కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
ఇల్లంతకుంట : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్లంతకుంటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు, వెల్జీపూర్‌లో రేణుకా ఎల్లమ్మ సిద్దోగం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశచరిత్రలోనే మొదటి సారిగా రైతులకు ఎకరాకు రూ.4 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కబోతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ లోని కోటి ఎకరాకు సాగు నీరందబోతుందన్నారు.
మధ్యమానేరు ప్రాజెక్టు ద్వారా తొలి ఫలితం ఇల్లంతకుంట మండలానికే దక్కబోతుందని, జూన్‌లో మధ్యమానేరు నుంచి వరద కాల్వ ద్వారా మండలంలోని 38 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరకు విక్రయించుకోవాలని కోరారు. రైతులకు వచ్చే నెల 10 నుంచి పెట్టుబడి సాయంతో పాటు, కొత్త పాసుపుస్తకాలు అందిస్తామని పేర్కొన్నారు.
ఎంపీపీ గుడిసె ఐలయ్య, జెడ్పీటీసీ సిద్దం వేణు, సెస్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ రాఘవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గుండ సరోజన, వైస్ ఎంపీపీ మల్లయ్య, సర్పంచులు మామిడి సంజీవ్, గుండ ఎల్లవ్వ, ఎంపీటీసీ భాస్కర్, ఏఎంసీ డైరెక్టర్ అనీల్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment