ఢాకా: ఓ బ్యాట్స్‌మన్ ఆవేశం... 14 ఏళ్ల టీనేజ్ క్రికెటర్ ప్రాణం తీసింది. చిట్టగాంగ్‌లో స్థానిక రెండు జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది. బ్యాట్స్‌మన్ తాను అవుటైన కోపంతో అక్కడి స్టంప్‌ను తీసి విసురుగా గాల్లోకి ఎగిరేశాడు. అయితే అది కిందికి వస్తూ వికెట్లకు సమీపంలోనే ఫీల్డింగ్ చేస్తున్న ఫైజల్ హుస్సేన్ తల, మెడ భాగంలో గట్టిగా తగలడంతో వెంటనే కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయినట్టు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జహంగీల్ ఆలమ్ తెలిపారు. అయితే ఉద్దేశపూర్వకంగా చంపలేదనే కోణంలో పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.