![Geetla Rajender reddy Meet CM kcr - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/17/kcr_0.jpg.webp?itok=efcQK_o2)
సీఎంకు నమస్కరిస్తున్న రాజేందర్‌రెడ్డి
పెద్దపల్లి: అమ్మ ఎట్లుంది.. ఆరోగ్యం బాగుందా.. నాన్న చనిపోయి నాలుగేండ్లయిందా? పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి తనయుడు రాజేందర్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుశల ప్రశ్నలు అడిగారు. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో గురువారం సీఎంను కలిసిన రాజేందర్‌రెడ్డి పరిచయం చేసుకునేలోపే అమ్మ బాగుందా అని అడగడంతో అమ్మ కూడా చనిపోయిందని సమాధానమిచ్చారు. దీంతో కాసేపు విచారం వ్యక్తం చేసి దగ్గరకు తీసుకున్నారు.
అనంతరం రాజేందర్‌రెడ్డి పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము మనో హర్‌రెడ్డి గెలుపు కోసమే పనిచేశామని, తిరిగి అప్పటి నుంచి టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇకముందు కూడా టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతూ పార్టీ విజయానికి సహకరిస్తామని సీఎంకు వివరించారు. స్పందించిన సీఎం తన ఆశీస్సులు ఉంటాయని రాజేందర్‌రెడ్డి నుంచి ఫోన్ నంబరు తీసుకోవాలని ఓఎస్‌డీని ఆదేశించారు. ఆయన వెంట కాశెట్టి కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment