వారియర్స్‌ను గెలిపించిన జాకబ్ | Punjab Warriors off to a winning start | Sakshi
Sakshi News home page

వారియర్స్‌ను గెలిపించిన జాకబ్

Published Wed, Jan 20 2016 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

వారియర్స్‌ను గెలిపించిన జాకబ్

వారియర్స్‌ను గెలిపించిన జాకబ్

చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో పంజాబ్ వారియర్స్ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ జట్టుకు షాక్ ఇచ్చింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ వారియర్స్ 2-0 గోల్స్ తేడాతో రాంచీ రేస్ జట్టును ఓడించింది. ఆట రెండో నిమిషంలోనే జాకబ్ వెటన్ ఫీల్డ్ గోల్ చేశాడు. హెచ్‌ఐఎల్ నిబంధనల ప్రకారం ఫీల్డ్ గోల్ చేస్తే దానిని రెండు గోల్స్‌గా పరిగణిస్తారు. దాంతో ఆరంభంలోనే వారియర్స్ జట్టు 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్‌ను చేయడంలో విఫలమయ్యాయి. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌తో పంజాబ్ వారియర్స్ తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement