ట్రూజెట్ సర్వీసు రద్దు
Published Wed, Jul 27 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
మధురపూడి : హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమానా్రÔ¶ యానికి సాయంత్రం 4–20 గంటలకు రావాల్సిన ట్రూజెట్ విమాన సర్వీసు మంగళవారం కూడా రద్దయింది. సాంకేతిక కారణాల వల్ల ఈ సర్వీసు రద్దయినట్టు స్థానిక ప్రతినిధి తెలిపారు. సాయంత్రం 4–20 గంటలకు ఇక్కడకు చేరే ఈ సర్వీసు 4–40 గంటలకు తిరిగి చెన్నైకు బయలుదేరుతుంది. కొన్ని రోజులుగా ఈ సర్వీసు రద్దవుతున్న సంగతి తెల్సిందే. కాగా వర్షాకాలం ప్రారంభం కావడం, విమాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడటం ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధికారులు దీనిని నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Advertisement
Advertisement