కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ పొంగులేటి
బోనకల్ : రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండంలోని లక్ష్మీపురం సహకారం సంఘంలో ఆదివారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని తెలిపారు. బోనకల్ మండలంలో గతంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ రైతుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని లక్ష్మీపురం సహకార సంఘంలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
రైతులు ప్రభుత్వ మద్దతుధర క్వింటాకు రూ.1425 నిర్ణయించామన్నారు. దళారుల మాటలు విని మోసపోవద్దన్నారు. అనంతరం ఎంపీ పొంగులేటి మొక్కజొన్న కల్లాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో రాష్ట్రవిత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, మండలాధ్యక్షుడు ఏమూరి ప్రపాద్, జెడ్పీటీసీ బాణోతు కొండ, సొసైటీ అధ్యక్షుడు ఉమ్మనేని కోటయ్య, టీఆర్‌ఎస్‌జిల్లా నాయకులు లింగాల కమల్‌రాజు, పార్టీ మధిర నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొమ్మెర రాంమూర్తి, పార్టీ మండలాధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, ఉమ్మనేని కృష్ణ, యనిగండ్ల మురళి, తమ్మారపు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment