థియాబౌట్ ఇంటర్వూ్య
ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) తాజా సీజన్‌లో చెల్సీ గోల్ కీపర్ థియాబౌట్ కౌర్టియస్ తన కెరీర్‌లోనే అత్యంత భీకర ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ప్రత్యర్థుల గోల్స్ ప్రయత్నాలకు అడ్డుగోడలా నిలవడంతోపాటు 13 వరుస విజయాల రికార్డును తమ జట్టు సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న చెల్సీ గురువారం టాటెన్‌హామ్‌తో పోటీపడనుంది. ఈ నేపథ్యంలో చెల్సీకి మరో విజయం ఖాయమని కౌర్టియస్ భావిస్తున్నాడు.
ఆరంభంలో కాస్త కష్టపడినా ప్రస్తుతం మీ జట్టు విజయపథంలో దూసుకెళుతోంది. ఈ అద్భుత ప్రయాణం ఎలా అనిపిస్తోంది?
మేం చాలా సంతోషంగా ఉన్నాం. ప్రస్తుతం అంతా బాగానే సాగుతోంది. పాయింట్ల పరంగానూ మేం టాప్‌లో ఉన్నాం. అయితే మేమింకా సహనంతో ఉండడంతో పాటు కష్టపడాల్సిందే. టాటెన్‌హామ్‌తో పోటీ అంత సులువేమీ కాదు. ఆ తర్వాత మా మ్యాచ్ లీస్టర్‌తో ఉంటుంది. రెండూ కఠిన జట్లే. కచ్చితంగా చెల్సీ అప్రమత్తంగా ఉండాల్సిందే.
గతేడాదిలో మీ జట్టు ఈపీఎల్ టైటిల్ గెలవడం అందరికీ అసాధ్యంగా అనిపించింది. ఇప్పుడు మీరే ఫేవరెట్లుగా ఉన్నారు. దీన్ని ఎలా అంచనా వేస్తారు?
2015–16 సీజన్ మాకు నిరాశ కలిగించింది. అయితే తాజా విజయాలతో మేం ఇప్పుడు మెరుగ్గా ఉన్నాం. అప్పటి పాయింట్లతో పోలిస్తే ఇప్పుడు మేం చాలా సాధించి టాప్‌లో ఉన్నాం. కానీ ఎలాంటి అలక్ష్యానికి తావీయకుండా పోరాడాల్సి ఉంది.
చెల్సీ వరుసగా 13 విజయాలతో దూసుకెళుతోంది. ఈ సమయంలో ప్రత్యర్థులకు మీరు నాలుగు గోల్స్ మాత్రమే ఇవ్వగలిగారు. ఎలా అనిపిస్తోంది?
నిజంగా ఇది అద్భుతమే. శిక్షణ సమయంలో మేం పడిన కఠిన శ్రమకు ఫలితమిది. కచ్చితంగా మేం మరింత పటిష్టంగా ప్రత్యర్థి జట్లకు పోటీనిస్తాము. జట్టులో నెలకొన్న మంచి వాతావరణం వల్లే ఇది సాధ్యమైంది..
రికార్డు విజయం ఖాయం
Published Wed, Jan 4 2017 12:19 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
Advertisement
Advertisement