క్వార్టర్స్‌లో చిలీ
* గ్రూప్-డి టాపర్‌గా అర్జెంటీనా
* కోపా అమెరికా కప్
ఫిలడెల్ఫియా: ఆరంభంలోనే ప్రత్యర్థులు గోల్‌తో ఒత్తిడి పెంచినా... మ్యాచ్ మధ్యలో తమదైన శైలిలో చెలరేగిన డిఫెండింగ్ చాంపియన్ చిలీ జట్టు.. కోపా అమెరికా కప్‌లో క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-డి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చిలీ 4-2తో పనామాపై నెగ్గింది. చిలీ తరఫున ఎడ్వర్డో వర్గాస్ (15, 43వ ని.), అలెక్సిస్ సాంచేజ్ (50, 89వ సె.) చెరో రెండు గోల్స్ చేశారు.
మిగుయెల్ కామర్గో (5వ ని.), అబ్డెల్ అరోయ్ (75వ ని.) పనామాకు గోల్స్ అందించారు. ఆట ప్రారంభంలోనే పనామా మిడ్‌ఫీల్డర్ కామర్గో గాల్లోకి ఎగురుతూ అద్భుతమైన గోల్ చేశాడు. అయితే మరో పది నిమిషాల్లోనే సాంచేజ్ ఇచ్చిన చక్కని పాస్‌ను వర్గాస్ చాలా దగ్గర్నించి నెట్‌లోకి ట్యాప్ చేసి స్కోరును సమం చేశాడు. బ్రేక్‌కు రెండు నిమిషాల ముందు లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి వర్గాస్ కొట్టిన బంతి; బ్రేక్ తర్వాత ఐదు నిమిషాలకు పెనాల్టీ ఏరియా నుంచి సాంచేజ్ కొట్టిన లాఫ్టెడ్ పాస్‌లు పనామా గోల్ పోస్ట్‌ను ఛేదించాయి. 25 నిమిషాల తర్వాత అరోయ్ గోల్ చేసి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాడు. ఆట మరో నిమిషంలో ముగుస్తుందనగా సాంచేజ్ రెండో గోల్‌తో చిలీ ఘన విజయం సాధించింది.
బొలీవియాపై అర్జెంటీనా విజయం
మరో మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో బొలీవియాపై గెలిచింది. దీంతో తొమ్మిది పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ఎరిక్ లామెల్లా (13వ ని.), జీక్వెల్ లావెజ్జి (15వ ని.), విక్టర్ క్యుయేస్టా (32వ ని.)లు అర్జెంటీనాకు గోల్స్ అందించారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న స్టార్ ఫార్వర్డ్ లియోనల్ మెస్సీ రెండో అర్ధభాగం ఆరంభంలో బరిలోకి దిగాడు.
క్వార్టర్‌ఫైనల్స్ షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం)
1. అమెరికా X ఈక్వెడార్ శుక్రవారం ఉ. గం 7 నుంచి
2. పెరూ X కొలంబియా శనివారం ఉ. గం 5.30 నుంచి
3. అర్జెంటీనా X వెనిజులా ఆదివారం ఉ. గం 4.30 నుంచి
4. మెక్సికో X చిలీ ఆదివారం ఉ. గం 7.30 నుంచి