ఆసియా కప్ మహిళల క్వాలిఫయింగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు రెండో ఘోర పరాజయం
ప్యాంగ్‌యాంగ్ (ఉత్తర కొరియా): ఆసియా కప్ మహిళల క్వాలిఫయింగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు రెండో ఘోర పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా దక్షిణ కొరియాతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 0–10 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది.
దక్షిణ కొరియా తరఫున లీ జెయుమ్ మిన్ మూడు గోల్స్, జీ సు యున్ రెండు గోల్స్ చేయగా... కాంగ్ యు మి, లీ మిన్ ఎ, లీ యున్ మి, యూ యుంగా, లీ సో డామ్ ఒక్కో గోల్ సాధించారు. ఇదే టోర్నీ తొలి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య ఉత్తర కొరియా చేతిలో టీమిండియా 0–8 గోల్స్ తేడాతో ఓడింది.