dabang Mumbai
-
ఫైనల్లో దబంగ్ ముంబై, కళింగ లాన్సర్స్
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబంగ్ ముంబై, కళింగ లాన్సర్స్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో దబంగ్ ముంబై జట్టు 2–0తో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై గెలుపొందగా... కళింగ లాన్సర్స్ ‘షూటౌట్’లో 4–3తో యూపీ విజార్డ్స్ జట్టును ఓడించింది. నేడు ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
దబంగ్ ముంబై చేతిలో పంజాబ్ వారియర్స్ ఓటమి
ఛండీగఢ్: హాకీ ఇండియా లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ వారియర్స్‌కు దబంగ్ ముంబై జట్టు షాక్ ఇచ్చింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 2–1తో గెలుపొందింది. ఓటమి తప్పదనుకున్న తరుణంలో 60వ నిమిషంలో రాబర్ట్ కెంపర్‌మన్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్‌తో సమానం)తో ముంబైని గెలిపించాడు. పంజాబ్ జట్టు తరఫున మింక్ వాన్‌డెర్ వీర్డెన్ 37వ ని.లో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌తో కళింగ లాన్సర్స్ తలపడుతుంది. -
కళింగపై ముంబై జయభేరి
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబంగ్ ముంబై అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5–2 స్కోరుతో కళింగ లాన్సర్స్‌ను కంగుతినిపించింది. దీంతో ఏడు మ్యాచ్‌లాడిన ముంబై నాలుగు విజయాలతో 23 పాయింట్లతో పట్టికలో టాప్‌లో నిలిచింది. దబంగ్ దెబ్బకు కళింగ (20) రెండో స్థానానికి పడిపోయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు రెచ్చిపోయారు. మ్యాచ్ జరిగే కొద్దీ రెట్టించిన ఉత్సాహంతో కదంతొక్కారు. ఈ జట్టు తరఫున హర్మన్‌ప్రీత్ (23వ ని.) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచగా... ఫ్లోరియన్ ఫుచెస్ (31వ ని.), గుర్జంత్ సింగ్ (53వ ని.) ఫీల్డు గోల్స్ చేశారు. దీంతో నిబంధనల ప్రకారం రెండేసి పాయింట్లు లభించాయి. చివర్లో గ్లెన్ టర్నర్ (57వ ని.) ఫీల్డ్ గోల్ చేయడంతో కళింగ జట్టుకు 2 పాయింట్లు దక్కాయి. -
ముంబై ‘హ్యాట్రిక్’
ముంబై: హాకీ ఇండియా లీగ్‌లో దబంగ్ ముంబై ‘హ్యాట్రిక్’ విజయం సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 3–2 గోల్స్ తేడాతో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై నెగ్గింది. ముంబై ఆటగాడు యూసుఫ్ (29వ ని. 30వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేశాడు. 29వ నిమిషంలో ఫీల్డ్ గోల్ చేయడంతో 2 పాయింట్లు లభించాయి. ఢిల్లీ తరఫున రీడ్ (43వ ని.), రూపిందర్ (55వ ని.) చెరో గోల్ చేశారు. -
ముంబై చేతిలో పంజాబ్‌కు షాక్
ముంబై: డిఫెండింగ్ చాంపియన్ జేపీ పంజాబ్ వారియర్స్‌కు దబంగ్ ముంబై చేతిలో దారుణ పరాజయం ఎదురైంది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్ లో భాగంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 10–4 తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌లో అన్నీ ఫీల్డ్ గోల్సే నమోదు కావడంతో ఒక్కో గోల్‌కు రెండు పాయింట్లు లభించాయి. ముంబై నుంచి ఆరో నిమిషంలోనే నికిన్ తిమ్మయ్య గోల్‌తో జట్టు 2–0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సునీల్ యాదవ్ (25), ఫ్లోరియన్ (30, 43), యూసుఫ్ (49, 50) గోల్స్ చేశారు. పంజాబ్ నుంచి గోడెస్ (13), అర్మాన్ ఖురేషి (44) చెరో గోల్ చేశారు. శనివారం జరిగే మ్యాచ్‌లో రాంచీ రేస్‌తో ఢిల్లీ వేవ్‌రైడర్స్ ఆడుతుంది.