
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ పలు దేశాలకు వ్యాపించిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక విదేశీ పర్యటన రద్దయింది. మార్చి 13న ఇండియా-ఈయూ సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టాల్సిన బ్రసెల్స్ పర్యటన రద్దయింది. సభ్య దేశాలతో సంప్రదింపుల అనంతరం తదుపరి తేదీలను వెల్లడిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ గురువారం వెల్లడించారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఏడాది మార్చి 13న బ్రసెల్స్‌లోని ఈయూ కార్యాలయంలో ఇండియా-ఈయూ సదస్సు జరగాల్సి ఉంది. బ్రసెల్స్‌లో బుధవారం పది కరోనా వైరస్ కేసులు కొత్తగా వెలుగుచూడటంతో బెల్జియంలో కరోనా కేసుల సంఖ్య 23కు చేరుకుంది. ఈయూ, భారత్‌ల మధ్య సన్నిహిత సహకార బంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని ఆశిస్తున్నామని రవీష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన షెడ్యూల్‌కు అనుగుణంగా జరుగుతుందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment