ముంబై చేతిలో పంజాబ్‌కు షాక్‌ | Dabang Mumbai beat Jaypee Punjab Warriors 10-4 | Sakshi
Sakshi News home page

ముంబై చేతిలో పంజాబ్‌కు షాక్‌

Published Sat, Jan 28 2017 1:10 AM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

Dabang Mumbai beat Jaypee Punjab Warriors 10-4

ముంబై: డిఫెండింగ్‌ చాంపియన్  జేపీ పంజాబ్‌ వారియర్స్‌కు దబంగ్‌ ముంబై చేతిలో దారుణ పరాజయం ఎదురైంది. హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) ఐదో సీజన్ లో భాగంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 10–4 తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌లో అన్నీ ఫీల్డ్‌ గోల్సే నమోదు కావడంతో ఒక్కో గోల్‌కు రెండు పాయింట్లు లభించాయి.

ముంబై నుంచి ఆరో నిమిషంలోనే నికిన్  తిమ్మయ్య గోల్‌తో జట్టు 2–0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సునీల్‌ యాదవ్‌ (25), ఫ్లోరియన్  (30, 43), యూసుఫ్‌ (49, 50) గోల్స్‌ చేశారు. పంజాబ్‌ నుంచి  గోడెస్‌ (13), అర్మాన్  ఖురేషి (44) చెరో గోల్‌ చేశారు. శనివారం జరిగే మ్యాచ్‌లో రాంచీ రేస్‌తో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ ఆడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement