హాకీ
రియో డి జనీరో: తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న కెనడా జట్టుతో జరిగిన మ్యాచ్‌ను భారత పురుషుల హాకీ జట్టు 2-2 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (33వ నిమిషంలో), రమణ్‌దీప్ సింగ్ (41వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... కెనడా జట్టుకు స్కాట్ టప్పర్ (33వ నిమిషంలో, 52వ నిమిషంలో) రెండు గోల్స్ అందించాడు. భారత్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ రెండింటిలో గెలిచి, మరో రెండింటిలో ఓడి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించి ఏడు పాయింట్లతో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సంపాదించింది.
మరోవైపు జర్మనీ తమ చివరి మ్యాచ్‌లో 2-1తో నెదర్లాండ్స్‌ను ఓడించి మొత్తం 13 పాయింట్లతో గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలిచింది. నెదర్లాండ్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అర్జెంటీనా, ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్‌లో అర్జెంటీనా గెలిస్తే... భారత్ నాలుగో స్థానంలో నిలుస్తుంది. అర్జెంటీనా ఓడిపోతే భారత్ మూడో స్థానంలో, ఐర్లాండ్ నాలుగో స్థానంలో నిలుస్తాయి. మరోవైపు మహిళల హాకీలో భారత జట్టు 0-3తో అమెరికా చేతిలో ఓడి వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది.