పలు రైళ్ళు రద్దు
పలు రైళ్ళు రద్దు, దారి మళ్లింపు
Published Tue, Sep 6 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
* 21 నుంచి 28వ తేదీవరకు మార్పులు
* విజయవాడ రైల్వేస్టేషన్‌లో పనుల కారణంగానే...
నగరంపాలెం: విజయవాడ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్ ఇంటర్ లాకింగ్ సిస్టం పనులు జరుగుతున్నందున ఈనెల 21 నుంచి 28 వరకు వివిధ తేదీల్లో పలు రైళ్ళు రద్దు, దారిమళ్లింపు, పాక్షికంగా రద్దు చేసినట్టు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజరు కె. ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
రద్దు చేసిన ఎక్స్‌ప్రెస్ రైళ్ళు..
ట్రై న్‌నెం 17239/17240 గుంటూరు–విశాఖపట్నం–గుంటూరు ఎక్స్‌ప్రెస్ 22,23,24 తేదీల్లో, ట్రై న్‌నెం 17201/17202 గుంటూరు– సికింద్రాబాద్–గుంటూరు 23 తేదీ, ట్రై న్‌నెం 17212 యశ్వంతపూర్–మచిలీపట్నం 24వ తేదీ బయలుదేరి 25వ తేదీ గుంటూరు వచ్చేది, ట్రై న్‌నెం17644 కాకినాడ పోర్టు – చెన్నైఎగ్‌మోర్ ఎక్స్‌ప్రెస్ 23వ తేదీ, ట్రై న్‌నెం17643 చెన్నై ఎగ్‌మోర్–కాకినాడపోర్టు ఎక్స్‌ప్రెస్ 23వ తేదీ బయలుదేరి గుంటూరు 24వ తేదీ వచ్చేది, ట్రై న్‌నెం 17211 మచిలీపట్నం– యశ్వంతపూర్ 23 తేదీ, ట్రై న్ నెం 17212 యశ్వంతపూర్–మచిలీపట్నం 24వ తేదీలలో రద్దు చేశారు.
గుంటూరు స్టేషన్ నుంచే రాకపోకలు సాగించే∙రైళ్ళు..
ట్రై న్ నెం 12077/12078 చెన్నై సెంట్రల్ –విజయవాడ– చెన్నై ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 21 నుంచి 26 వ తేదీ వరకు, ట్రై న్ నెం 17226/17225 హుబ్లీ– విజయవాడ–హుబ్లీ సెప్టెంబరు 21,22,23 తేదీలలో, ట్రై న్ నెం 12796/12795 సికింద్రాబాద్–విజయవాడ–సికింద్రాబాద్ సెప్టెంబరు 21 నుంచి 24 వ తేదీ వరకు, ట్రై న్‌నెం 17216 ధర్మవరం– విజయవాడ ఎక్స్‌ప్రెస్ రైలు సెప్టెంబరు 20,22 తేదీలలో, ట్రై న్‌నెం 17215 విజయవాడ–ధర్మవరం సెప్టెంబరు 21,24 తేదీలలో గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి గుంటూరు రైల్వే స్టేషన్ వరకే నడుస్తాయి.
వేరే డివిజన్ మీదుగా దారిమళ్లించిన రైళ్లు..
ట్రై న్ నెం 16032 జమ్ముతావీ– చైన్నె ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 23 వతేదీ, ట్రై న్‌నెం నెం 17221 కాకినాడపోర్టు– లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 21,24 తేదీలలో, ట్రై న్‌నెం 12805/12806 సికింద్రాబాద్– విశాఖపట్నం– సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 22,23 తేదీలలో, ట్రై న్ నెం 18464 బెంగుళూరు సిటీ– భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 22 తేదీ, ట్రై న్ నెం 17222 లోకమాన్యతిలక్– కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 23, 26 తేదీలలో, ట్రై న్‌నెం 17231 నర్సపూర్–నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 23వ తేదీ, ట్రై న్‌నెం 18463 భువనేశ్వర్– బెంగుళూరు సిటీ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 23 వ తేదీ, ట్రై న్ నెం 17204 కాకినాడ టౌన్–భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ 22 తేదీలలో గుంటూరు నుంచి కాకుండా వేరే డివిజను నుంచి దారి మళ్లించారు.
గుంటూరు డివిజను మీదుగా దారిమళ్ళించిన రైళ్ళు..
ట్రై న్‌నెం 12706/12705 గుంటూరు–సికింద్రాబాద్– గుంటూరు సెప్టెంబరు 21 నుంచి 26 తేదీలలో ,ట్రై న్‌నెం 17406/17405 ఆదిలాబాద్–తిరుపతి కష్ణా ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 21 నుంచి 26వ తేదీ వరకు, ట్రై న్‌నెం 12710 సికింద్రాబాద్–గుడూరు సింహపూరి ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 22,23 తేదీలలో, ట్రై న్ నెం 12764/12763 సికింద్రాబాద్–తిరుపతి–సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 22,23,24,25,26 తేదీలలో గుంటూరు డివిజనులోని పగిడపర్రి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, సత్తెనపల్లి ,గుంటూరు మీదుగా నడుస్తాయి.
రీషెడ్యూల్ చేసిన ఎక్స్‌ప్రెస్ రైళ్ళు..
ట్రై న్‌నెం 22831 హౌరా జంక్షన్ –సాయిప్రశాంతినిలయం ఎక్స్‌ప్రెస్ రైలు సెప్టెంబరు 21 తేదీ 15.35కు బయలుదేరాల్సి ఉండగా 19.30కి , ట్రై న్‌నెం 16031 చెన్నైసెంట్రల్–జమ్ముతావీ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 22 వ తేదీ 5.15కి బయలుదేరాల్సి ఉండగా 08.30కి, ట్రై న్‌నెం 18047 హౌరా జంక్షన్–వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 22వ తేదీ 23.30కి బయలుదేరాల్సి ఉండగా 23వ తేదీ 05.00గంటలకు, ట్రై న్‌నెం 22832 సాయి ప్రశాంతినిలయం–హౌరా జంక్షన్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 23 వ తేదీ 07.40కి బయలుదేరాల్సి ఉండగా 11.00 గంటలకు బయలుదేరేవిధంగా షెడ్యూల్ మార్పు చేశారు.
గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి రద్దు చేసిన ప్యాసింజరు రైళ్ళు..
ట్రై న్ నెం 77221 విజయవాడ– గుంటూరు సెప్టెంబరు 22 నుంచి 28వతేదీ వరకు, ట్రై న్‌నెం 57382 నర్సపూర్–గుంటూరు సెప్టెంబరు 21 నుంచి 28 వరకు, ట్రై న్‌నెం 77283/77284 గుంటూరు–విజయవాడ –గుంటూరు సెప్టెంబరు 21,22,23,24,26,27,28 తేదీలలో, ట్రై న్‌నెం 67273 /67274 విజయవాడ– గుంటూరు–విజయవాడ సెప్టెంబరు 21 నుంచి 28 వరకు, ట్రై న్‌నెం 57381 గుంటూరు – నర్సాపూర్ సెప్టెంబరు 20 నుంచి 27 వరకు,ట్రై న్‌నెం 57316 నర్సాపూర్ – గుంటూరు సెప్టెంబరు 21 నుంచి 28 వరకు, ట్రై న్‌నెం 77230 గుంటూరు– విజయవాడ సెప్టెంబరు 21 నుంచి 28 వరకు, ట్రై న్‌నెం 77289 గుంటూరు– విజయవాడ సెప్టెంబరు 21, 22, 23, 24, 26, 27, 28 తేదీలలో రద్దు చేశారు.
పాక్షికంగా రద్దు చేసిన ప్యాసింజరు రైళ్ళు..
ట్రై న్‌నెం 56503 /56504 బెంగుళూరు –విజయవాడ– బెంగుళూరు, ట్రై న్‌నెం 56501 /56502 విజయవాడ–హూబ్లీ–విజయవాడ, ట్రైన్ నెం 57318 మాచర్ల–బీమవరం జంక్షన్ ప్యాసింజరు రైళ్ళు సెప్టెంబరు 21 నుంచి 28 వరకు విజయవాడ, గుంటూరు మధ్యలో రద్దుచేశారు. ట్రై న్‌నెం 67254/67259 విజయవాడ– గుంటూరు– విజయవాడ ప్యాసింజరు రైలు కెనాల్, విజయవాడ మధ్యలో రద్దు చేశారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాల్సిందిగా సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు తెలిపారు.
Advertisement
Advertisement