హాకీ ఇండియా లీగ్
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) - 2015లో కళింగ లాన్సర్స్ జట్టు శుభారంభం చేసింది. సొంతగడ్డపై గురువారం జరిగిన లీగ్ తొలి మ్యాచ్‌లో లాన్సర్స్ 6-3 గోల్స్ తేడాతో రాంచీ రేస్‌ను చిత్తు చేసింది. తొలి క్వార్టర్‌లో కళింగ తరఫున ల్యూకాస్ విలా (9వ నిమిషం), రేస్ తరఫున బారీ మిడిల్‌టన్ (15వ నిమిషం)లో గోల్స్ చేశారు. అయితే రెండు, మూడు క్వార్టర్స్‌లో దూకుడుగా ఆడిన కళింగ వరుసగా గోల్స్ చేసింది.
ర్యాన్ ఆర్కిబాల్డ్ (17), విక్రమ్ కాంత్ (18), గుర్జీందర్ సింగ్ (37), మన్‌దీప్ అంటిల్ (58), మొహమ్మద్ ఖాన్ (60) ఈ గోల్స్ చేశారు. మరో వైపు రాంచీ ఆటగాళ్లలో కెప్టెన్ యాష్లే జాక్సన్ (36, 50) ఒక్కడే రెండు గోల్స్ చేశాడు. శుక్రవారం జరిగే మ్యాచ్‌లలో యూపీ, ఢిల్లీతో... ముంబై, పంజాబ్‌తో తలపడతాయి.
‘కళింగ’ శుభారంభం
Published Fri, Jan 23 2015 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM
Advertisement
Advertisement