కళింగపై ముంబై జయభేరి | Kalinga on the Mumbai JayaBheri | Sakshi
Sakshi News home page

కళింగపై ముంబై జయభేరి

Published Sun, Feb 5 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

Kalinga on the Mumbai JayaBheri

భువనేశ్వర్‌: హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో దబంగ్‌ ముంబై అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5–2 స్కోరుతో కళింగ లాన్సర్స్‌ను కంగుతినిపించింది. దీంతో ఏడు మ్యాచ్‌లాడిన ముంబై నాలుగు విజయాలతో 23 పాయింట్లతో పట్టికలో టాప్‌లో నిలిచింది. దబంగ్‌ దెబ్బకు కళింగ (20) రెండో స్థానానికి పడిపోయింది.

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు రెచ్చిపోయారు. మ్యాచ్‌ జరిగే కొద్దీ రెట్టించిన ఉత్సాహంతో కదంతొక్కారు. ఈ జట్టు తరఫున హర్మన్‌ప్రీత్‌ (23వ ని.) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచగా... ఫ్లోరియన్‌ ఫుచెస్‌ (31వ ని.), గుర్జంత్‌ సింగ్‌ (53వ ని.) ఫీల్డు గోల్స్‌ చేశారు. దీంతో నిబంధనల ప్రకారం రెండేసి పాయింట్లు లభించాయి. చివర్లో గ్లెన్‌ టర్నర్‌ (57వ ని.) ఫీల్డ్‌ గోల్‌ చేయడంతో కళింగ జట్టుకు 2 పాయింట్లు దక్కాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement