ఇండియన్ సూపర్ లీగ్‌లో ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గానే ముగిసాయి.
మార్గో: ఇండియన్ సూపర్ లీగ్‌లో ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గానే ముగిసాయి. ముంబయి-గోవా, కేరళ-ఢిల్లీల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. విజయాలతో ఊపుమీదున్న ముంబయి సిటీ ఎఫ్‌సీ జట్టుకు... ఎఫ్‌సీ గోవా జట్టు ఈ మ్యాచ్‌లో బ్రేకులు వేసింది.
గోవాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి ఇరు జట్లు గోల్స్ చేసే అవకాశం వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాయి. టోర్నీ ఆరంభం నుంచి సత్తా చాటలేకపోతున్న కేరళ బ్లాస్టర్స్, ఢిల్లీ డైనమోస్ మధ్య కొచ్చిలో జరిగిన మ్యాచ్ కూడా నిరాశజనకంగానే ముగిసింది. గోల్స్ సాధించడంలో ఇరు జట్ల ఆటగాళ్లు విఫలమయ్యారు. ఐఎస్‌ఎల్‌లో సోమవారం మ్యాచ్‌లు లేవు.