Bride Called Off Her Wedding Because The Groom Could Not Say The PM Name, Details Inside - Sakshi
Sakshi News home page

బావా మరదలు సరదా ఆట..! అసలు విషయం తెలియడంతో పెళ్లి క్యాన్సిల్‌

Published Wed, Jun 21 2023 5:11 PM | Last Updated on Wed, Jun 21 2023 8:00 PM

BrideGroom Cancelled Marriage For Groom Unable To Tell PM Name - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఓ వింత సంఘటన జరిగింది. ప్రధాని పేరు చెప్పలేకపోయాడని ఓ వధువు పెళ్లిని రద్దు చేసింది. అంతేకాకుండా వెంటనే వరుని తమ్ముడినే వివాహమాడింది. సైద్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది..
శివ శంకర్(27) నాసిర్‌పూర్ గ్రామానికి చెందిన రామ్ అవతార్ కుమారుడు. ఇతనికి సమీప గ్రామానికి చెందిన రంజన అనే అమ్మాయితో జూన్ 11న వివాహం జరిగింది. మరుసటి రోజు వధువు ఇంటి వద్ద ఓ చిన్న వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో వరుడు తన మరదలు, బావమరిదిని సరదాగ ప్రశ్నలు అడిగాడు. ఈ క్రమంలో మరదలు కూడా వరున్ని ప్రధాని ఎవరని ప్రశ్నించింది.

దేశ ప్రధాని పేరు ఆయన చెప్పలేకపోయాడు. వధువు బంధువులు వరున్ని హేళన చేశారు. దీన్ని అవమానంగా భావించిన రంజన అక్కడికక్కడే అనంత్‌ను వివాహమాడింది. అనంత్ శివ శంకర్ సోదరుడు. వయస్సులో చిన్నవాడు. దీనిని రామ్ అవతార్ ఖండించాడు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 
ఇదీ చదవండి: స్నేహితురాలిపై ప్రేమతో ఆమె..‘అతని’గా మారాలనుకుంది.. తరువాత జరిగిన దారుణమిదే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement