ఐఎస్‌ఎల్: ఢిల్లీపై గోవా విజయం | isl: Delhi beet the Goa | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎల్: ఢిల్లీపై గోవా విజయం

Published Fri, Nov 14 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

isl: Delhi beet the Goa

న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ఎఫ్‌సీ గోవా జట్టు సత్తా చూపించింది. గురువారం ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 4-1 తేడాతో ఘనవిజయం సాధించింది. ఆట ప్రారంభమైన 18వ నిమిషంలోనే బెంజెలోన్ గోల్‌తో గోవా ఖాతా తెరిచింది.

ఆ తర్వాత 48వ నిమిషంలో బెంజెలోన్ రెండో గోల్ సాధించాడు. 53వ నిమిషంలో లభించిన పెనాల్టీని సీనియర్ మిడ్‌ఫీల్డర్ రాబర్ట్ పైర్స్ గోల్‌గా మలిచి జట్టుకు 3-0 ఆధిక్యాన్ని అందించాడు. 60వ నిమిషంలో ఒజ్బే గోల్‌తో గోవా తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. అయితే 73వ నిమిషంలో ఢిల్లీకి పెనాల్టీ కిక్ రూపంలో సాంటోస్ ఓ గోల్ అందించాడు.
 


 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement