బెంగళూరు ఎఫ్‌సీ సంచలనం
బెంగళూరు: ఏఎఫ్‌సీ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ కొత్త చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి భారత క్లబ్‌గా బెంగళూరు ఎఫ్‌సీ రికార్డు సృష్టించింది. బుధవారం ఇక్కడ జరిగిన సెమీ ఫైనల్లో (రెండో రౌండ్) బెంగళూరు 3-1 తేడాతో మలేసియా జట్టు, డిఫెండింగ్ చాంపియన్ జొహొర్ దారుల్ తక్‌జీమ్‌పై విజయం సాధించింది.
ఇరు జట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ సెమీస్ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. దాంతో ఓవరాల్ స్కోరింగ్‌లో బెంగళూరు 4-2తో ఆధిక్యం ప్రదర్శించి తుది పోరుకు అర్హత సాధించింది. జట్టు తరఫున సునీల్ ఛెత్రి (41, 66వ ని.)రెండు గోల్స్ చేయగా, జువానన్ (75వ నిమిషం) మరో గోల్ సాధించాడు. జొహొర్ జట్టు ఆటగాడు సఫీఖ్ రహమాన్ (11వ నిమిషం) ఏకై క గోల్ నమోదు చేశాడు. ఫైనల్లో బెంగళూరు ఎఫ్‌సీ...అల్ ఖువా అల్ జవియా (ఇరాక్ ఎరుుర్‌ఫోర్స్ క్లబ్) జట్టుతో తలపడుతుంది.