బంతుల్లోనూ కెమెరాలు
రియో: ఈసారి ప్రపంచకప్‌లో టెక్నాలజీని విసృ్తతంగా వాడుకోబోతున్నారు. గోల్స్ విషయంలో రిఫరీలు తీసుకునే నిర్ణయాలు వివాదం కాకుండా ఉండటం కోసం ఫిఫా పూర్తి స్థాయిలో సిద్ధమైంది. దీని కోసం గోల్‌లైన్ టెక్నాలజీని ఉపయోగించనుంది. దీని కోసం ప్రతీ స్టేడియంలో అదనంగా 14 హైస్పీడ్ కెమెరాలను వినియోగించనున్నారు. 7 కెమెరాలను ఒక గోల్‌పోస్ట్ వైపు, మిగిలిన 7 కెమెరాలను మరో గోల్‌పోస్ట్ వైపు ఫోకస్ చేస్తారు. వీటిని ప్రధాన కంప్యూటర్‌కు అనుసంధానిస్తారు. బంతి గోల్‌లైన్‌ను దాటిన సెకనులోపే కంప్యూటర్ నుంచి గోల్ అనే సంకేతం వస్తుంది.
రిఫరీ ధరించిన ప్రత్యేక వాచ్‌కు మాత్రమే గోల్ సంకేతం అందుతుంది. అప్పుడు రిఫరీ దాన్ని గోల్‌గా ప్రకటిస్తాడు. గత ఏడాది బ్రెజిల్‌లో జరిగిన కాన్ఫెడరేషన్ కప్ సందర్భంగా గోల్‌లైన్ టెక్నాలజీని వినియోగించారు. ఇక ఈ ప్రపంచకప్‌లో ఉపయోగిస్తున్న బ్రజూకా బంతుల్లో కూడా కెమెరాలను నిక్షిప్తం చేశారు. సాకర్ బంతుల్లో ఉపయోగిస్తున్న ఈ కెమెరాల ద్వారా కూడా బంతి గోల్ లైన్ దాటిందా లేదా అన్నది తెలిసే అవకాశాలున్నాయి.