
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ మంచి దూకుడు మీద ఉన్నాడు. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ గెలిచినప్పటి నుంచి మెస్సీలో ఉత్సాహం మాత్రం తగ్గడం లేదు. పైగ రోజురోజుకు మెస్సీ క్రేజ్ పెరుగుతూనే ఉంది. అతని జోరు.. ఫిట్‌నెస్ చూస్తుంటే మరో ఫిఫా వరల్డ్‌కప్ ఆడేలా కనపిస్తున్నాడు.
తాజాగా గురువారం బీజింగ్ వేదికగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్‌లో మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ నమోదు చేశాడు. ఆట మొదలైన నిమిషం 19 సెకన్ల వ్యవధిలోనే మెస్సీ అర్జెంటీనాకు గోల్ అందించాడు. మెస్సీ కెరీర్‌లో ఇదే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక గత ఏడు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా తరపున మెస్సీకి ఇది ఏడో గోల్ కాగా.. ఓవరాల్‌గా ఈ ఏడాది 13 మ్యాచ్‌ల్లో 17 గోల్స్ చేసిన మెస్సీ.. 5 అసిస్ట్‌లు అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అర్జెంటీనా ఆస్ట్రేలియాపై 2-0 తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే మెస్సీ గోల్ అందించగా.. ఆట 68వ నిమిషంలో జెర్మన్ పెజెల్లా జట్టుకు రెండో గోల్ అందించాడు.
Leo Messi. After one minute.
— B/R Football (@brfootball) June 15, 2023
Of course ☄️
(via @CBSSportsGolazo)pic.twitter.com/r5UknzrZvB
చదవండి: ఐపీఎల్ బంధం ముగిసే.. మేజర్ లీగ్ క్రికెట్‌లో మొదలు