
భారీ వర్షం కారణంగా ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మధ్య ఆదివారం మాంచెస్టర్‌లో జరగాల్సిన చివరి టి20 మ్యాచ్ రద్దయింది. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. దాంతో టాస్ కూడా వేయకుండా నిర్ణీత సమయానికి రెండు గంటల తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. ఈ నెల 19 నుంచి ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లతో కూడిన వన్డే సిరీస్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment