పోలీసు, మీడియా మెరుగైన సేవలు అందించాలి
పోలీసు, మీడియా మెరుగైన సేవలు అందించాలి
Published Thu, Dec 8 2016 11:32 PM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
కర్నూలు (టౌన్): పోలీసులు, మీడియా సమన్వయంతో సమాజానికి మరిన్ని సేవలు అందించాలని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. గురువారం స్థానిక స్పోర్ట్సు ఆథారిటి అవుట్‌డోర్ స్టేడియంలో పోలీసులకు, మీడియా మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించారు. ఉత్సాహంగా సాగిన మ్యాచ్‌లో జిల్లా ఎస్పీ 13 పరుగులతో పోలీసు టీమ్‌ను ఉత్సాహ పరిచారు. మీడియా టీమ్ మేనేజర్ మధు సుధాకర్ నేతృత్వంలో మీడియా సభ్యులు క్రికెట్‌లో ఉత్సాహంగా ఆడారు. మొదట టాస్ గెలిచిన పోలీసు టీమ్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఓపెనర్‌గా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగి 2 ఫోర్లతో 13 పరుగులు సాధించారు. 6 వికెట్ల నష్టానికి పోలీసు టీమ్ 98 పరుగులు సాధించారు. తరువాత బ్యాటింగ్ చేసిన మీడియా టీమ్ 98 పరుగులు చేసి స్కోరును సమం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న జర్నలిస్టుల క్రీడా పోటీల్లో కర్నూలు జర్నలిస్టుల జట్టు విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. జిల్లా మేనేజర్ మధు సుధాకర్ మాట్లాడుతూ ఈ నెల 12 వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు వైజాగ్‌లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జర్నలిస్టు పోటీల్లో 15 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్డీ రవిప్రకాష్, టౌన్ డీఎస్పీ రమణమూర్తి, టీమ్ కోచ్ రామాంజనేయులు, సీఐలు డేగల ప్రభాకర్, నాగరాజరావు, నాగరాజు యాదవ్, మహేశ్వర్‌రెడ్డి, మధూసూదన్‌రావు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement