మాస్కో: తొలి సాకర్ సమరంలో ఆతిథ్య రష్యా జట్టు సౌదీ ఆరేబియాపై 5-0తో ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన రష్యా ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. బంతిని పూర్తిగా రష్యా నియంత్రణలో ఉంచుకొని వీలు చిక్కినప్పుడల్లా గోల్స్ చేస్తూ ప్రత్యర్ధి జట్టుపై ఒత్తిడి పెంచింది. ఆట ప్రారంభమైన 11వ నిమిషంలో యూరి గాజీన్స్యీ ఫిఫా ప్రపంచ కప్‌లో తొలి గోల్ సాధించాడు. అనంతరం 42 వ నిమిషంలో డెనిస్ చెరిషెవ్ మరో గోల్ సాధించాడు. దీంతో ప్రథమార్థం ముగిసే సరికి 2-0తో రష్యా ఆధిపత్యంలో ఉంది.
విరామం అనంతరం రక్షణాత్మక ధోరణిలో ఆడిన ఇరుజట్లు మరో గోల్ సాధించడనికి చాలా సమయం పట్టింది. అర్టెమ్ డజిబా 70వ నిమిషంలో రష్యాకు మూడో గోల్ అందించాడు. విజయం ఖాయం కావడంతో చివర్లో రష్యా ఆటగాళ్లు చెలరేగారు. డెనిస్ చెరిషెవ్, అలెగ్జాండర్ గోలవిన్‌లు చెరో గోల్ సాధించడంతో రష్యా ఎనిమిది నెలల తర్వాత విజయాన్ని సాధించింది. దీంతో మ్యాచ్‌కు ముందు చెవిటి పిల్లి అచిల్లె చెప్పిన జోస్యం నిజమైంది.
Comments
Please login to add a commentAdd a comment