Kalinga Lancers
-
హెచ్ఐఎల్ కింగ్ కళింగ
చండీగఢ్: పొగొట్టుకున్న చోటే వెతుక్కోవడం అంటే ఇదేనేమో... గత సీజన్ తుదిమెట్టుపై చేజారిన టైటిల్‌ను ఈసారి కళింగ లాన్సర్స్ ఒడిసి పట్టుకుంది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్లో విజేతగా నిలిచింది. ఫైనల్లో కళింగ జట్టు 4–1తో దబంగ్ ముంబైపై జయభేరి మోగించింది. లాన్సర్స్ ఆటగాళ్ల దూకుడుతో మొదలైన ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. మోరిట్జ్ ఫ్యుయరిస్ట్ రెండు గోల్స్‌తో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పో షించాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్ రెండు అర్ధభాగాలు ముగిసే సమయానికి మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. మొదట ఇరు జట్ల ఆటగాళ్లు చెమటోడ్చడంతో తొలి క్వార్టర్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో అర్ధభాగంలో కళింగ లాన్సర్ ఆటగాళ్లు ఒక్కసారిగా చెలరేగారు. దీంతో ఆట మొదలైన మూడో నిమిషంలోనే గ్లెన్ టర్నర్ (18వ నిమిషం) ఫీల్డు గోల్ చేయడంతో కళింగ జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచింది. హెచ్ఐఎల్ నిబంధనల ప్రకారం ఫీల్డు గోల్‌కు రెండు గోల్స్‌గా పరిగణిస్తారు. తర్వాత రెండో క్వార్టర్ కాసేపట్లో ముగుస్తుందనగా మోరిట్జ్ ఫ్యుయరిస్ట్ (30వ ని.) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో కళింగ 3–0తో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే మూడో క్వార్టర్లో దబంగ్ ముంబై ఖాతా తెరిచింది. ఆట 33వ నిమిషంలో అఫాన్ యూసుఫ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచడంతో కళింగ ఆధిక్యం 3–1కు తగ్గింది. చివరి క్వార్టర్లో మళ్లీ మోరిట్జ్ (59వ ని.) గోల్ చేయడంతో లాన్సర్ 4–1తో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. విజేతగా నిలిచిన కళింగ లాన్సర్స్‌కు రూ. 2 కోట్ల 50 లక్షలు... రన్నరప్ ముంబై జట్టుకు రూ. కోటీ 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో యూపీ విజార్డ్స్ 5–4తో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ను ఓడించింది. -
ఫైనల్లో దబంగ్ ముంబై, కళింగ లాన్సర్స్
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబంగ్ ముంబై, కళింగ లాన్సర్స్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో దబంగ్ ముంబై జట్టు 2–0తో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై గెలుపొందగా... కళింగ లాన్సర్స్ ‘షూటౌట్’లో 4–3తో యూపీ విజార్డ్స్ జట్టును ఓడించింది. నేడు ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
కళింగ లాన్సర్స్‌పై ఢిల్లీ వేవ్‌రైడర్స్ గెలుపు
ఢిల్లీ: హాకీ ఇండియా లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్ జట్టు 6–4తో కళింగ లాన్సర్స్‌పై నెగ్గింది. ఢిల్లీ జట్టులో తల్విందర్ (9వ ని.), సిమోన్ (59వ ని.) ఫీల్డ్ గోల్స్ (రెండు గోల్స్‌తో సమానం) చేయగా... జస్టిన్ (29వ ని.), రూపిందర్ (57వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచారు. -
కళింగ, యూపీ మ్యాచ్ డ్రా
లక్నో: హాకీ ఇండియా లీగ్‌లో భాగంగా కళింగ లాన్సర్స్, యూపీ విజార్డ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయింది. ధ్యాన్‌చంద్ హాకీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్ 2–2 గోల్స్‌తో డ్రాగా ముగిసింది. యూపీ విజార్డ్స్ తరఫున వీఆర్ రఘునాథ్ (15వ ని.), గొంజాలో పేయ్లట్ లు గోల్స్ సాధించగా... కళింగ లాన్సర్స్ తరఫున కెప్టెన్ మోరిట్జ్ ప్యూర్స్టే (15వ ని., 51వ ని.) రెండు గోల్స్‌ను చేశాడు. శనివారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ వారియర్స్‌తో దబంగ్ ముంబై తలపడుతుంది. -
కళింగపై ముంబై జయభేరి
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబంగ్ ముంబై అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5–2 స్కోరుతో కళింగ లాన్సర్స్‌ను కంగుతినిపించింది. దీంతో ఏడు మ్యాచ్‌లాడిన ముంబై నాలుగు విజయాలతో 23 పాయింట్లతో పట్టికలో టాప్‌లో నిలిచింది. దబంగ్ దెబ్బకు కళింగ (20) రెండో స్థానానికి పడిపోయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు రెచ్చిపోయారు. మ్యాచ్ జరిగే కొద్దీ రెట్టించిన ఉత్సాహంతో కదంతొక్కారు. ఈ జట్టు తరఫున హర్మన్‌ప్రీత్ (23వ ని.) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచగా... ఫ్లోరియన్ ఫుచెస్ (31వ ని.), గుర్జంత్ సింగ్ (53వ ని.) ఫీల్డు గోల్స్ చేశారు. దీంతో నిబంధనల ప్రకారం రెండేసి పాయింట్లు లభించాయి. చివర్లో గ్లెన్ టర్నర్ (57వ ని.) ఫీల్డ్ గోల్ చేయడంతో కళింగ జట్టుకు 2 పాయింట్లు దక్కాయి. -
కళింగ లాన్సర్స్‌కు రెండో విజయం
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో కళింగ లాన్సర్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. రాంచీ రేస్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్ 4–2 గోల్స్ తేడాతో గెలిచింది. లాన్సర్స్ జట్టు తరఫున గ్లెన్ టర్నర్ నాలుగు గోల్స్ చేయడం విశేషం. రాంచీ రేస్ జట్టుకు సర్వన్జిత్ సింగ్ రెండు గోల్స్ అందించాడు. మంగళవారం జరిగే మ్యాచ్‌లో దబంగ్ ముంబై జట్టుతో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ తలపడుతుంది. -
వారెవ్వా... వారియర్స్
హాకీ ఇండియా లీగ్ విజేత పంజాబ్ ఫైనల్లో కళింగ లాన్సర్స్‌పై గెలుపు రూ.2.50 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ రూపిందర్ రాంచీ: వరుసగా మూడుసార్లు ఫైనల్‌కు చేరిన జేపీ పంజాబ్ వారియర్స్ జట్టు చివరకు అనుకున్నది సాధించింది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) నాలుగో సీజన్లో నూతన చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సర్దార్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు 6-1 తేడాతో కళింగ లాన్సర్స్‌పై ఘనవిజయం సాధించింది. విజేతగా నిలిచిన పంజాబ్‌కు రూ. 2 కోట్ల 50 లక్షల ప్రైజ్‌మనీ దక్కగా... రన్నరప్ కళింగకు రూ. కోటీ 75 లక్షలు లభించాయి. పంజాబ్ తరఫున అర్మాన్ ఖురేషి (4వ నిమిషంలో), మాట్ గోడెస్ (39), సత్బీర్ సింగ్ (42) ఫీల్డ్ గోల్స్ (రెండు గోల్స్‌తో సమానం)తో అదరగొట్టగా... కళింగకు లభించిన ఏకైక గోల్ కెప్టెన్ మోరిట్జ్ అందించాడు. రెండేళ్లుగా తుది మెట్టుపై బోల్తా పడుతూ వచ్చిన పంజాబ్ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి రానీయకూడదనే కసితో తమ ఆటను ప్రారంభించింది. ఫలితంగా నాలుగో నిమిషంలోనే కళింగకు షాక్ తగిలింది. సర్కిల్లో బ్రౌన్ నుంచి అందుకున్న పాస్‌ను అర్మాన్ ఖురేషి చక్కటి ఫీల్డ్ గోల్‌తో జట్టుకు 2-0తో ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత రెండు పెనాల్టీ కార్నర్లు వచ్చినా గోల్స్‌గా మలచలేకపోయారు. అయితే రెండో క్వార్టర్ 24వ నిమిషంలో కళింగ బోణీ చేసింది. లీగ్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా ఉన్న మోరిట్జ్ తమకు లభించిన తొలి పెనాల్టీని గోల్‌గా మలవడంతో స్కోరు 2-1కి తగ్గింది. మూడో క్వార్టర్లో పంజాబ్ ఆటగాళ్లు చక్క టి సమన్వయంతో ముందుకు వెళ్లారు. దీంతో నాలు గు నిమిషాల వ్యవధిలో రెండు ఫీల్డ్ గోల్స్ నమోదయ్యాయి. 39వ నిమిషంలో మాట్ గోడెస్, 42వ నిమిషంలో సత్బీర్ గోల్స్ సాధించడంతో స్కోరు 6-1కి పెరిగింది. చివర్లో ఇరు జట్లకు పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించినా సఫలం కాలేదు. రాంచీ రేస్‌తో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్ 2-0తో విజయం సాధించింది. అవార్డులు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్: రూపిందర్ పాల్ సింగ్ (ఢిల్లీ, రూ.50 లక్షలు) అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు: గ్లెన్ టర్నర్(కళింగ లాన్సర్స్, రూ.20 లక్షలు) ఫెయిర్ ప్లే అవార్డు: యూపీ విజార్డ్స్ అప్‌కమింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ: సుమిత్ -
కళింగ లాన్సర్స్ విజయం
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో కళింగ లాన్సర్స్ తొలి విజయాన్ని అందుకుంది. ప్రారంభ మ్యాచ్‌లో యూపీ విజార్డ్స్ చేతిలో ఓడిన కళింగ ఈసారి మెరుగ్గా ఆడింది. గురువారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో దబాంగ్ ముంబైపై 4-2 తేడాతో నెగ్గింది. తొలి అర్ధభాగం వరకు ఇరు జట్ల నుంచి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే 35వ నిమిషంలో ఫ్లోరియన్ ఫచ్ ముంబైకి తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత పుంజుకున్న కళింగ 45వ నిమిషంలో ఆడమ్ డిక్సన్, 51వ నిమిషంలో గ్లెన్ టర్నర్ ఫీల్డ్ గోల్స్‌తో గెలిచింది. -
‘కళింగ’ శుభారంభం
హాకీ ఇండియా లీగ్ భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) - 2015లో కళింగ లాన్సర్స్ జట్టు శుభారంభం చేసింది. సొంతగడ్డపై గురువారం జరిగిన లీగ్ తొలి మ్యాచ్‌లో లాన్సర్స్ 6-3 గోల్స్ తేడాతో రాంచీ రేస్‌ను చిత్తు చేసింది. తొలి క్వార్టర్లో కళింగ తరఫున ల్యూకాస్ విలా (9వ నిమిషం), రేస్ తరఫున బారీ మిడిల్టన్ (15వ నిమిషం)లో గోల్స్ చేశారు. అయితే రెండు, మూడు క్వార్టర్స్‌లో దూకుడుగా ఆడిన కళింగ వరుసగా గోల్స్ చేసింది. ర్యాన్ ఆర్కిబాల్డ్ (17), విక్రమ్ కాంత్ (18), గుర్జీందర్ సింగ్ (37), మన్దీప్ అంటిల్ (58), మొహమ్మద్ ఖాన్ (60) ఈ గోల్స్ చేశారు. మరో వైపు రాంచీ ఆటగాళ్లలో కెప్టెన్ యాష్లే జాక్సన్ (36, 50) ఒక్కడే రెండు గోల్స్ చేశాడు. శుక్రవారం జరిగే మ్యాచ్‌లలో యూపీ, ఢిల్లీతో... ముంబై, పంజాబ్‌తో తలపడతాయి.