చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో దబంగ్ ముంబై, కళింగ లాన్సర్స్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో దబంగ్ ముంబై జట్టు 2–0తో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై గెలుపొందగా... కళింగ లాన్సర్స్ ‘షూటౌట్’లో 4–3తో యూపీ విజార్డ్స్ జట్టును ఓడించింది. నేడు ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.