trs govt Target
-
రైతు శ్రేయస్సే ధ్యేయం
బోనకల్ : రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండంలోని లక్ష్మీపురం సహకారం సంఘంలో ఆదివారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని తెలిపారు. బోనకల్ మండలంలో గతంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ రైతుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని లక్ష్మీపురం సహకార సంఘంలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రైతులు ప్రభుత్వ మద్దతుధర క్వింటాకు రూ.1425 నిర్ణయించామన్నారు. దళారుల మాటలు విని మోసపోవద్దన్నారు. అనంతరం ఎంపీ పొంగులేటి మొక్కజొన్న కల్లాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్రవిత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, మండలాధ్యక్షుడు ఏమూరి ప్రపాద్, జెడ్పీటీసీ బాణోతు కొండ, సొసైటీ అధ్యక్షుడు ఉమ్మనేని కోటయ్య, టీఆర్‌ఎస్‌జిల్లా నాయకులు లింగాల కమల్‌రాజు, పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ బొమ్మెర రాంమూర్తి, పార్టీ మండలాధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, ఉమ్మనేని కృష్ణ, యనిగండ్ల మురళి, తమ్మారపు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఇల్లంతకుంట : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్లంతకుంటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు, వెల్జీపూర్‌లో రేణుకా ఎల్లమ్మ సిద్దోగం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశచరిత్రలోనే మొదటి సారిగా రైతులకు ఎకరాకు రూ.4 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కబోతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ లోని కోటి ఎకరాకు సాగు నీరందబోతుందన్నారు. మధ్యమానేరు ప్రాజెక్టు ద్వారా తొలి ఫలితం ఇల్లంతకుంట మండలానికే దక్కబోతుందని, జూన్‌లో మధ్యమానేరు నుంచి వరద కాల్వ ద్వారా మండలంలోని 38 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరకు విక్రయించుకోవాలని కోరారు. రైతులకు వచ్చే నెల 10 నుంచి పెట్టుబడి సాయంతో పాటు, కొత్త పాసుపుస్తకాలు అందిస్తామని పేర్కొన్నారు. ఎంపీపీ గుడిసె ఐలయ్య, జెడ్పీటీసీ సిద్దం వేణు, సెస్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ రాఘవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గుండ సరోజన, వైస్ ఎంపీపీ మల్లయ్య, సర్పంచులు మామిడి సంజీవ్, గుండ ఎల్లవ్వ, ఎంపీటీసీ భాస్కర్, ఏఎంసీ డైరెక్టర్ అనీల్‌కుమార్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
చింతపల్లి : హరిత తెలంగాణగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్‌శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మాల్ మార్కెట్‌యార్డులో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. హరిత తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డికి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఆయన మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు మాల్లో తమకు వసతి గృహం సదుపాయం లేదని మంత్రి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిలకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్పందిస్తూ సమస్య పరిష్కారం కోసం వెంటనే కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ గంగాధర్, డీఎస్పీ చంద్రమోహన్, సీఐ బాలగంగిరెడ్డి, ఎంపీపీ రవి, జెడ్పీటీసీ హరినాయక్, తహసీల్దార్ దేవదాస్, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఏపీఓ రాంచందర్‌నాయక్, స్థానిక సర్పంచ్ అంగిరేకుల విజయాగోవర్ధన్, ఎంపీటీసీ చేపూరి జగదాంబ, మార్కెట్ కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, తిప్పర్తి సురేష్‌రెడ్డి, సిరాజ్‌ఖాన్, హన్మంతు వెంకటేష్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిడి కిష్టారెడ్డి, ముచ్చర్ల యాదగిరి, మాస భాస్కర్, నట్వ గిరిధర్, బోరిగం భూపాల్, ఎల్లెంకి అశోక్, నరేందర్‌రావు, బిచ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.