
లండన్: కరోనా ప్రభావం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కీలక నిర్ణయం తీసుకునేలా చేసింది. మే 28 వరకు ఎలాంటి ప్రొఫెషనల్ క్రికెట్‌ను తాము నిర్వహించడం లేదని ఈసీబీ ప్రకటించింది. తాజా సీజన్‌ను ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు ఈసీబీ వెల్లడించింది.
శ్రీలంకలో కూడా: శ్రీలంకలోనూ అన్ని రకాల దేశవాళీ క్రికెట్‌ను రద్దు చేస్తున్నట్లు లంక బోర్డు ప్రకటించింది. గత మంగళవారం శ్రీలంకలో ప్రతిష్టాత్మక వార్షిక స్కూల్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. దీనికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. వీరిలో ఒకరికి కరోనా ఉన్నట్లు బయటపడింది. దాంతో అందరిలో ఆందోళన నెలకొంది. నిజానికి ఈ మ్యాచ్‌ను ఆపేయాలని స్వయంగా దేశాధ్యక్షుడు గొటబాయ ఆదేశించినా నిర్వాహకులు దీనిని పట్టించుకోలేదు. తాజా ఘటన కారణంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రికెట్ పూర్తిగా రద్దయింది.
Comments
Please login to add a commentAdd a comment