
లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్‌లో ఎవరికి వారే సాటి. అయితే మెస్సీ ఇటీవలే అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌కప్ అందించి రొనాల్డో కంటే ఒక మెట్టు పైనే ఉన్నాడు. మరో వరల్డ్‌కప్ జరిగేందుకు నాలుగేళ్ల సమయం ఉంది. వచ్చే వరల్డ్‌కప్‌లో ఈ ఇద్దరు ఆడుతారా లేదా అనేది ఆసక్తికరమే. ఈ విషయం పక్కనబెడితే.. మెస్సీ, రొనాల్డోలు ఒకే ఫుట్‌బాల్ క్లబ్‌కు ఆడిన సందర్భాలకంటే ప్రత్యర్థులుగా తలపడిన సందర్భమే ప్రేక్షకులకు ఎక్కువ మజాను అందిస్తుంది.
తాజాగా ఫిఫా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు ప్రత్యర్థులుగా మరోసారి తలపడ్డారు. దీనికి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ వేదికైంది. ఇటీవలే వివాదాస్పద రీతిలో మాంచెస్టర్ యునైటెడ్‌ను వీడిన క్రిస్టియానో రొనాల్డో.. సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్ అయిన అల్-నసర్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇక మెస్సీ, నెయ్‌మర్, కైలియన్ ఎంబాపెలు పారిస్ సెయింట్స్ జర్మన్(పీఎస్‌జీ)కి ఆడుతున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఫహద్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో మెస్సీ నేతృత్వంలోని ఆల్‌స్టార్స్ ఎలెవన్ జట్టు 5-4తో గెలుపొందింది.
కాగా మ్యాచ్ మధ్యలో మెస్సీ రొనాల్డోవైపు ఒక లుక్ ఇచ్చాడు. కానీ రొనాల్డో మాత్రం మెస్సీని పట్టించుకోనట్లుగానే వ్యవహరించాడు. ఆ సమయంలో మెస్సీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెస్సీ ఇచ్చిన ఒక్క చూపు సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే ఇదంతా కేవలం కామెడీ కోసం మాత్రమే అని తర్వాత అర్థమైంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకున్న వీడియో బయటికి వచ్చింది.ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం రొనాల్డో సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టాడు. ''కొంత మంది పాత స్నేహితులను కలుసుకోవడం సంతోషంగా అనిపించింది.'' అంటూ కామెంట్ చేశాడు.
Love someone who looks at you like Messi looks at Cristiano Ronaldo 🥂#CR7𓃵 pic.twitter.com/d4Z5Q5hZAq
— Sarah (@_m__sara) January 19, 2023