బ్రాటిస్లావా (స్లొవేకియా): అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఆదివారం అద్భుతం జరిగింది. వేర్వేరు వేదికల్లో జరిగిన రెండు అధికారిక ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో రెండు ఫాస్టెస్ట్ గోల్స్ నమోదయ్యాయి. బ్రాటిస్లావాలో స్లొవేకియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ్రస్టియా 2–0తో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆట మొదలైన 6 సెకన్లకే ఆ్రస్టియా ప్లేయర్ క్రిస్టోఫ్ బామ్‌గార్ట్‌నర్ గోల్ చేశాడు. మిడ్ ఫీల్డ్ నుంచి క్షణాల్లో ముగ్గురు డిఫెండర్లను తప్పించుకొని ముందుకు దూసుకెళ్లిన క్రిస్టోఫ్ లాంగ్‌షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు.
మరోవైపు లియోన్‌లో ఫ్రాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జర్మనీ జట్టు 2–0తో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ఆట మొదలైన 7 సెకన్లకే జర్మనీ ప్లేయర్ ఫ్లోరియన్ విట్జ్ గోల్ చేశాడు. ఇన్నాళ్లూ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఫాస్టెస్ట్ గోల్ చేసిన రికార్డు లుకాస్ పొడోల్‌స్కీ పేరిట ఉంది. 2013లో ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌లో పొడోల్‌స్కీ 9వ సెకనులో గోల్ సాధించాడు. పొడోల్‌స్కీ 11 ఏళ్ల రికార్డు ఒకేరోజు బద్దలు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment