అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఇంటర్ మియామి క్లబ్‌లో మంచి ముహూర్తంలో జాయిన్ అయినట్లున్నాడు. ఇప్పటివరకు ఇంటర్ మియామి క్లబ్ తరపున ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ మెస్సీ గోల్స్‌తో మెరిశాడు. అందులో రెండు మ్యాచ్‌ల్లో డబుల్ గోల్స్ కొట్టి అభిమానులను అలరించాడు. తాజాగా గురువారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) ఓర్లాండో సిటీ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్ మియామి 3-1తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఉరుములు, మెరుపుల కారణంగా మ్యాచ్ 95 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.
అయితే మ్యాచ్ ఆలస్యమైనప్పటికి మెస్సీ మాత్రం గోల్ కొట్టడంలో పెద్దగా టైం తీసుకోలేదు. ఆట 7వ నిమిషంలోనే మెస్సీ తన జట్టుకు తొలి గోల్ అందించాడు. అయితే ఓర్లాండో సిటీ ఆట 11వ నిమిషంలో గోల్ కొట్టి సోర్కును సమం చేసింది. అక్కడి నుంచి తొలి హాఫ్ ముగిసేవరకు మరో గోల్ నమోదు కాలేదు. రెండో హాఫ్ మొదలైన కాసేపటికి ఆట 51వ నిమిషంలో జోసెఫ్ మార్టినేజ్ పెనాల్టీని గోల్‌గా మలిచాడు.
ఇక ఆట 72వ నిమిషంలో మెస్సీ మరో గోల్ కొట్టి జట్టును 3-1తో స్పష్టమైన ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిర్ణీత సమయంలోగా ఓర్లాండో మరో గోల్ కొట్టలేకపోవడంతో ఇంటర్ మియామి విజయాన్ని నమోదు చేసింది. కాగా మెస్సీ రెండు గోల్స్ కొట్టిన సందర్భంలో మ్యాచ్‌కు హాజరైన అతని భార్య ఆంటోనెలా రోకుజో స్టాండ్స్‌లో సెలబ్రేట్ చేసుకోవడం వైరల్‌గా మారింది.
జెర్సీ అమ్మకాల్లో దిగ్గజాలను అధిగమించిన మెస్సీ..
కాగా మెస్సీ మరొక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గోల్స్‌తో రికార్డులు కొట్టడమే కాదు తాజాగా మెస్సీకి చెందిన జెర్సీ అమ్మకాల్లోనూ రికార్డులను కొల్లగొట్టాడు. 24 గంటల వ్యవధిలో మెస్సీ ఇంటర్ మియామి జెర్సీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో జెర్సీ అమ్మకాల విషయంలో క్రిస్టియానో రొనాల్డో, టామ్ బ్రాడీ, ఎన్‌బీఏ దిగ్గజం లెబ్రన్ జేమ్స్‌లను మెస్సీ అధిగమించాడు. 2021లో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ తరపున, 2020లో టాంపా బే బుక్కానీర్స్‌లో టామ్ బ్రాడీ జాయిన్ అయిన సమయంలో.. 2018 లో ఎల్‌ఏ లేకర్స్ తరపున లెబ్రన్ జేమ్స్ జాయిన్ అయినప్పుడు వారి జెర్సీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.
MESSI X ROBERT TAYLOR BANGERS ONLY 🤯🤯
— Inter Miami CF (@InterMiamiCF) August 3, 2023
Taylor puts Messi in with the chip to give us the early lead over Orlando City.#MIAvORL | 📺#MLSSeasonPass on @AppleTV pic.twitter.com/kvb8Lmcccj
చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్
100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్
Comments
Please login to add a commentAdd a comment