంటీనా సూపర్‌స్టార్ మెస్సీ అద్భుతాలు చేయగా.. రొనాల్డో మాత్రం అవమానకర రీతిలో ఈవెంట్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. రొనాల్డో రికార్డు బద్దలు ఈ క్రమంలో రొనాల్డోకు సాధ్యం కాని పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న లియోనల్ మెస్సీ.. ఈ పోర్చుగల్ స్టార్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. టాప్-5 యూరోపియన్ లీగ్‌లలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా 697 గోల్స్‌తో రొనాల్డోను అధిగమించాడు మెస్సీ. ఫ్రెంచ్ లీగ్‌లో భాగంగా పారిస్ సెయింట్ జర్మనీ(పీఎస్జీ), మాంట్పిల్లర్ మ్యాచ్ సందర్భంగా మెస్సీ ఈ ఫీట్ నమోదు చేశాడు. పీఎస్జీకి ప్రాతినిథ్యం వహించిన ఈ అర్జెంటీనా లెజెండ్.. ఈ మ్యాచ్‌లో గోల్ ద్వారా రొనాల్డోను వెనక్కినెట్టాడు. క్లబ్ కెరీర్లో మొత్తంగా 697 గోల్స్ చేసి టాప్‌లో నిలిచాడు. ఇక ఇందులో ఈ సీజన్లో పీఎస్జీ తరఫున చేసిన గోల్స్ 13. మరోవైపు.. రొనాల్డో ఇప్పటి వరకు రియల్ మాడ్రిడ్ తరఫున 450, మాంచెస్టర్ యునైటెడ్ తరఫున 145, జువెంటస్ తరఫున 101 గోల్స్‌తో కలిపి మొత్తంగా 696 గోల్స్ సాధించాడు. ఇదిలా ఉంటే.. మాంట్పిల్లర్తో మ్యాచ్‌కు ముందు మెస్సీ మాట్లాడుతూ తన రిటైర్మెంట్పై సంకేతాలు ఇచ్చాడు. కోరుకున్నవన్నీ దక్కాయి.. ఇకపై ‘‘జాతీయ జట్టు తరఫున నేనైతే సాధించాలని అనుకున్నానో ఆ కల నెరవేరింది. వ్యక్తిగతంగా.. వృత్తిగతంగా నేను కోరుకున్నవన్నీ నాకు లభించాయి. శిఖరాగ్రంలో ఉన్నపుడే కెరీర్‌ను ముగించడమే మిగిలి ఉంది. నేను ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టినపుడు ఇక్కడి దాకా వస్తానని అస్సలు ఊహించలేదు. కెరీర్లో అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాను. ప్రస్తుతం నా జీవితంలో ఎలాంటి అసంతృప్తి లేదు. మేము 2021లో కోపా అమెరికా, 2022లో వరల్డ్‌కప్ గెలిచాము. ఇంతకంటే సాధించాల్సిందేమీ లేదు’’అని మెస్సీ అర్బన్ప్లేతో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్ అల్ నసర్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాడు. చదవండి: Shubman Gill Century: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్‌కు సచిన్ రావాల్సిందే! IND vs NZ: 'తీవ్రంగా నిరాశపరిచాడు.. స్పిన్నర్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలి’ What a Goal by the World Champion Lionel Messi. 🔥🐐 pic.twitter.com/yPJmqUgZda — x3a6y 🇦🇪 (@x3a6y) February 1, 2023 -
పీలే టాప్-10 స్టన్నింగ్ గోల్స్‌పై లుక్కేయాల్సిందే
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే(82) ఇకలేరు. అభిమానులను విషాదంలోకి నెట్టి తాను దివికేగారు. ‘‘నాకేం కాలేదని.. త్వరలోనే తిరిగి వస్తా’’నంటూ కొన్ని రోజుల క్రితం స్వయంగా ప్రకటించిన పీలే.. గురువారం అర్ధరాత్రి తర్వాత కానరాని లోకాలకు వెళ్లిపోయారు. పెద్ద పేగు కాన్సర్‌కు బలైపోయిన ఈ లెజెండ్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్‌గా ఆయన ఘనత సాధించారు. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించి బ్రెజిల్ ముఖచిత్రంగా మారారు. పీలే తన అటాకింగ్ స్కిల్స్‌తో ఫిఫా ప్రపంచాన్ని ఊపేశారు. తన డ్రిబ్లింగ్ ట్యాలెంట్‌తో ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టించేవాడు. గోల్ పోస్టునే టార్గెట్ చేస్తూ ముప్పుతిప్పలు పెట్టేవాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచుల్లో పీలే మొత్తం 12 గోల్స్ చేశాడు. పీలే కొట్టిన టాప్-10 అద్భుతమైన గోల్స్‌ను ఒకసారి చూసేయండి. ►17 ఏళ్ల వయసులో పీలే ఓ వండర్ చేశాడు. 1958లో బ్రెజిల్‌కు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందించాడు. ఆ టైటిల్‌తో ఆగలేదతను. పీలేలో ఉన్న గోల్ స్కోరింగ్ సామర్థ్యం అందర్నీ స్టన్ చేసేది. ఆ ఏడాది ఫ్రాన్స్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో అతను హ్యాట్రిక్ గోల్స్ కొట్టాడు. ► 1970వ సంవత్సరం పీలే కెరీర్లో ఓ మలుపురాయి లాంటింది. ఆ ఏడాది ఫిఫా వరల్డ్‌కప్‌ను కలర్లో టెలికాస్ట్ చేశారు. కొత్త టెక్నాలజీతో మ్యాచ్‌లను ప్రేక్షకులు వీక్షించారు. ఇక ఆ పీలే జోరును కూడా ప్రేక్షకులు కళ్లార్పకుండా చూశారు. యెల్లో జెర్సీలో పీలే చేసిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ టోర్నీలో ఇటలీతో జరిగిన ఫైనల్లో బ్రెజిల్ 4-1 తేడాతో నెగ్గింది. ఆ విజయంలో పీలే కీలక పాత్ర పోషించాడు. ► 1982లో బ్రెజిల్ మళ్లీ టైటిల్‌ను గెలుచుకున్నది. ఆ జట్టులో పీలే ఉన్నాడు. కానీ ఆ టోర్నీలో అతను కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గాయం వల్ల టోర్నీలోని మిగితా మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. 1966 టోర్నీలో బ్రెజిల్ గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయ్యింది. One of the greatest to ever play the game 🇧🇷⚽️ Join us in wishing the legendary @Pele a very Happy Birthday 🥳 pic.twitter.com/hwuU3d1Ufh — FIFA World Cup (@FIFAWorldCup) October 23, 2022 చదవండి: అసమాన ఆటతీరుకు సలాం.. చెక్కుచెదరని రికార్డులకు గులాం 'పీలే'.. ఆ పేరు ఎలా వచ్చింది; అసలు పేరేంటి? Pele: తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నవేళ -
FIFA World Cup: అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్లెవరంటే?
మరో రెండు రోజుల్లో టి20 వరల్డ్‌కప్ ముగియనుంది. ఇప్పటివరకు ఫోర్లు, సిక్సర్లు కౌంట్ చేసిన నోటితోనే గోల్స్ కౌంట్ చేయాల్సి ఉంటుంది. టి20 వరల్డ్‌కప్ ముగిసిన వారం రోజులకు మరో మెగా సమరం మొదలుకానుంది. క్రికెట్ కంటే కాస్త ఎక్కువే క్రేజ్ ఉన్న క్రీడ ఫుట్‌బాల్. మాములు ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతూనే అభిమానులకు పూనకాలు వస్తాయి. మరి అలాంటిది సాకర్ సమరానికి(ఫిఫా వరల్డ్‌కప్) సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే అప్పటివరకు మనకు తెలిసిన స్టార్స్‌ను ఉమ్మడిగా వేర్వేరు జట్లలో చూస్తుంటాం. కానీ ఫిఫా వరల్డ్‌కప్ అనగానే దేశం తరపున ఆడడానికి ఆటగాళ్లు సిద్ధమవుతారు. మరి అంత క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్ గురించి మాట్లాడుకుంటే.. 1930 నుంచి ఇప్పటి వరకూ 21 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ టోర్నీలు జరిగాయి. మరి ఇప్పటి వరకూ ఈ టోర్నీల్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్స్ ఎవరనేది ఒకసారి పరిశీలిద్దాం. మిరొస్లావ్ క్లోజ్ ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా జర్మనీ స్ట్రైకర్ మిరొస్లావ్ క్లోజ్ నిలుస్తాడు. అతడు ఇప్పటి వరకూ వరల్డ్‌కప్‌లలో 24 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 16 గోల్స్‌తో టాప్‌లో ఉన్నాడు. క్లోజ్ నాలుగు వరల్డ్‌కప్‌లు ఆడాడు. ఈ 24 మ్యాచ్‌లలో 63సార్లు అతడు గోల్డ్పోస్ట్పై దాడి చేసి 16 గోల్స్ చేయడం విశేషం. అంటే ప్రతి నాలుగు షాట్లలో ఒకదానిని అతడు గోల్‌గా మలిచాడు. రొనాల్డో లూయిస్ నజారియో డె లిమా మిరొస్లావ్ క్లోజ్‌కు ముందు అత్యధిక గోల్డ్స్ రికార్డు బ్రెజిల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో పేరిట ఉండేది. రొనాల్డో చివరిసారి 2002లో వరల్డ్‌కప్ గెలిచిన బ్రెజిల్ టీమ్‌లో సభ్యుడు. అతడు మూడు టోర్నీల్లో 19 మ్యాచ్‌లలోనే 15 గోల్స్ చేయడం విశేషం. 1998లో తాను ఆడిన తొలి వరల్డ్‌కప్‌లో నాలుగు గోల్స్ చేశాడు. ఇక 2002లో అయితే ఏడు మ్యాచ్‌లలోనే 8 గోల్స్ చేసిన గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు. అతని ప్రదర్శనతోనే 2002లో బ్రెజిల్ ఖాతాలో ఐదో టైటిల్ వచ్చి చేరింది. గెర్డ్ ముల్లర్ జర్మనీ లెజెండరీ ప్లేయర్ గెర్డ్ ముల్లర్ 14 వరల్డ్‌కప్ గోల్స్ చేశాడు. కేవలం రెండు వరల్డ్‌కప్‌లలో అతడు ఇన్ని గోల్స్ చేయడం విశేషం. 1970 వరల్డ్‌ప్‌లో 10 గోల్స్‌తో గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు. 1970 తర్వాత ముల్లర్ చేసినన్ని గోల్స్ మరే ఇతర వరల్డ్‌కప్‌లో ఏ ఆటగాడు కూడా చేయలేదు. జస్ట్ ఫాంటెయిన్ ఫ్రాన్స్ స్ట్రైకర్ ఫాంటెయిన్కు ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఉంది. అతడు 1958 వరల్డ్‌కప్‌లో ఏకంగా 13 గోల్స్ చేశాడు. అతడు ఆడిన ఏకైక వరల్డ్‌కప్ ఇదే కావడం గమనార్హం. పీలే బ్రెజిల్ లెజెండరీ ప్లేయర్ పీలే వరల్డ్‌కప్‌లలో 12 గోల్స్ చేశాడు. అతడు నాలుగు వరల్డ్‌కప్‌లు ఆడాడు. అతడు ఎప్పుడూ గోల్డెన్ బూట్ అవార్డు గెలవకపోయినా.. 1970లో బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ టోర్నీలో నాలుగు గోల్స్ చేయడంతోపాటు ఆరు గోల్స్ కావడంలో సాయపడ్డాడు. ఇప్పుడు ఖతార్‌లో జరగబోయే వరల్డ్‌కప్‌లో అందరి కళ్లూ థామస్ ముల్లర్, క్రిస్టియానో రొనాల్డో, లూయిస్ సురెజ్, లియోనెల్ మెస్సీ, కరీమా బెంజెమా లపైనే ఉన్నాయి. ముల్లర్ ఖాతాలో 10 గోల్స్ ఉండగా.. రొనాల్డో 7, మెస్సీ 6 గోల్స్ చేశారు. -
ప్రతినెలా డేటా అప్లోడ్ చేయాలి: సీఎం జగన్
-
ప్రగతి అనేది వాస్తవ రూపంలో ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వివరాల నమోదు సమగ్రంగా ఉంటేనే.. అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉందో.. లక్ష్యాల సాధన దిశలో ఎక్కడున్నామో స్పష్టంగా తెలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా.. ప్రతి అంశంలోకూడా సాధించాల్సిన ప్రగతిపై క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన, పర్యవేక్షణ చేయాలని అధికార యంత్రాంగానికి, సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సీఎం వైఎస్ జగన్ మాటల్లో.. గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో మన ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో గొప్ప వ్యవస్థను తీసుకొచ్చింది. అలాంటి సచివాలయాల నుంచి నిరంతర పర్యవేక్షణ, చేస్తున్న ప్రగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం చాలా ముఖ్యమైన అంశం. లేకపోతే సుస్థిర ప్రగతి లక్ష్యాలను చేరుకునే ప్రయాణంలో వాస్తవికత దూరం అవుతుంది. ప్రగతి అనేది కేవలం అందమైన అంకెల రూపంలో చూపడం కాదు, అవి వాస్తవాలుగా కనిపించాలని స్పష్టం చేశారాయన. ► ఆధార్ కార్డు నంబరు, వివరాలతో సహా డేటా నిక్షిప్తం చేయడంతోపాటు ... వచ్చిన మార్పులను చెప్పగలిగేలా ప్రగతి కనిపించాలి. ఏమైనా సమస్యలు ఉంటే.. వాటిని గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే గుర్తించి పరిష్కారాలు కూడా చూపాలి. ఉదాహరణకు.. రక్తహీనతను నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ అమలు చేస్తున్నాం. వీటిని అందుకుంటున్న మహిళల ఆరోగ్యంపై పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. ఆడపడుచులకు సరైన ఆహారం అందుతుందా? లేదా? అనేదానిపై గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే నిశిత దృష్టి ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ఆ స్థాయిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వంలో వివిధ విభాగాల తరపున గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఉన్నారు. తాము అనుకుంటున్న లక్ష్యాల సాధనకు గ్రామ, వార్డు సచివాలయాలను చోదక శక్తిలా వాడుకుని అందులోని సిబ్బందిని పూర్తి స్ధాయిలో భాగస్వాములు చేయాలి. సుస్ధిర లక్ష్యాల సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఉండాలి. అలాగే.. ► సచివాలయాల్లో సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణకు మండలాల వారీగా వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉండాలి. వీరు సచివాయాల్లోని ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ చేయాలి. దీనికి సంబంధించి ఎస్ఓపీలను రూపొందించుకోవాలి. ప్రభుత్వంలో ప్రతి విభాగానికి చెందిన విభాగాధిపతి ప్రతినెలలో రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలి. ఆ శాఖకు చెందిన సచివాలయ ఉద్యోగులు ఏరకంగా పనిచేస్తున్నారు? ప్రగతి లక్ష్యాల సాధన దిశగా ఏ రకంగా పనిచేస్తున్నారు? అనేది పరిశీలన చేయాలి. దీనివల్ల సిబ్బందికి సరైన మార్గదర్శకత్వం లభించడంతో పాటు అవగాహన కల్పించగలుగుతారు. ఎప్పటికప్పుడు వివరాల నమోదు కూడా సమగ్రంగా జరుగుతుందా? లేదా? అన్నదానిపై కూడా పరిశీలన, పర్యవేక్షణ జరుగుతుంది. అంతేకాదు.. ► లక్ష్యాల సాధన దిశలో మనం ఎక్కడున్నామో కూడా తెలుస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వాస్తవిక రూపం దాల్చిన అంశాలకు సంబంధించి వివరాల నమోదు ఎలా జరుగుతుంది? అనే విషయంపై జేసీలు, కలెక్టర్లు కూడా పరిశీలన చేయాలి. దీనివల్ల సచివాలయాల సిబ్బందిలో మెరుగైన పనితీరు కనిపిస్తుంది. అంతేకాదు ప్రగతి లక్ష్యాల సాధనలో మనం అడుగులు ముందుకుపడతాయి. దేశంలో రాష్ట్రం నంబర్ వన్‌గా నిలుస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాలను ఓనర్షిప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రభుత్వ విభాగానికి మండలాల వారీగా అధికారులను నియమించుకోవాలి. వీలైనంత త్వరగా ఈ అధికారుల నియామకం కావాలి. ► గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి నిర్దేశించిన ఎస్ఓపీలను మరోసారి పరిశీలించి వాటిలో మార్పులు, చేర్పులు అవసరమైతే చేయండి. నెలకు కనీసం రెండు సచివాలయాలను ప్రభుత్వ విభాగాధిపతులు పర్యవేక్షించాలి. కలెక్టర్లు, జేసీలు ఎలా పర్యవేక్షణ చేస్తున్నారో కూడా పరిశీలన చేయాలి. వ్యవసాయం, విద్య, మహిళ శిశు సంక్షేమం, ఆరోగ్యం తదితర రంగాల్లో మనం ఖర్చు చేస్తున్నట్టుగా దేశంలో ఏ ప్రభుత్వంకూడా ఖర్చు చేయడంలేదు. అందుకనే ఓనర్షిప్ తీసుకుని వాటిని సమగ్రంగా పర్యవేక్షణ చేయాల్సి అవసరం ఉంది. ప్రగతి లక్ష్యాల సాధనపై ప్రతి నెల రోజులకోసారి వివరాలు నమోదు కావాలి. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతను వాడుకోవాలి. పిల్లలు బడి మానేశారన్న మాట ఎక్కడా ఉండకూదు. డ్రాప్‌అవుట్స్ అన్న మాట ఎక్కడా వినిపించకూడదు. సచివాలయాల వారీగా, వాలంటీర్ల వారీగా పర్యవేక్షణ చేయాలి. ఎప్పటికప్పుడు దీనిపై దృష్టిపెట్టాలి. ఎక్కడైనా డ్రాప్‌అవుట్ జరిగిన ఘటన తెలిస్తే.. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా విద్యార్థుల హాజరును పరిశీలించాలి. పిల్లలు ఎవరైనా వరుసగా 3 రోజులు స్కూలుకు రాకపోతే కచ్చితంగా మూడోరోజు ఇంటికివెళ్లి ఆరాతీయాలి. పిల్లలు స్కూలుకు రాకపోతే కచ్చితంగా ఎస్ఎంఎస్లు పంపాలి. ఇది కచ్చితంగా జరిగేలా చూడాలి. ► కళ్యాణమస్తుకోసం నిర్దేశించిన అర్హతలు బాల్యవివాహాల నివారణ, అక్షరాస్యత పెంపుకోసం తోడ్పాటు నందిస్తాయి. వధూవరుల కనీస విద్యార్హత పదోతరగతిగా నిర్ణయించాం, అంతేకాదు పెళ్లికూతురు కనీస వయస్సు 18 ఏళ్లు, పెళ్లికొడుకు కనీస వయస్సు 21 సంవత్సరాలను పాటించాలని చెప్పాం. అలాగే.. ఎస్డీజీ లక్ష్యాల్లో పర్యావరణం, పరిశుభ్రత అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వాయు కాలుష్యం నివారణ, రక్షిత తాగునీరు అంశాలపైకూడా దృష్టిపెట్టాలి. విద్యారంగం సహా వివిధ రంగాల్లో అమలు చేస్తున్న సంస్కరణలు వలన రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. ► విద్యారంగంలో మనం చేపట్టిన సంస్కరణలు అన్నవి గొప్ప భవిష్యత్తు తరాలను అందిస్తాయి. ఇంగ్లిషుమీడియం సహా మనం తీసుకొచ్చిన అనేక సంస్కరణలు అమలుద్వారా పరిస్థితులను మార్చాలన్న మహాయజ్ఞాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఒక ప్రక్రియ ప్రారంభమైంది. దీన్ని అమలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. వీటి ఫలితాలు అన్నవి..మంచి భవిష్యత్తు తరాలుగా సమాజానికి అందుతాయి. ఇంగ్లిషు మాధ్యమానికి వ్యతిరేకంగా కొన్ని పత్రికలు నిరంతరం కథనాలు రాస్తున్నాయి. వారి పిల్లలు మాత్రం ఇంగ్లిషుమీడియంలో చదుకోవాలి, పేదవాళ్ల పిల్లలు మాత్రం ఇంగ్లిషు మీడియంలో చదవకూడదన్న వారి వైఖరిని పదేపదే బయటపెడుతున్నారు. పేదవాళ్ల పిల్లలకు ఇంగ్లిషు మీడియంలో చదువులు అందకూడదన్నది వారి ధ్యేయంగా కనిపిస్తోంది. ఇవాళ ప్రభుత్వం చేపట్టిన యజ్ఞం కొనసాగుతుంది. స్కూళ్ల నిర్వహణలో ఉత్తమ విధానాలు పాటించడం ద్వారా నాణ్యమైన చదువులు ఉచితంగా అందుతాయి. దీనివల్ల చదువుల కోసం చేస్తున్న ఖర్చు భారం నుంచి ఆయా కుటుంబాలు ఉపశమనం పొందుతాయి. అంతిమంగా ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం నెరవేరుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్పందనను మరింత మెరుగు పర్చండి ఇక వినతుల పరిష్కారంలో మరింత మెరుగైన వ్యవస్థ ‘స్పందన’కు మెరుగైన రూపంపై అధికారులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. వ్యక్తులకు సంబంధించిన సమస్యలతోపాటు, కమ్యూనిటీకి సంబంధించిన సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాం. ఒక నిర్ణీత సమయం పెట్టుకుని వాటిని శరవేగంగా పరిష్కరించి ప్రజలకు అండగా నిలిచాం. ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. స్పందనతోపాటు.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై కూడా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా దృష్టిపెట్టాం. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాటిని పరిష్కరించేందుకు నిధులు కూడా కేటాయించాం. ఇంకా ఏమైనా సమస్యలు మిగిలిపోయి ఉన్నాయా? అనేదానిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. స్పందన కార్యక్రమాన్ని మెరుపరిచేలా ఆలోచన చేయాలి. ► సమస్యల పరిష్కారంలో అంకితభావానికి నిదర్శనంగా మనం నిలవాలి: ప్రజల సమస్యలను తీర్చాలన్నదే మన ఉద్దేశం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత నిజాయితీగా, అంకిత భావంతో, కృతనిశ్చయంతో మనం ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేశాం. మనం అంతా కలిసికట్టుగా గతంలో ఎన్నడూలేని రీతిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. సమస్యల పరిష్కారంకోసం ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల్లో వృత్తి నైపుణ్యం పెంచడం, నిర్మాణాత్మక రీతిలో వ్యవహరించడం అనే అంవాలపై దృష్టిసారించాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలనుకూడా పరిశీలించి అందులో ఎక్కడైనా స్వీకరించదగ్గవి ఉంటే… వాటిని కూడా స్వీకరించాలి. ► పథకాలు కావొచ్చు, రెవిన్యూ రికార్డులకు సంబంధించిన అంశాలు కావొచ్చు.. ఇలా ఏదైనా కావొచ్చు. కాని ఏ ఒక్కరూ కూడా అర్హులైన వారు మిగిలిపోకూడదు, అలాగే సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా మిగిలిపోవద్దు అన్నదే దీని ఉద్దేశం. ఈ విధానం ఎలా ఉండాలి? ఎలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపాలి? అన్నదానిపై ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలి. సీఎంఓ, ఇతర ఉన్నతాధికారులతో కూడిన అధికారయంత్రాంగ వ్యవస్థకు ప్రజలు చేర్చిన ఫిర్యాదులు, వినతులకు పరిష్కారాలు చూపడమే ఉద్దేశంగా ఈ ఆలోచన. స్పందన కార్యక్రమంకన్నా మరింత మెరుగ్గా, సమర్థవంతంగా దీన్ని నిర్వహించాలన్నది ఉద్దేశం. అధికారులంతా కూర్చొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఇప్పటివరకూ అమలవుతున్న స్పందన కార్యక్రమాన్ని మైక్రోస్థాయిలోకూడా పరిశీలనచేసి.. వాటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలి. వినతుల పరిష్కారంలో ప్రజల సంతృప్తికి పెద్దపీట వేయాలి అని అధికారులతో సీఎం జగన్ చెప్పారు. చదవండి: సీఎం జగన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో..