ఫుట్‌బాల్ ఆటలో రెడ్,యెల్లో కార్డ్‌లు జారీ చేయడం సాధారణంగా చూస్తుంటాం. గ్రౌండ్‌లో గొడవకు దిగడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించడం లాంటివి చేస్తే రెడ్‌కార్డ్ జారీ చేస్తారు. రెడ్‌కార్డ్ జారీ చేస్తే మ్యాచ్ ముగిసేవరకు మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఇక వార్నింగ్ ఇచ్చి వదిలేయడానికి యెల్లోకార్డ్ జారీ చేయడం చూస్తుంటాం. ఈ రెండుకార్డులు కాకుండా మరొక కార్డు ఉంటుంది. అదే వైట్‌కార్డ్. ఫుట్‌బాల్ చరిత్రలో ఈ కార్డులు ప్రవేశపెట్టినప్పటి నుంచి వైట్‌కార్డ్ చూపించింది లేదు. తాజాగా మాత్రం మహిళల ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా రిఫరీ వైట్‌కార్డ్ చూపించడం ఆసక్తి కలిగించింది.
విషయంలోకి వెళితే.. శనివారం పోర్చుగల్‌లో బెన్‌ఫికా, స్పోర్టింగ్ లిస్బన్ మధ్య మహిళల ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో కాసేపట్లో తొలి హాఫ్ ముగుస్తుందన్న దశలో స్టాండ్స్‌లో ఒక అభిమాని అనారోగ్యానికి గురయ్యాడు. ఇది గమనించిన రిఫరీ వైట్‌కార్డ్ చూపించాడు. క్రీడలో వైట్‌కార్డ్ అనేది క్రీడాస్పూర్తికి చిహ్నంగా పరిగణిస్తారు. రిఫరీ వైట్‌కార్డ్ చూపెట్టగానే మెడికల్ సిబ్బంది సదరు అభిమానికి మెడికల్ ట్రీట్‌మెంట్ అందించారు. జరుగుతున్నది ఫ్రెండ్లీ మ్యాచ్ కాబట్టి ఇరుజట్ల మేనేజ్‌మెంట్‌కు క్రీడాస్పూర్తి చూపించాలనే ఇలా చేసినట్లు రిఫరీ మ్యాచ్ అనంతరం వెల్లడించారు.
ఇక పోర్చుగల్ సహా ఫుట్‌బాల్ అంతర దేశాలలో వైట్‌కార్డ్ జారీని ప్రవేశపెట్టారు. ఇటీవలే ఫుట్‌బాల్ అంతర్జాతీయ గవర్నింగ్ బాడీ ఆటగాడు గాయపడితే కంకషన్ ప్లేయర్(సబ్‌స్టిట్యూట్) వచ్చేందుకు వైట్‌కార్డ్ ఉపయోగించడం మొదలుపెట్టింది. అలాగే ఖతర్ 2022 వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల్లోనూ వైట్‌కార్డ్‌ను ప్రవేశపెట్టినప్పటికి రిఫరీలు వాటిని ఉపయోగించలేదు. తాజాగా ఒక ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తొలిసారిగా వైట్‌కార్డ్ ఉపయోగించి రిఫరీ చరిత్ర సృష్టించాడు.
As equipas médicas de Benfica e Sporting receberam cartão branco após assistirem uma pessoa que se sentiu mal na bancada 👏 pic.twitter.com/ihin0FAlJF
— B24 (@B24PT) January 21, 2023
చదవండి: 'అలా అయితేనే టీమిండియాను కొట్టగలం'.. ఆసీస్‌కు సూచనలు
Comments
Please login to add a commentAdd a comment