జార్ఖండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న రైలు ప్రమాదం తర్వాత ఈ మార్గంలోని అరడజనుకు పైగా రైళ్లు రద్దు కావడంతో ఒకవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు రైల్వేశాఖ ఆదాయానికి గండిపడింది.
తాజాగా రాజ్‌నంద్‌గావ్-కల్మనా రైల్వే సెక్షన్ మధ్య మూడవ రైల్వే లైన్‌ను కలమన రైల్వే స్టేషన్‌కు అనుసంధానించేందుకు రైల్వేశాఖ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, ప్రీ నాన్-ఇంటర్‌లాకింగ్ పనులను చేపట్టింది. దీంతో ఎక్స్‌ప్రెస్, మెమూ రైళ్లు ఆగస్టు 4 నుండి 20 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో రక్షాబంధన్ సందర్భంగా ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
బిలాస్‌పూర్- నాగ్‌పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రద్దు ప్రభావం అటు ప్రయాణికులపైన, ఇటు రైల్వే ఆదాయంపైన పడనుంది.అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో గత మూడు నెలలుగా రాయ్‌పూర్ మీదుగా వెళ్లే రైళ్లను తరచూ రద్దు చేస్తున్నారు. ఈసారి ఏకంగా 72 రైళ్లను (416 ట్రిప్పులు) రద్దు చేయడంతో ఐదు లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో కన్ఫర్మ్ చేసిన 4 లక్షల 32 వేల టిక్కెట్లను రద్దు చేయడంతో, రైల్వేశాఖ ప్రయాణికులకు రూ.28 కోట్ల 86 లక్షలు వాపసు చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment