మాస్కో: ఫిఫా ప్రపంచకప్ కొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు రష్యా, సౌదీ ఆరేబియాతో తలపడనుంది. అయితే ఎనిమిది నెలలుగా ఒక్క విజయం లేని రష్యా జట్టుకు, అభిమానులకు ఊరటనిచ్చే వార్త. 2010 ఫిఫా ప్రపంచ కప్‌లో ఆక్టోపస్ పాల్ మ్యాచ్‌కు ముందే ఏ జట్టు విజయం సాధిస్తుందో జోస్యం చెప్పి అందరీనీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.
తాజాగా 2018 ఫిఫా ప్రపంచ కప్‌లో ఒక చెవిటి పిల్లి అచిల్లె వార్తల్లో నిలిచింది. మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో ముందే చెప్పేలా కొందరు నిర్వాహకులు అచిల్లెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు పాల్గొనే జట్ల జెండాలు, వాటి పక్కన ఆహారంతో నింపిన బాక్స్‌లు ఉంచుతారు. అచిల్లె ఏ జెండా పక్కన ఉన్న బాక్స్‌లోని ఆహారం తీసుకుంటే ఆ జట్టు గెలుస్తుందని అభిమానుల నమ్మకం.
నేడు జరిగే రష్యా, సౌదీ అరేబియా జెండాలను ఉంచగా అచిల్లె రష్యా జెండా పక్కనున్న బాక్స్‌లోని ఆహారం తీసుకుంది. దీంతో నిర్వాహకులు నేటి మ్యాచ్ విజేత ఆతిథ్య రష్యా అని జోస్యం చెబుతున్నారు. ఇక నేటి ఆరంభ మ్యాచ్‌లో రష్యా గెలిస్తే అచిల్లెకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. మరి రాత్రి 8.30 గంటలకు మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సౌదీపై రష్యాగెలుస్తుందో లేదో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment