గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మంగళవారం నూతన యుద్ధ లక్ష్యాలతో ముందుకు సాగుతామని ప్రకటిటిచారు. ‘‘రాజకీయ భద్రతా కేబినెట్ యుద్ధం లక్ష్యాలను నవీకరించింది. క్రాస్ బార్డర్‌లో హమాస్ అనుకూల మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాతో చోటుచేసుకున్న కాల్పుల కారణంగా పారిపోయిన ఉత్తరాది నివాసితులను సురక్షితంగా తిరిగి ఇజ్రాయెల్‌లోకి తీసుకొస్తాం’ అని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు.. గాజా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే కట్టుబడి ఉంటామని హిజ్బుల్లా ప్రతినిధులు తెలిపారు. అయితే లెబనాన్ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో మిలిటెంట్లను తాము అనుమతించబోమని తేల్చిచెప్పారు. ఈ దాడుల్లో లెబనాన్‌కు చెందిన వందల ఫైటర్లు, ఇజ్రాయెల్ దేశానికి చెందిన పౌరులు, సైనికులు మరణించారు. ఈ దాడుల కారణంగా ఇరుదేశాలకు సంబంధించి సుమారు పదివేల మంది పౌరులు వలసవెళ్లారు.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ఇజ్రాయెల్‌ను సందర్శించిన అమెరికా రాయబారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ఉత్తర నివవాసితులను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి తీసుకురావడానికి మిగిలి ఉన్న ఏకైక మార్గం సైనిక చర్య మాత్రమేనని అన్నారు. రక్షణ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment