హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో కళింగ లాన్సర్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో కళింగ లాన్సర్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. రాంచీ రేస్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్ 4–2 గోల్స్ తేడాతో గెలిచింది. లాన్సర్స్ జట్టు తరఫున గ్లెన్ టర్నర్ నాలుగు గోల్స్ చేయడం విశేషం. రాంచీ రేస్ జట్టుకు సర్వన్‌జిత్ సింగ్ రెండు గోల్స్ అందించాడు. మంగళవారం జరిగే మ్యాచ్‌లో దబంగ్ ముంబై జట్టుతో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ తలపడుతుంది.