
మాంచెస్టర్: నాలుగో టెస్టులో గెలిచి యాషెస్ సిరీస్‌లో సజీవంగా ఉండాలని ఆశించిన ఇంగ్లండ్ జట్టుపై వరుణ దేవుడు కరుణించలేదు. ఎడతెరిపిలేని వాన కారణంగా ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టులో ఐదో రోజు ఆట సాధ్యపడలేదు. దాంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 214/5తో మరో 61 పరుగులు వెనుకంజలో నిలిచింది.
ఐదో రోజు త్వరగా ఆ్రస్టేలియాను ఆలౌట్ చేసి విజయంపై ఇంగ్లండ్ కన్నేసింది. కానీ వర్షం కారణంగా ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుత ఐదు టెస్టుల సిరీస్‌లో ఆ్రస్టేలియా 2–1తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో ఇంగ్లండ్ నెగ్గినా సిరీస్ 2–2తో సమంగా ముగుస్తుంది. అయితే క్రితంసారి యాషెస్ సిరీస్‌లో ఆ్రస్టేలియా గెలుపొందడంతో ఈసారీ ఆ జట్టు వద్దే యాషెస్ సిరీస్ ట్రోఫీ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment