హాకీ ఇండియా లీగ్‌లో దబంగ్ ముంబై ‘హ్యాట్రిక్’ విజయం సాధించింది.
ముంబై: హాకీ ఇండియా లీగ్‌లో దబంగ్ ముంబై ‘హ్యాట్రిక్’ విజయం సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 3–2 గోల్స్ తేడాతో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై నెగ్గింది. ముంబై ఆటగాడు యూసుఫ్ (29వ ని. 30వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేశాడు. 29వ నిమిషంలో ఫీల్డ్ గోల్ చేయడంతో 2 పాయింట్లు లభించాయి. ఢిల్లీ తరఫున రీడ్ (43వ ని.), రూపిందర్ (55వ ని.) చెరో గోల్ చేశారు.